Jeff Bezos : జెఫ్ బెజోస్‌కు ఎదురు దెబ్బ…. నెటిజన్ల నెగెటివ్ కామెంట్లతో షాక్

వేల కోట్లు ఖర్చుపెట్టి సొంతరాకెట్ లో స్సేస్ లోకి వెళ్లి వచ్చిన అపర కుబేరుడు... ప్రముఖ ఈ కామర్స్ అధినేత జెఫ్ బెజోస్‌ రోదసీ పర్యటనకు వెళ్లి వచ్చినంత సేపు నిలవలేదు ఆయన ఆనందం. ఆయన ఉత్సాహాన్నినీరుగారుస్తూ నెటిజన్లు నెగెటివ్ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.

Jeff Bezos : వేల కోట్లు ఖర్చుపెట్టి సొంతరాకెట్ లో స్సేస్ లోకి వెళ్లి వచ్చిన అపర కుబేరుడు… ప్రముఖ ఈ కామర్స్ అధినేత జెఫ్ బెజోస్‌ రోదసీ పర్యటనకు వెళ్లి వచ్చినంత సేపు నిలవలేదు ఆయన ఆనందం. ఆయన ఉత్సాహాన్నినీరుగారుస్తూ నెటిజన్లు నెగెటివ్ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. తన 11 నిమిషాల రోదసీ యాత్ర పూర్తి చేసుకువచ్చిన తర్వాత బెజోస్ అమెజాన్‌ ఉద్యోగులకు, కస్టమర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ప్ర‌తి అమెజాన్ ఉద్యోగి, అమెజాన్ క‌స్ట‌మ‌ర్‌కు కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్నాను.

దీనికి డ‌బ్బు చెల్లించింది మీరే అని బెజోస్ అన్నారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకున్నాయి. ప్ర‌పంచంలోనే రిచెస్ట్ అయినా కూడా కొన్నేళ్లుగా బెజోస్ ఎప్పుడూ ప‌న్నులు క‌ట్ట‌డం లేద‌ు. దీనికితోడు అమెజాన్‌లో వ‌ర్క‌ర్ల నుంచి శ్ర‌మ దోపిడీ ఉంటుంద‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. క‌నీసం తిన‌డానికి, ఒక్కోసారి బాత్‌రూమ్‌కి వెళ్ల‌డానికి కూడా స‌మ‌యం ఉండ‌ద‌ని అమెజాన్‌లో ప‌నిచేసే ఉద్యోగులు చెబుతుంటారు. ఈ విష‌యాన్నే గుర్తు చేస్తూ ట్విట‌ర్‌లో బెజోస్‌కు వ్య‌తిరేకంగా ఎన్నో నెగెటివ్ కామెంట్స్ వ‌స్తున్నాయి.

తక్కువ జీతాలు, దారుణమైన, అమానవీయ ఆఫీసు వాతావరణం, కరోనా మహమ్మారి సమయంలో కూడా డెలివరీ డ్రైవర్లకు ఆరోగ్య బీమా లేకుండా చేయటం….అమెజాన్‌ ఉద్యోగులే ఇదంతా భరించారంటూ అమెరికా చ‌ట్ట‌స‌భ ప్ర‌తినిధి అలెగ్జాండ్రియా ఒకాసియో-కార్టెజ్ ట్విటర్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


అమెజాన్ తన మార్కెట్ శక్తిని దుర్వినియోగం చేస్తూ, చిన్న వ్యాపారాలను దెబ్బతీసేందుకే ఉద్యోగులు చెల్లిస్తున్నారన్నారు. ప‌న్నులు క‌ట్ట‌కుండా అమెరిక‌న్లు చెమ‌టోడ్చి సంపాదించి, క‌ట్టిన ప‌న్నుల‌తోనే స్పేస్‌ టూర్‌ చేసి వచ్చారంటూ సెనేట‌ర్ ఎలిజ‌బెత్ వారెన్ ట్వీట్‌ చేశారు. కానీ అమెరికన్లకు థ్యాంక్స్ చెప్ప‌డం మాత్రం మ‌ర‌చిపోయావంటూ మండిపడ్డారు.


మరోవైపు కెన‌డాలోని న్యూడెమొక్ర‌టిక్ పార్టీ నేత జ‌గ్‌మీత్ సింగ్ కూడా బెజోస్‌ను విమర్శిస్తూ ట్వీట్ చేశారు. 11 నిమిషాల్లో బెజోస్‌ యాత్ర ముగిసింది. కానీ కరోనా వైరస్‌ మహమ్మారి కాలంలో ప్రతి 11 నిమిషాలకు (16 ల‌క్ష‌ల డాల‌ర్లు) మిలియన్ల డాలర్లు పెరిగి మరింత కుబేరుడిగా అవతరించాడని వ్యాఖ్యానించారు. అయినా ట్రూడో ప్ర‌భుత్వం మాత్రం అమెజాన్‌కు పైసా ప‌న్ను వేయ‌లేదు అని ఆయ‌న మండిప‌డ్డారు. ఇలాంటి ప్ర‌ముఖులే కాకుండా ట్విట‌ర్‌లో చాలా మంది బెజోస్ కామెంట్స్‌పై ప్ర‌తికూలంగానే స్పందించారు.

ట్రెండింగ్ వార్తలు