Professor Living Underwater: న్యూ రికార్డ్.. 76 రోజులుగా నీటి అడుగునే అమెరికా ప్రొఫెసర్.. ఇప్పట్లో బయటకు రాడట

సముద్రపు అడుగు భాగాన నివాసం ఉండేందుకు డిటూరి కంటే ముందుగా కొందరు ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో 2014 సంవత్సరంలో ఇద్దరు ప్రొఫెసర్లు 73 రోజులు సముద్రపు అడుగు భాగాన జీవనం సాగించారు.

Florida Professor underwater: మీరు నీటి అడుగు భాగాన ఎన్నిరోజులు జీవించగలరు.. పది రోజులు..! మహా అంటే 20 రోజులు.. అమ్మో.. అదెలా సాధ్యం అనుకుంటున్నారా? అమెరికాకు చెందిన ఫ్రొఫెసర్ 76రోజులుగా నీటి అడుగు భాగాన జీవిస్తున్నారు. కొలను, నది అడుగు భాగాన అనుకునేరు.. సముద్రపు అడుగు భాగాన..! ఈ క్రమంలో అతను సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు. గతంలో సముద్రపు అడుగు భాగాన 50రోజులకుపైగా జీవించిన వారు కొంతమంది ఉన్నారు. అయితే, 2014 సంవత్సరంలో ఇద్దరు ప్రొఫెసర్లు 73 రోజులు సముద్రపు అడుగు భాగంలో జీవించారు. కానీ, ప్రస్తుతం అమెరికా ఫ్రొఫెసర్ డాక్టర్ డీప్ సీ మాత్రం 76 రోజులుగా సముద్రపు అడుగు భాగంలో జీవనం సాగిస్తున్నాడు.

Professor Joseph Dituri

అమెరికాలోని ఫ్లోరిడాలోని డాక్టర్ డీప్ సీగా ప్రసిద్ధి చెందిన ప్రొఫెసర్ జోసెఫ్ డిటూరి. ఫ్లోరిడాలోని కీ లార్గోలో సముద్ర జలాల్లో 30 అడుగుల దిగువున స్కూబా డైవర్స్ కోసం నిర్మించిన ఆవాసంలో జీవనం సాగిస్తున్నాడు. అయితే అతని ఆవాసంలో టీవీ, మైక్రోవేవ్, స్విమ్మింగ్ పూల్ అమర్చబడి ఉంది. తన ఆవాసంపై పీడనాన్ని తగ్గించే సాంకేతిక ఏర్పాట్లేవీ లేకుండానే నీటి అడుగున ఎక్కువ కాలం జీవించిన వ్యక్తిగా అతను రికార్డు బద్దలు కొట్టారు. అతను ఏకంగా వందరోజుల పాటు నీటి అడుగున నివసించి సరికొత్త చరిత్ర సృష్టించే ప్రయత్నంలో ఉన్నారు.

Professor Joseph Dituri

ప్రొఫెసర్ జోసెఫ్ డిటూరి 2023 మార్చి 1న సముద్రపు అడుగు భాగంలోని ఆవాసంలోకి వెళ్లాడు. అతను 100 రోజులు పూర్తయిన తరువాతనే.. జూన్ 9న బయటకు వస్తానని చెప్పాడు. విద్య, వైద్య, సముద్ర పరిశోధనల్లో భాగంగా నీటి అడుగున నివసించే వసతిని మెరైన్ రిసోర్సెస్ డెవలప్ మెంట్ ఫౌండేషన్ ఏర్పాటు చేసింది. తీవ్రమైన ఒత్తిళ్ళకు మానవ శరీరం ఎలా స్పందిస్తుందన్న అంశంపై పరిశోధనలో భాగంగా ఈ ప్రయోగాన్ని చేస్తున్నట్లు ప్రొఫెసర్ జోసెఫ్ డిటూరి తెలిపారు.

Underwater

ఆన్‌లైన్ క్లాసులు చెబుతున్నాడు..

డిటూరి నీటి అడుగు భాగాన ఆవాసంలో ఖాళీగా ఉండటం లేదు. అక్కడి నుంచి తన విధులను నిర్వహిస్తున్నాడు. కొంచెం ఆశ్చర్యం కలిగించే విషయం అయినప్పటికీ ఇది నిజమే. నీటి అడుగు నివాసం నుంచే ఆయన సౌత్ ఫ్లోరిడా వర్సిటీ విద్యార్థులు 2500 మందికి ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తున్నాడు. అయితే, అతను సముద్రపు అడుగు భాగంలోని ఆవాసంలోకి వెళ్లిన తరువాత ఎక్కువగా మిస్ అయ్యేది.. సూర్యుడిని అట. సూర్యుడు నా జీవితంలో ఒక ప్రధాన కారకం. నేను సాధారణంగా ఐదు గంటలకు జిమ్‌కి వెళ్తాను. ఆపై నేను తిరిగి బయటకు వచ్చి సూర్యోదయాన్ని చూస్తాను. ఇప్పుడు అలా చేయడాన్ని మిస్ అవుతున్నానని డిటూరి చెప్పాడు.

2014లో ఇద్దరు..

సముద్రపు అడుగు భాగాన నివాసం ఉండేందుకు డిటూరి కంటే ముందుగా కొందరు ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో 2014 సంవత్సరంలో ప్రస్తుతం డిటూరి ఉన్న ప్రదేశంలోనే బ్రూస్ కాంట్రెల్, జెస్సికా ఫెయిన్ అనే ఇద్దరు టేనస్సీ ప్రొఫెసర్లు ఉన్నారు. వీరు 73 రోజుల, 2గంటల 34 నిమిషాల పాటు సముద్రం అడుగు భాగాన ఉండి రికార్డు నెలకొల్పారు. వీరి రికార్డును ప్రస్తుతం డిటూరి బద్దలు కొట్టారు.

ట్రెండింగ్ వార్తలు