Hema : నేను డ్రగ్స్ టెస్ట్ చేయించుకుంటే నెగిటివ్ వచ్చింది.. రేవ్ పార్టీ ఇష్యూపై మంచు విష్ణుని కలిసిన హేమ..

తాజాగా హేమ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రసిడెంట్ మంచు విష్ణుని కలిసింది.

Hema : నేను డ్రగ్స్ టెస్ట్ చేయించుకుంటే నెగిటివ్ వచ్చింది.. రేవ్ పార్టీ ఇష్యూపై మంచు విష్ణుని కలిసిన హేమ..

Artist Hema Meets Movie Artist Association President Manchu Vishnu Regarding Bengaluru Rave Party Issue

Updated On : July 8, 2024 / 2:40 PM IST

Hema – Manchu Vishnu : ఇటీవల క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ బెంగుళూరు రేవ్ పార్టీలో దొరికింది. ఆమె రక్త నమూనాలు టెస్ట్ చేస్తే డ్రగ్స్ తీసుకున్నట్టు పాజిటివ్ వచ్చిందని పోలీసులు తెలిపారు. ఈ విషయంలో పోలీసులు హేమని విచారించారు కూడా. అయితే హేమ మాత్రం నేను వెళ్ళలేదు, ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదు అని మీడియాతో మాట్లాడింది.

హేమ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా)లో ఉండటంతో ఈ విషయంపై ఆమెను అసోసియేషన్ లో సస్పెన్షన్ విధించారు. తాజాగా హేమ దీనిపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రసిడెంట్ మంచు విష్ణుని కలిసింది. మంచు విష్ణుకి ఒక లేఖ రాసింది. అలాగే తాను స్వయంగా డ్రగ్స్ టెస్ట్ చేయించుకొని ఆ రిపోర్ట్స్ మంచు విష్ణుకి అందించింది.

హేమ మంచు విష్ణుకి అందించిన లేఖలో.. ‘మా’ నాకు భౌతికంగా జన్మనివ్వకపోయినా ఒక నటిగా నాకు ఒక అస్థిత్వాన్ని, గుర్తింపును ఇచ్చింది. గత కొన్ని రోజులుగా నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలపై ‘మా’ స్పందించిన తీరు నాకు ఆవేదనను కలిగించింది. నెల రోజుల క్రితం నేను బెంగుళూరులో ఒక రేవ్ పార్టీలో పాల్గొన్నానని, అందులో డ్రగ్స్ తీసుకున్నాను అని మీడియా దుష్ప్రచారం చేసింది. నాపై అనేక రకాలైన కథనాలు వచ్చాయి. ఇది నన్ను, నా కుటుంబసభ్యులను తీవ్రమైన వేదనను కలగజేసింది. ‘మా’ సభ్యత్వం నుంచి సస్పెండ్ చేశారు.

‘మా’ బైలాస్ ప్రకారం ఎవర్నైనా సస్పెండ్ చేయాలంటే వారికి షోకాజ్ నోటీసు ఇవ్వాలి, వివరణ అడగాలి. కానీ నాకు ఎటువంటి షోకాజ్ నోటీసు జారీ చేయలేదు. నాపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ‘దోషిగా తేలే వరకు అందరు నిర్దోషులే..’ అని మీరు పెట్టిన ట్వీట్ నాకు సంతోషాన్ని కలిగించింది. పోలీసులు ఇప్పటి దాకా కోర్టుకు నాపై ఎటువంటి ఆధారాలు చూపించలేకపోయారు. మీడియాలో నాపై నిరాధారమైన ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో నేను దేశంలోనే అత్యున్నత ప్రమాణాలు కలిగిన ఒక ల్యాబ్లో రక్తపరీక్షలు చేయించుకున్నాను. ఈ పరీక్షల్లో నేను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని తేలింది. త్వరలోనే పోలీసు వారి ఆధ్వర్యంలో జరిగిన పరీక్షల వివరాలు కూడా బయటకు వస్తాయి. అందులో కూడా నేను నిర్దోషినని తేలుతుందనే నమ్మకం నాకు ఉంది. ఈ లోపు నన్ను దోషిగా చిత్రీకరించి ప్రాథమిక సభ్యత్వం తొలగించటం మా సంస్థకు తగదని నేను భావిస్తున్నాను.

Also Read : Manchu Manoj Daughter : మంచు మనోజ్ కూతురు పేరేంటో తెలుసా..? బారసాల ఫోటో వైరల్.. బాహుబలిలోని ఆ పేరుని..

గత కొన్ని రోజులగా నాపై జరుగుతున్న ప్రచారం వల్ల నేను తీవ్రమైన మానసిక క్షోభకు గురవుతున్నాను. ఈ పరిస్థితులలో నాకు ‘మా’ అండగా ఉండాలని కోరుకుంటున్నాను. కొందరు కావాలని చేస్తున్న ప్రచారం వల్ల నాకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాటి నుంచి నన్ను రక్షించాల్సిన బాధ్యత ‘మా’పై ఉంది. మీరు ఈ విషయాన్ని గుర్తించి నాపై విధించిన సస్పెషనను వెంటనే ఎత్తివేస్తారని ఆశిస్తున్నాను. ఈ ఉత్తరంతో పాటు నా మెడికల్ సర్టిఫికేట్ ని కూడా జత చేస్తున్నాను అని తెలిపింది. మరి దీనిపై మంచు విష్ణు ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి.