Rare Pink Diamond : అంగోలాలో లభ్యమైన ప్రపంచంలోనే అరుదైన పెద్ద పింక్ డైమండ్..విలువ రూ.900ల కోట్లకు పైనే

ప్రపంచంలోనే అత్యంత అరుదైన పెద్ద గులాబీ రంగు వజ్రం లభ్యమైంది. 170 క్యారెట్లు ఉన్న ఈ గులాబీ రంగు వజ్రం విలువ రూ.900 కోట్ల నుంచి రూ.1000కోట్లు.

Rare Pink Diamond found in Angola Africa : ఆఫ్రికాఖండం అంటేనే వజ్రాలకు నెలవు. అటువంటి ఆఫ్రికాలో ప్రపంచంలోనే అత్యంత అరుదైన పెద్ద గులాబీ రంగు వజ్రం లభ్యమైంది. అంగోలాలో వజ్రాల కోసం తవ్వకాలు జరుపుతున్న ఆస్ట్రేలియన్ సంస్థ లుపాకా డైమండ్ కంపెనీ ఈ డైమండ్ ను గుర్తించింది. ఈ వజ్రం అచ్చమైన లేత గులాబీ రంగులో మిలమిలా మెరిసిపోతూ కనిపిస్తోంది. ఈ వజ్రం 170 క్యారెట్ల బరువు ఉందని తెలిపింది లుపాకా డైమండ్ కంపెనీ. ప్రపంచవ్యాప్తంగా గత 300 ఏళ్లలో గుర్తించిన అతిపెద్ద పింక్ డైమండ్ ఇదేనని భావిస్తామని తెలిపింది. దేశంలోని వజ్రాలు అధికంగా ఉండే ఈశాన్య ప్రాంతంలోని లులో గనిలో ఈ వజ్రం లభ్యమైంది.

Also read : Black Diamond: వేలానికి అత్యంత అరుదైన “నల్ల వజ్రం”

సహజమైన వజ్రాల్లో అత్యంత స్వచ్ఛతతో..పూర్తిగా ఒకే రంగుతో ఉన్నవి అత్యంత అరుదుగా ఉంటాయని..ఈ పింక్ డైమండ్ ఆ అరుదైన కేటగిరీలోకి వస్తుందని లుపాకా కంపెనీ ప్రకటించింది. ఈ వజ్రానికి ‘లులో రోజ్’ అని పేరు పెట్టారు. ప్రస్తుతం ముడి రూపంలో ఈ వజ్రాన్ని సానబెడితే.. 85 నుంచి 90 క్యారెట్ల వరకు ఉండే ఒక పెద్ద పాలిష్డ్ వజ్రంగా రూపొందనుంది. ఈ ప్రక్రియలో మరిన్ని వజ్రాలు రూపొందుతాయని లుకాపా డైమండ్ కంపెనీ ప్రతినిధులు తెలిపారు. అ అరుదైన పింక్ డైమండ్ ను త్వరలో వేలం వేస్తామని తెలిపిందా కంపెనీ. కానీ వజ్రం క్యారెట్లను బట్టి ధరను నిర్ణయిస్తామని ఆ ధర ఎంత వస్తుందనేది ఇంకా అంచనా వేయలేదని..కానీ అద్భుతమైన ధర వస్తుందని లూపాకా కంపెనీ ప్రతినిధులు తెలిపారు.

Also read :woman finds rare diamond : పార్కులో వాకింగ్ చేస్తుంటే వృద్ధురాలికి దొరికిన అరుదైన వజ్రం

2017లో అచ్చంగా ఇటువంటి స్వచ్ఛమైన డైమండ్ ‘పింక్ స్టార్’ను హాంకాంగ్ లో వేలం వేశారు. 59.6 క్యారెట్ల బరువైన ఆ వజ్రానికి 71.2 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారు రూ.570 కోట్లు పలికింది. కేవలం ఒక్క వజ్రానికి పలికిన అత్యధిక ధర విషయంలో అదే ప్రపంచంలో అత్యధిక విలువ కావడం గమనించాల్సిన విషయం. ఇప్పుడు అత్యంత స్వచ్ఛమైన పింక్ డైమండ్ అయిన ‘లులో రోజ్’ సుమారు 90 క్యారెట్ల వరకు ఉండనుందనే అంచనాతో ‘పింక్ స్టార్’ కన్నా భారీగా ధర పలుకుతుందని అంచనా వేస్తున్నారు. అంటే రూ.900 కోట్ల నుంచి రూ.1000 కోట్ల దాకా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

Also read : NIZAM GOlD COIN : 12 కిలోల ‘నిజాం బంగారు నాణెం’ 40 ఏళ్ల మిస్టరీ వీడేనా?..ఆచూకీ లభించేనా..?

 

ట్రెండింగ్ వార్తలు