Old Vehicle : పాత వాహనం రోడ్డుపైకి వస్తే ఫైన్ కట్టాల్సిందే!

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక నగరాల్లో గాలి నాణ్యత దిగజారుతోంది. దీంతో ఆయా నగరాల్లో నివసించే ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు.

Old Vehicle :  ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక నగరాల్లో గాలి నాణ్యత దిగజారుతోంది. దీంతో ఆయా నగరాల్లో నివసించే ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే కర్బన ఉద్ఘారాలను తగ్గించాలనే లక్ష్యంగా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నాయి ఆయా దేశాలు. తాజాగా లండన్ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. నగరంలో కొన్ని ప్రాంతాలను అల్ట్రా లో ఎమిషన్‌ జోన్లుగా ప్రకటించారు.

చదవండి : London : వ్యాన్‌ను జుట్టుతో లాగేసింది..నెటిజన్ల ట్రోలింగ్..ఏ షాంపు వాడుతున్నావు తల్లీ

ఈ ప్రాంతాల్లో ఎక్కువ కాలుష్యం విడుదల చేసే వాహనాలు తిరిగేందుకు అనుమతి లేదు. నిబంధనలు అతిక్రమించి తిరిగితే 12.5 పౌండ్ల (సుమారు రూ.1,300) జరిమానా విధించనున్నారు. యూరో 4 ప్రమాణాలకు అనుగుణంగా లేని పెట్రోల్ వెహికల్స్, యూరో 6 ప్రమాణాలకు అనుగుణంగా లేని డీజిల్ మోడళ్లపై ఈ పన్ను విధించనున్నారు.

చదవండి : London-Kochi : విమానంలో మహిళకు పురిటి నొప్పులు, డెలివరీ ఎవరు చేశారంటే

ఈ విధానం తీసుకురావడానికి ప్రధాన కారణం అధిక కర్బన ఉద్ఘారాలను విడుదల చేసే వాహనాలను రోడ్లపైకి తీసుకురాకుండా చేయడం కోసమే అని అక్కడి అధికారులు తెలిపారు. ఇక దీనిపై ప్రచారం కూడా అధికం చేసినట్లు రాయిటర్స్ పేర్కొంది. మరోవైపు బ్రిటన్‌లో ఎలక్ట్రిక్ కార్ల వినియోగం రోజు రోజుకు పెరుగుతుంది. అనేక స్వదేశీ కంపెనీలు ఇప్పటికే ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. అతి త్వరలో వస్తు రవాణాకు అవసరమయ్యే ఎలక్ట్రిక్ ట్రక్‌లను మార్కెట్లోకి తీసుకురానున్నారు. ఇప్పటికే కొన్ని కంపెనీలు తుదిమెరుగులు దిద్దుకుంటున్నాయి. మరికొన్ని ట్రయిల్ రన్ దశలో ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు