Nepal Shuts Border Points : భారత్ కు వెళ్లే 22 రహదారులను మూసేసిన నేపాల్

భారత్ లో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో పోరుగు దేశమైన నేపాల్ కీలక నిర్ణయం తీసుకుంది. నేపాల్-భారత్ సరిహద్దుల్లోని 22 చోట్ల రాకపోకలు నిలిపివేయాలని నిర్ణయించుకుంది.

Nepal Shuts Border Points : భారత్ లో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో పోరుగు దేశమైన నేపాల్ కీలక నిర్ణయం తీసుకుంది. నేపాల్-భారత్ సరిహద్దుల్లోని 22 చోట్ల రాకపోకలు నిలిపివేయాలని నిర్ణయించుకుంది.

శుక్రవారం ఖాట్మండ్ లో జరిగిన కోవిడ్ క్రైసిస్ మేనేజ్ మెంట్ కో ఆర్డినేషన్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. నేపాల్- భారత్ ల మధ్య ఉన్న 35 సరిహద్దు పాయింట్లలో 22 మూసి వేయాలని మంత్రి మండలికి సిఫార్సు చేసింది.

తక్కిన 13 పాయింట్లు తెరిచే ఉంటాయని తెలిపింది. నేపాల్ లో గురువారం నాటికి 3,23,187 కోవిడ్ -19 కేసులు నమోదు కాగా 3,279 మంది కోవిడ్ తో మరణించారు. అయితే నేపాల్ లోనూ కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గురుశుక్రవారాల్లో కొత్తగా మరో 5 వేల కేసులు నమోదయ్యాయి.

ట్రెండింగ్ వార్తలు