Elon musk: ట్విటర్‌కు కొత్త సీఈఓ..? మరికొందరు ఉద్యోగులకు ఉద్వాసన పలికే ఆలోచనలో మస్క్..

సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్ ను కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఎలాన్ మస్క్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ట్విటర్ సీఈవోగా పరాగ్ అగర్వాల్ కొనసాగుతున్నారు...

Elon musk: సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్ ను కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఎలాన్ మస్క్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ట్విటర్ సీఈవోగా పరాగ్ అగర్వాల్ కొనసాగుతున్నారు. అయితే త్వరలోనే పరాగ్ ను సీఈవోగా తొలగించేందుకు మస్క్ సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పరాగ్ స్థానంలో మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ యొక్క ప్రస్తుత చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ను కొత్త CEOగా నియమించేందుకు కసరత్తు జరుగుతున్నట్లు వార్తా సంస్థ రాయిటర్స్ నివేదించింది. ఎలోన్ మస్క్ ట్విటర్ ను 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన విషయం విధితమే. అయితే నిధులు సమకూర్చడానికి బ్యాంకులు అంగీకరించాయని ఇటీవల మస్క్ తెలిపారు. ఈ క్రమంలో ఖర్చులను తగ్గించే ప్రయత్నంలో సోషల్ మీడియా కంపెనీలో ఎగ్జిక్యూటివ్, బోర్డు చెల్లింపులను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటానని ట్వీట్లను మోనటైజ్ చేయడానికి కొత్త మార్గాలను అభివృద్ధి చేస్తానని ఎలాన్ ఇటీవల పేర్కొన్నారు.

Elon Musk buy Twitter: ఐదేళ్ల కిందట నెటిజన్ సవాల్.. ట్విట్టర్‌ను కొనేసిన మస్క్.. Viral Post

మస్క్ కు కంపెనీని అధికారికంగా అప్పగించే వరకు సీఈవో స్థానంలో పరాగ్ అగర్వాల్ కొనసాగనున్నారు. గతంలో ట్విట్టర్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా ఉన్న అగర్వాల్ నవంబర్‌లో సీఈవోగా నియమితులయ్యారు. ట్విటర్ యొక్క ప్రాక్సీ ప్రకారం 2021కి అతని మొత్తం పరిహారం 30.4 మిలియన్ డాలర్లు. అయితే ఒకవేళ పరాగ్ ను సీఈవో బాధ్యతల నుంచి 12 నెలల్లోగా తీసివేస్తే 42 మిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ విధానంపై మస్క్ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసినట్లు తెలుస్తోంది. కచ్చితంగా పరిహారాలు, వేతనాల్లో కోత ఉంటుందని మస్క్ తెలిపినట్లు సమాచారం. పరాగ్ తో పాటు ట్విటర్ లీగల్ హెడ్ గా ఉన్న విజయ గద్దెను సైతం మస్క్ తొలగిస్తారని సమాచారం.

Elon Musk: ఒకప్పుడు కోకాకోలాలో కొకైన్ ఉండేదా?.. ఎలన్ మస్క్ ఏమన్నాడంటే..

ట్విటర్ ను మస్క్ కొనుగోలు చేశారన్న వార్తలు వచ్చిన దగ్గర నుంచి ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. తమ భవితవ్యం ఏంటని ప్రస్తుత సీఈవో పరాగ్ ను ఇటీవల ఉద్యోగులు ప్రశ్నించినట్లు తెలిసింది. పరాగ్ మాత్రం ఉద్యోగుల ఒప్పందం అధికారికంగా పూర్తయ్యే వరకు తొలగింపు ఉండే అవకాశం లేదని పేర్కొంటున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి త్వరలో ట్విటర్ కంపెనీ అధికారిక బాధ్యతలు చేపట్టనున్న మస్క్.. కీలక మార్పులకు మందుగానే రంగం సిద్ధం చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది.

ట్రెండింగ్ వార్తలు