Donald Trump : అందరి బిల్లు నేనే చెల్లిస్తానని చెప్పి హోటల్ బిల్లు కట్టకుండా ఎస్కేప్ అయిన ట్రంప్.!

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రెస్టారెంట్ బిల్ ఎగ్గొట్టి వెళ్లిపోయారట. తన అభిమానులకు ఫుడ్ ఫ్రీగా పెట్టిస్తానని చెప్పి రెస్టారెంట్ బిల్ కట్టకుండానే వెళ్లిపోయారని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.

Donald Trump in Cuban restaurant

Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ( Donald Trump)అంటేనే ఓ సంచలనం.ఆయన వ్యాఖ్యలు..చేసే పనులు అంతా వైరల్ అవుతుంటాయి. అటువంటి ట్రంప్ ‘హోటల్ బిల్లు ఎగ్గొట్టి ఎస్కేప్ అయ్యారు’ అంటూ మరోసారి వార్తల్లో నిలిచారు. ఓ హోటల్ కు వచ్చిన ట్రంప్ తనను చూడటానికి వచ్చినవారందరిపై ముచ్చటించారు.వారితో కలిసి ఫోటోలకు పోజులిచ్చారు. ఆతరువాత మీకు ఏది కావాలంటే అది తినండీ బిల్ నేనిస్తానన్నారు. ఆ తరువాత ట్రంప్ బిల్ చెల్లించకుండానే అక్కడనుంచి ఎస్కేప్ అయ్యారు అనే వార్త వైరల్ అవుతోంది.

గత మంగళవారం (జూన్,2023) ట్రంప్ మియామీ(Miami)లోని ఓ క్యూబన్(క్యూబా దేశపు ఫేమస్ వంటకాల రెస్టారెంట్)రెస్టారెంట్‌ ( Cuban restaurant)కు వెళ్లారు. అక్కడకు ట్రంప్ (Trump)వచ్చారని తెలిసి చాలామంది ఆయన్ని చూడటానికి వచ్చారు. అలా వచ్చినవారితో ఆ రెస్టారెంట్ అంతా క్రిక్కిరిసిపోయింది. దాంతో ట్రంప్ ఆనందపడిపోయారు. మీ అభిమానానికి ధన్యవాదాలు…ఇక్కడ మీకు నచ్చింది తినండీ బిల్ నేనిస్తాను అంటూ చెప్పారు. అలా కాసేపు వారితో ముచ్చటించారు. ఆ తరువాత ఆయన బిల్లు చెల్లించకుండానే వెళ్లిపోయారని అక్కడున్న కొందరు తెలిపారు. ఈ వార్త కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మాజీ పెద్దన్నా ఇదేం పని అంటూ ట్రోల్ చేస్తున్నారు కొంతమంది నెటిజన్లు..

Putin confirms first nuclear weapons: ఫస్ట్ అణ్వాయుధాలను బెలారస్‌కు తరలించాం..వ్లాదిమిర్ పుతిన్ సంచలన వ్యాఖ్యలు

కానీ ఈ వార్తల్లో నిజం లేదంటూ ట్రంప్ వర్గం చెబుతోంది. ట్రంప్ వెళ్లిపోయిన వెంటనే రెస్టారెంట్‌లోని వారు కూడా ఆహారం ఆర్డర్ చేయకుండానే వెళ్లిపోయారని..కొంతమంది మాత్రం పార్సెల్ చేయించుకున్నారు వాటికి ట్రంప్ బిల్ చెల్లించారని చెబుతున్నారు. అంతేకాదు తనకు అద్భుతమైన ఆతిథ్యమిచ్చిన రెస్టారెంట్ నిర్వాహకులకు ట్రంప్ ధన్యవాదాలు చెప్పారని తెలిపారు.

కాగా ట్రంప్ ఇలా సడెన్ గా రెస్టారెంట్లకు రావటం గతంలో కూడా చాలాసార్లు జరిగింది. అక్కడికి వచ్చిన తన మద్దతుదారులకు ఆహారం కొనిస్తుంటారు. అలా జనాల్లో తన అభిమానాన్ని పెంచుకోవటానికి ట్రంప్ ఇటువంటివి చేస్తుంటారు. కాగా ట్రంప్ వచ్చే ఎన్నికల్లో అధ్యక్షుడిగా మరోసారి పోటీ చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇలా పబ్లిక్ లోకి వచ్చిన అభిమానులతో కలిసి ముచ్చటిస్తుంటారు. తనపై అభిమానాన్ని పెంచుకోవటానికి ఇలా చేస్తుంటారని అంటుంటారు కొంతమంది. ఇది రాజకీయ ఎత్తుగడ అని అంటుంటారు.

Germany Sword: జర్మనీలో మూడువేల ఏళ్లనాటి కత్తి లభ్యం.. దీని ప్రత్యేకత ఏమిటంటే ..

 

ట్రెండింగ్ వార్తలు