Condoms Expensive : వామ్మో.. ఒక కండోమ్ ప్యాకెట్ ధర రూ.60వేలు.. ఎందుకంత రేటు అంటే

ఒక కండోమ్ ప్యాకెట్ ధర అక్షరాల రూ.60వేలు.. ఏంటి షాక్ అయ్యారా? దిమ్మతిరిగిపోయిందా? కండోమ్ ప్యాకెట్ ఏంటి? రూ.60వేలు పలకడం ఏంటి? అని విస్తుపోతున్నారా?

Condoms Expensive : ఎయిడ్స్, సుఖ వ్యాధులు, అవాంఛిత గర్భాన్ని నివారించడానికి కండోమ్ లను వాడాలని ప్రభుత్వాలే ప్రచారం చేస్తాయి. ఈ మేరకు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తాయి. ఇక పలు దేశాల్లో ప్రభుత్వాలే స్వయంగా కండోమ్ ప్యాకెట్లను ప్రజలకు ఉచితంగా ఇస్తుంటాయి. అలా కాకుండా సొంతంగా కొనుగోలు చేసినా బ్రాండ్ ను బట్టి గరిష్టంగా కండోమ్ ప్యాకెట్ ధర రూ.100 ఉండొచ్చు.

కాగా, ఒక కండోమ్ ప్యాకెట్ ధర అక్షరాల రూ.60వేలు పలికితే.. ఏంటి షాక్ అయ్యారా? దిమ్మతిరిగిపోయిందా? కండోమ్ ప్యాకెట్ ఏంటి? రూ.60వేలు పలకడం ఏంటి? అని షాక్ అవుతున్నారా? కానీ, ఇది నిజం. అయితే, ఈ ధర మన దేశంలో కాదులెండి.. వెనిజులాలో ఈ పరిస్థితి ఏర్పడింది. వెనిజులాలో ఒక కండోమ్ ప్యాకెట్ ధర రూ.60వేలకు చేరింది. ఈ ధరకు ఆ దేశంలో హై ఎండ్ బ్రాండెడ్ టీవీలను కొనుక్కోవచ్చు. అదే మన దేశంలో అయితే తులం బంగారం కొనొచ్చని సెటైర్లు వేస్తున్నారు.

Russia Condom Sales : యుద్ధం వేళ.. రష్యాలో భారీగా పెరిగిన కండోమ్ అమ్మకాలు

వెనిజులాలో ఈ రేంజ్‌లో కండోమ్‌ ధర పెరగడానికి కారణం అక్కడి చట్టాలే. వెనిజులాలో అబార్షన్‌లు చట్ట విరుద్ధం. ఆ దేశంలో చట్టవిరుద్ధ అబార్షన్లు చేస్తే కఠిన శిక్షలు ఉన్నాయి. దీంతో జనాలు పెద్ద ఎత్తున కండోమ్‌లు కొనుగోలు చేస్తున్నారు. కండో మ్ లకు భారీ డిమాండ్ ఉండటంతో రేట్లను పెంచేశారు.

Condom Holes : వార్నీ.. కండోమ్‌కి కన్నం పెట్టింది.. కటకటాల పాలైంది.. ఆ దేశంలోనే తొలి కేసు

ఐక్యరాజ్యసమితి వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్ 2015 ప్రకారం ప్రపంచంలోనే అత్యధికంగా టీనేజ్ గర్భిణీలున్న దేశాల్లో వెనిజులా ఒకటి. ఈ నేపథ్యంలోనే ఈ దేశంలో అబార్షన్‌ చట్టాలను కఠినతరం చేశాయి. దీంతో పెద్దఎత్తున కండోమ్‌లకు డిమాండ్‌ పెరగడంతో ధరలకు రెక్కలొచ్చాయి. కండోమ్‌ ధరలు ఓ రేంజ్‌లో పెరగడంతో వెనిజులాలో సామాన్య ప్రజలు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. దీనిపై స్థానికులు గగ్గోలు పెడుతున్నారు.

ప్రభుత్వం వెంటనే స్పందించాలని.. కండోమ్ ధరలను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి స్పందన లేదని స్థానికులు వాపోతున్నారు. ఇది ఇలా ఉంటే.. వెనిజులాలో కండోమ్ ప్యాకెట్ ధర రూ.60వేలు పలకడం యావత్ ప్రపంచాన్ని విస్మయానికి గురి చేసింది.

ట్రెండింగ్ వార్తలు