Vijay Deverakonda landed in sri lanka for his VD12 movie shoot
Vijay Deverakonda : టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇందులో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ఒకటి. విజయ్ కెరీర్‌లో 12వ మూవీగా రూపుదిద్దుకుంటుంది. VD 12 వర్కింగ్ టైటిల్‌తో చిత్రీకరణ జరుపుకుంటోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
తాజాగా ఈ సినిమా నుంచి ఓ అప్‌డేట్ వచ్చింది. ఈ చిత్ర షూటింగ్‌లోని ఓ షెడ్యూల్‌ను శ్రీలంకలో ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇందుకోసం హీరో విజయ్ దేవరకొండతో పాటు చిత్రబృందం శ్రీలంకకు వెళ్లింది. లంకలో విజయ్‌కు ఘన స్వాగతం లభించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తోండగా.. విక్రమ్, అంగమలై డైరీస్, జల్లికట్టు లాంటి అవార్డు విన్నింగ్ సినిమాలకు పనిచేసిన గిరీష్ గంగాధర ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా శ్రీలీలను తీసుకోగా.. డేట్ల సమస్య కారణంగా ఆమె ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే.. ఆ స్థానంలో ఎవరిని తీసుకున్నారు అన్న సంగతి ఇంకా తెలియరాలేదు.
ఇదిలా ఉంటే.. గీతగోవిందం లాంటి హిట్ సినిమా ఇచ్చిన పరుశురామ్ దర్శకత్వంలో, అదే విధంగా టాక్సీవాలా ఫేం రాహుల్ సంకీర్య్తన్ దర్శకత్వంలో మరో మూవీలో విజయ్ నటిస్తున్నాడు. అవి వరుసగా VD 13, VD 14 వర్కింగ్ టైటిల్స్‌తో తెరకెక్కుతున్నాయి.
Sai Pallavi : ఇక నుంచి డాక్టర్ సాయి పల్లవి.. MBBS పట్టా పుచ్చుకున్న సాయి పల్లవి..
#VijayDeverakonda is warmly welcomed in Sri Lanka! ✨@TheDeverakonda #VD12 pic.twitter.com/OSnFfF4AAY
— Shreyas Sriniwaas (@shreyasmedia) July 8, 2024