Cheetah Attack On Lion : సింహాన్ని పరుగు పెట్టించిన చిరుతపులి

కన్న బిడ్డలను కాపాడుకోటానికి ఏ తల్లైనా ఎంతకైనా తెగిస్తుందనేది అందరికీ తెలిసిన విషయమే. నైరోబి‌లో  ఒక చిరుతపులి సింహం బారి నుంచి తన బిడ్డలను రక్షించుకుంది.

Cheetah Attack On Lion :  కన్న బిడ్డలను కాపాడుకోటానికి ఏ తల్లైనా ఎంతకైనా తెగిస్తుందనేది అందరికీ తెలిసిన విషయమే. నోరు ఉన్న మానవులైనా, నోరు లేని జంతువులైనా బిడ్డలను కాపాడుకోటానికి శక్తి మేర పోరాడుతారు.  కొద్ది రోజుల క్రితం ఒకపాము నుంచి  తన పిల్లలను కాపాడుకోటానికి  కోడి, పాముతో పోరాడిన వీడియో చాలా మంది సోషల్ మీడియాలో చూసే ఉంటారు. ఇప్పుడు నైరోబి‌లో   ఒక చిరుతపులి సింహం బారి నుంచి తన బిడ్డలను రక్షించుకుంది.

కెన్యాలోని  మాసై  మారా  నేషనల్  రిజర్వ్ ఫారెస్ట్‌లో  అడవికి  రారాజైన సింహం   ఒకరోజు వేటకు బయలు దేరింది.  కొంత దూరం వెళ్లేసరికి  దానికి ఒక చిరుతపులి  దాని పిల్లలు కనపడ్డాయి.  హమ్మయ్య మనకు విందు భోజనం దొరకిందని సంతోషించింది.  పిల్లల నుంచి తల్లిని వేరు చేసేందుకు చిరుతను భయపెట్టింది  రారాజు సింహం.  సింహం బెదిరింపులకు భయపడిపోయిన చిరుతపులి   కాస్త వెనక్కు తగ్గింది.

Also Read : Dating App Love : డేటింగ్‌ యాప్‌లో పరిచయం…రూ.18 లక్షలు దోచేసిన ప్రియుడు

ఒకనొక దశలో పారిపోబోయింది.  చిరుత  వెనక్కు తగ్గేసరికి సింహం  చిరుత  పిల్లల వైపు దూసుకు వచ్చింది.   ముంచుకొస్తున్న ప్రమాదాన్ని గ్రహించిన చిరుత తన పిల్లలను కాపాడుకోటానికి ఉద్యుక్తురాలైంది.  తన కంటే 3 రెట్టు  పెద్దదైన    బలమైన సింహంతో   పోరాటానికి   సిధ్దపడింది.  తీక్షణమైన చూపులతో గాండ్రిస్తూ   సింహం   వైపు   దూసుకు వచ్చింది.   అప్పటి దాకా చిరుత పులి పిల్లపై దాడి చేయటానికి ముందుకు వెళుతున్న సింహం ఒక్కసారిగా వెనకడుగు వేసింది.

చిరుతపులి ఒక్కో అడుగు ముందుకు వేస్తూ వస్తోంది.  పులి ఒక్కో అడుగు వెనక్కు వేస్తూ వెళుతోంది.  చిరుతపులి ఒక్కసారిగా ఎగిరి సింహం మీదకు దూకింది.  అంతే సింహం   వెనుక్కు తిరిగి పరుగు లంకించుకుంది. సింహాన్ని  వెంటాడుతూ  చిరుత పరుగు పెట్టింది.  చిరుత దెబ్బకు సింహం  ప్రాణాలు చేత బట్టుకుని పరుగు లంకించుకుంది. ఈ అద్బుత దృశ్యాలను  రిజర్వ్ ఫారెస్ట్ లోని  కిసెమీ సరునీ అనే గైడ్ వీటిని తన స్టిల్ కెమెరాలో చిత్రీకరించింది.

ట్రెండింగ్ వార్తలు