Indians in Ukraine: ఇంకా యుక్రెయిన్ లోనే ఉన్న భారతీయుల పరిస్థితేంటి?

యుక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రకటించింది. ఈక్రమంలో ఇంకా యుక్రెయిన్ లోనే ఉన్న భారత పౌరుల భద్రతపై స్వదేశంలో ఆందోళన వ్యక్తం అవుతుంది.

Indians in Ukraine: అంతా బావించినట్టే జరిగింది. యుక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రకటించింది. రష్యా కాలమానం ప్రకారం గురువారం తెల్లవారు జామున యుక్రెయిన్ పై సైనిక చర్యలు ప్రారంభించిన రష్యా.. తూర్పు యుక్రెయిన్ లోని మారియుపోల్ నగరంపై బాంబులతో విరుచుకుపడింది. యుక్రెయిన్ పై ముప్పేట దాడి చేస్తున్న రష్యా బలగాలు ఇప్పటికే రాజధాని కీవ్ లోకి చొచ్చుకువెళ్లారు. ఇక యుద్ధం ప్రారంభమవడంతో యుక్రెయిన్ లో ప్రజల ప్రాణాలు, భద్రత పై ఆందోళన వ్యక్తం అవుతుంది. ఇప్పటికే దేశంలో ఎమర్జెన్సీ విధించిన యుక్రెయిన్ ప్రభుత్వం.. ప్రజలు ఎక్కడివారక్కడే ఉండిపోవాలని, అత్యవసర సమయానికి తిండి, నీరు సమకార్చుకోవాలని సూచించింది. ఈక్రమంలో ఇంకా యుక్రెయిన్ లోనే ఉన్న భారత పౌరుల భద్రతపై స్వదేశంలో ఆందోళన వ్యక్తం అవుతుంది.

Also read: Global Markets: యుద్ధం ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో గ్లోబల్‌ మార్కెట్!

యుక్రెయిన్ లోన్ ఉన్న భారత విద్యార్థులను ఇతర పౌరులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు ఎయిర్ ఇండియా మూడు విమాన సర్వీసులు ప్రారంభించింది. అందులో భాగంగా మంగళవారం నాడు ఒక విమానం యుక్రెయిన్ నుంచి ఢిల్లీకి చేరుకోగా.. 246 మంది భారతీయులు స్వదేశంలో సురక్షితంగా అడుగుపెట్టారు. రెండో సర్వీసులో భాగంగా గురువారం తెల్లవారు జామున బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం.. యుక్రెయిన్ కు చేరకుండానే వెనుదిరిగింది. అప్పటికే యుక్రెయిన్ రాజధాని కీవ్ ను రష్యా బలగాలు చుట్టుముట్టడంతో.. అక్కడి గగనాతలంలో ప్రమాదం పొంచి ఉందంటూ యుక్రెయిన్ ప్రభుత్వం హెచ్చరించింది. దీంతో కీవ్ దాకా వెళ్లిన ఎయిర్ ఇండియా AI1947 విమానం వెనుదిరిగింది.

Also read: Russia-Ukraine: యుద్ధం మొదలైంది.. పుతిన్ ఆదేశాలు.. యుక్రెయిన్‌పై బాంబులతో రష్యా దాడి

ఇంకా యుక్రెయిన్ లోనే ఉన్న భారత పౌరుల భద్రత నిమిత్తం భారత రాయబార కార్యాలయ అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. వారిని సురక్షిత ప్రాంతాల్లో ఉండాలంటూ సెల్ ఫోన్ ద్వారా సందేశాలు పంపిస్తున్నారు. శాంతి వాతావరణం(White Flag) నెలకొన్న అనంతరం తరలింపు ప్రక్రియపై వివరాలు వెల్లడిస్తామని.. అంతవరకూ యుక్రెయిన్ ప్రభుత్వ సూచనలను, మార్గదర్శకాలను పాటించాలని భారత రాయబార కార్యాలయం తెలిపింది. విద్య, వ్యాపారం సహా వివిధ కారణాల నిమిత్తం సుమారు 20 వేల మంది భారతీయులు యుక్రెయిన్ లో నివసిస్తున్నారు. వారిలో ఇప్పటి వరకు 5 శాతం మంది మాత్రమే యుక్రెయిన్ దాటి ఉంటారని సమాచారం.

Also read; Russaia Ukraine War – Live Updates: యుద్ధం మొదలైంది.. యుక్రెయిన్‌పై విరుచుకుపడుతున్న రష్యా

ట్రెండింగ్ వార్తలు