Gaza tunnels : గాజాలోని హమాస్ రహస్య సొరంగాలపై దాడి…ఇజ్రాయెల్‌ సైన్యానికి సవాలు

గాజాలోని హమాస్ ఉగ్రవాదులు సొరంగాల్లో దాక్కున్నారు. గాజాపై ప్రతీకార దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ సైన్యానికి గాజాలోని హమాస్ సొరంగాలపై దాడులు చేయడం సవాలుగా మారింది. గాజా స్ట్రిప్ కింద దాగి ఉన్న హమాస్ టన్నెల్స్ లో ఉగ్రవాదులు దాక్కున్నారు....

Gaza tunnels : గాజాలోని హమాస్ ఉగ్రవాదులు సొరంగాల్లో దాక్కున్నారు. గాజాపై ప్రతీకార దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ సైన్యానికి గాజాలోని హమాస్ సొరంగాలపై దాడులు చేయడం సవాలుగా మారింది. గాజా స్ట్రిప్ కింద దాగి ఉన్న హమాస్ టన్నెల్స్ లో ఉగ్రవాదులు దాక్కున్నారు. పాలస్థీనియన్లు రఫాలోని సొరంగంలో నడుస్తున్న చిత్రాలు తాజాగా వెలుగు చూశాయి. ఇజ్రాయెల్ దళాలు గాజాలో పలు భవనాలపై దాడులు చేసి కూల్చివేశాయి. భూ దాడిలో భాగంగా గాజాలోని హమాస్ రహస్య సొరంగాల నెట్‌వర్క్‌ను ఇజ్రాయెల్ దళాలు కూల్చివేయవలసి ఉంటుంది.

భూగర్భ సొరంగాల్లో దాక్కున్న హమాస్ ఉగ్రవాదులు

గాజా స్ట్రిప్ కింద 41 కిలోమీటర్ల పొడవు, 10 కిలోమీటర్ల వెడల్పుతో జనసాంద్రత ఉన్న భూగర్భ సొరంగం విస్తరించి ఉంది. భూగర్భ సొరంగాల్లో పౌరులకు ఒక పొర, హమాస్ ఉగ్రవాదుల కోసం మరో పొరను ఏర్పాటు చేశారని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రతినిధి వెల్లడించారు. ఈ సొరంగాలు హమాస్ ఉగ్రవాదులకు రహస్య షెల్టర్లుగా ఉన్నాయి. హమాస్ ఉగ్రవాదులు సొరంగాల్లో దాక్కొని ఇజ్రాయెల్‌ దేశంపై రాకెట్‌లను దాడులు చేస్తున్నారని వెల్లడైంది. గాజాలో 2005వ సంవత్సరంలో సైన్యం సొరంగాలు నిర్మించుకుంది. 2007లో హమాస్ స్ట్రిప్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత ఈ టన్నెళ్ల నిర్మాణం ఊపందుకుంది.

ఇజ్రాయెల్ భూభాగాన్ని ఆక్రమించుకోవాలనే లక్ష్యం

ఈ రహస్య సొరంగాల్లో మొదట ఆయుధాలను నిల్వ చేసేందుకు ఉపయోగించారు. ఇజ్రాయెల్ భూభాగాన్ని ఆక్రమించుకోవాలనే లక్ష్యంతో హమాస్ ఉగ్రవాదులు గాజా సరిహద్దులో క్రాస్ బోర్డర్ సొరంగాలను తవ్వారని సమాచారం. గాజాలోని రహస్య సొరంగాలు హమాస్ ఉగ్రవాదులకు పటిష్ఠమైన మౌలిక సదుపాయాలను అందించాయి. 2013వ సంవత్సరంలో ఇజ్రాయెల్ దళాలు గాజా నుంచి ఇజ్రాయెలీ కిబ్బట్జ్ సమీపంలో దిగడానికి 1.6 కిలోమీటర్ల పొడవు, 18 మీటర్ల లోతు గల సొరంగాన్ని కనుగొన్నాయి.

సౌకర్యవంతంగా గాజా సొరంగాలు

‘‘గాజాలో సొరంగాలు భిన్నంగా ఉన్నాయని, వీటిని హమాస్ క్రమ పద్ధతిలో ఉపయోగిస్తోంది. అవి ఎక్కువ కాలం ఉండేందుకు వీలుగా మరింత సౌకర్యవంతంగా ఉన్నాయి’’ అని భూగర్భ యుద్ధంలో నిపుణుడు డాక్టర్ డాఫ్నే రిచెమండ్ బరాక్ చెప్పారు. అలెప్పోలోని సిరియన్ తిరుగుబాటుదారులు,మోసుల్‌లోని ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) యోధుల సంఘర్షణ ప్రాంతాల్లో మిలిటెంట్ గ్రూపుల వ్యూహాలను అధ్యయనం చేయడం ద్వారా హమాస్ తన సొరంగం నిర్మాణ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకున్నట్లు కనిపించిందని డాఫ్నే రిచెమండ్ బరాక్ పేర్కొన్నారు.

Hamass tunnels

Also Read : Ukraine war : యుక్రెయిన్ యుద్ధం కోసం రష్యాకు ఉత్తర కొరియా 1000 కంటైనర్లలో ఆయుధాలు…రహస్యంగా రైళ్లలో తరలింపు, ఉపగ్రహ ఛాయా చిత్రాల్లో వెల్లడి

హమాస్ రహస్య సొరంగాలు కొన్ని భూ ఉపరితలం నుంచి 30 మీటర్ల లోతులో ఉన్నాయి. హమాస్ ఉగ్రవాదుల రహస్య కదలికలను సులభతరం చేయడానికి ఇళ్లు, మసీదులు, పాఠశాలలు ఇతర ప్రభుత్వ భవనాల్లోనూ రహస్య ప్రదేశాలున్నాయి. ఈ టన్నెల్ నెట్‌వర్క్ నిర్మాణం స్థానికులకు ఖర్చుతో కూడుకున్నపని. హమాస్ మిలియన్ల డాలర్ల మానవతా సహాయాన్ని ఈ రహస్య మార్గాల నిర్మాణానికి నిధులు సమకూర్చింది. గతంలో ధ్వంసమైన గృహాలను పునర్నిర్మించడానికి ఉద్ధేశించిన సిమెంట్‌ను సొరంగాల నిర్మాణానికి మళ్లించిందని ఆరోపణలు వచ్చాయి.

Also Read :Mosque Blast : అఫ్ఘానిస్థాన్‌లో శుక్రవారం ప్రార్థనల సమయంలో మసీదులో పేలుళ్లు…15 మంది మృతి

హమాస్ సొరంగం నెట్‌వర్క్‌ను నిర్మూలించడం ఇజ్రాయెల్ దళాలకు సంక్లిష్టమైన పనిగా మారింది. సొరంగాలను ధ్వంసం చేయడానికి డ్రోన్‌లు, మానవరహిత క్షిపణులను ఉపయోగించడం, అలాగే భూగర్భంలో లోతుగా చొచ్చుకుపోయే బంకర్ బస్టింగ్ బాంబులను ఉపయోగించాలని ఇజ్రాయెల్ దళాలు యోచిస్తున్నాయి. మొత్తంమీద గాజాలో రహస్య సొరంగాలను ధ్వంసం చేయడం ఇజ్రాయెల్ దళాలకు సవాలుగా మారింది.

Also Read : Benjamin Netanyahu: మూడు పెళ్లిల్లు, సైన్యంలో అన్న చనిపోయాక కసితో రాజకీయాల్లోకి.. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆసక్తికర జర్నీ తెలుసుకోండి

ట్రెండింగ్ వార్తలు