Iran Cruise Missile: డొనాల్డ్ ట్రంప్‌ను చంపేస్తాం.. క్రూయిజ్ మిస్సైల్‌తో మా ప్రతీకారం తీర్చుకుంటాం ..

2020లో బాగ్దాద్‌లో డ్రోన్ దాడిలో ఇరాన్ మిలిటరీ కమాండర్ ఖాసిమ్ సులేమానీని అమెరికా బలగాలు హతమార్చిన విషయం విధితమే. తర్వాత అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో పలు సార్లు అమెరికాను ఇరాన్ హెచ్చరించింది.

Iran Cruise Missile: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను చంపేస్తామంటూ ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్ టాప్ కమాండర్ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని, అందుకోసమే అత్యంత ప్రమాదకరమైన క్రూయిజ్ క్షిపణిని అభివృద్ధి చేయడం జరిగిందని ఇరాన్ రెవ‌ల్యూష‌న‌రీ గార్డ్స్ వైమానిక ద‌ళ చీఫ్ అమిరాలి హ‌జిజాదే తెలిపారు. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ క్షిపణి ఆయుధాగారంలో 1,650 కి.మీ పరిధిగల అత్యంత ప్రమాదకరమైన క్రూయిజ్ క్షిపణిని చేర్చినట్లు అమీరాలి హజిజాదే తెలిపారు.

Israeli Missile Strikes Damascus: సిరియా రాజధానిపై ఇజ్రాయెల్ క్షిపణి దాడి.. 15మంది మృతి

2020లో బాగ్దాద్‌లో డ్రోన్ దాడిలో ఇరాన్ మిలిటరీ కమాండర్ ఖాసిమ్ సులేమానీని అమెరికా బలగాలు హతమార్చిన విషయం విధితమే. అప్పుడు అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. తాజాగా, రాష్ట్ర టీవీ ఛానెల్‌తో ఇరాన్ టాప్ కమాండర్ మాట్లాడుతూ.. ఇరాన్ అమాయక సైనికులను చంపాలని భావించడం లేదని, అయితే, బాగ్దాద్‌లో 2020 డ్రోన్ స్ట్రైక్‌లో ఖాసీమ్ సులేమానీని హతమార్చినప్పుడు యూఎస్ దళాలపై బాలిస్టిక్ క్షిపణుల ద్వారా ప్రతీకారం తీర్చుకుందని హజీజాదే చెప్పారు. దేవుడు కోరుకుంటే మేము ట్రంప్ ను చంపుతాము, మాజీ విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపియో, సులేమానీని చంపమని ఆదేశించిన సైనిక కమాండర్లను చంపాలని చూస్తున్నామని తెలిపారు.

Prithvi-II Missile Test Successfully : భారత్ అమ్ముల పొదిలో మరో అస్త్రం..పృథ్వీ-II బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం

సులేమాని మరణం తర్వాత అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో పలు సార్లు అమెరికాను ఇరాన్ హెచ్చరించింది. యునైటెడ్ స్టేట్స్ నుంచి వ్యతిరేకత, యూరోపియన్ దేశాల ఆందోళన మధ్య ఇరాన్ తన క్షిపణి తయారీ కార్యక్రమాన్ని చేపట్టింది. ముఖ్యంగా దాని బాలిస్టిక్ క్షిపణులను విస్తరించింది. యుక్రెయిన్ యుద్ధానికి ముందు మాస్కోకు డ్రోన్‌లను సరఫరా చేసినట్లు ఇరాన్ తెలిపిన విషయం విధితమే. రష్యా ఈ డ్రోన్‌లను యుక్రెయిన్‌లోని పవర్ స్టేషన్లు, ప్రధాన నగరాలను లక్ష్యంగా దాడులు చేస్తోంది. అయితే, ఇరాన్ హైపర్‌సోనిక్ బాలిస్టిక్ క్షిపణిని అభివృద్ధి చేసిందని గతేడాది నవంబర్ నెలలో పెంటగాన్ చెప్పడం గమనార్హం.

ట్రెండింగ్ వార్తలు