Manchu Manoj Daughter : మంచు మనోజ్ కూతురు పేరేంటో తెలుసా..? బారసాల ఫోటో వైరల్.. బాహుబలిలోని ఆ పేరుని..
తాజాగా మంచు మనోజ్ స్వయంగా తన పాప పేరు తన సోషల్ మీడియా వెల్లడించాడు.

Manchu Manoj Mounica Daughter Name goes Viral Manoj shares Name Ceremony Photo
Manchu Manoj Daughter : మంచు మనోజ్ భార్య మౌనిక ఇటీవల ఏప్రిల్ లో పండంటి కూతురుకి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. మంచు వారింట్లో మహాలక్ష్మి పుట్టింది అని మనోజ్, మంచులక్ష్మీ ఈ విషయాన్ని తెలిపారు. అయితే ఇటీవల ఆ పాపకు బారసాల నిర్వహించి పేరు పెట్టారు. తాజాగా మంచు మనోజ్ స్వయంగా ఆ పాప పేరు తన సోషల్ మీడియా వెల్లడించాడు.
మంచు మనోజ్ – మౌనిక దంపతుల కూతురుకి ‘దేవసేన శోభ’ అనే పేరు పెట్టినట్టు అధికారికంగా వెల్లడించారు. ఆ పేరుతో పాటు బారసాల ఫంక్షన్ ఫోటో కూడా షేర్ చేశారు. ఆ పాప ఉయ్యాలలో ఉండగా మంచు మనోజ్, మౌనికతో పాటు మోహన్ బాబు ఫ్యామిలీ కూడా ఉన్నారు. అలాగే మంచు మనోజ్, మౌనిక, కొడుకు ధైరవ్, కూతురు దేవసేన శోభ ఉన్న మరో ఫోటో కూడా షేర్ చేశారు. దీంతో ఈ ఫొటోలు వైరల్ అవ్వగా అభిమానులు, నెటిజన్లు ఈ జంటకు శుభాకాంక్షలు చెప్తూ పాపాయికి బ్లెస్సింగ్స్ అందిస్తున్నారు. అయితే దేవసేన శోభ అనే పేరుని సుబ్రహ్మణ్య స్వామి భార్య దేవసేన పేరు నుంచి తీసుకున్నామని, అలాగే శోభ అని దివంగత మా అత్తగారు శోభ నాగిరెడ్డి నుంచి తీసుకున్నామని తెలిపారు మనోజ్.
With all Your’s & Lord Shiva’s blessings, we named our Daughter ??❤️ #DevasenaShobhaMM pic.twitter.com/n6dvJeDoVR
— Manoj Manchu??❤️ (@HeroManoj1) July 8, 2024
ఇక దేవసేన అనే పేరు పెట్టడంతో బాహుబలి సినిమాలో అనుష్క పేరు అని ప్రభాస్, అనుష్క అభిమానులు కూడా మురిసిపోతూ మనోజ్ కూతురి పేరుని వైరల్ చేస్తున్నారు.