Portugal : డ్యూటీ ముగిసిన తర్వాత వేధించారా..ఫైన్ కట్టాల్సిందే

డ్యూటీ సమయం అయిపోయిన తర్వాత..వర్క్ చేయాలంటూ వేధిస్తున్నారని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Home Working In Portugal : డ్యూటీ ముగిసిన తర్వాత..కూడా యాజమాన్యాలు వేధిస్తున్నారా ? ఇకపై అలాంటివి చెల్లవు. వేధిస్తే..ఫైన్ కట్టాల్సిందే. కరోనా కారణంగా…చాలా కంపెనీలు…ఉద్యోగులను ఇంటి నుంచి పని చేయడానికి ఒప్పుకున్న సంగతి తెలిసిందే. ఇంట్లో ఉంటూ…కంప్యూటర్ల ఎదుట కూర్చొని..వర్క్ చేశారు. కరోనా కారణంగా..వర్క్ ఫ్రం హోమ్ ఎంతో ప్రాచుర్యంలోకి వచ్చింది. అయితే..కొన్ని కంపెనీలు డ్యూటీ సమయం అయిపోయిన తర్వాత..వర్క్ చేయాలంటూ వేధిస్తున్నారని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read More : Auto Driver : శబాష్ ఆటో డ్రైవర్.. కూతురు పెళ్ళికి దాచుకున్న డబ్బుని..

అదే పనిగా ఫోన్ చేయడం..మెసేజ్ లు చేయడం వంటివి చేస్తున్నారంటూ…ఉద్యోగులు ఫిర్యాదులు చేస్తున్నారు. ఆఫీసు సమయం మొదలు కాకముందు..అయిపోయిన తర్వాత..ఉద్యోగులను డిస్ట్రర్బ్ చేస్తే…కంపెనీ యజమానులు జరిమాన కట్టాల్సి ఉంటుందని ఐరోపా దేశం పోర్చుగల్ కొత్త కార్మిక చట్టాన్ని అమల్లోకి తెచ్చింది.

Read More : Malala Yousafzai : వివాహబంధంలోకి మలాల

స్టాఫ్ పై పర్యవేక్షణ అధికారాన్ని కూడా తొలగిస్తామని బాస్ లను హెచ్చరించింది. వర్క్ ఫ్రం హోమ్ సమయంలో…సమయం లేకుండా వేధిస్తున్నారంటూ…ఉద్యోగులు ఫిర్యాదులు చేయడంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని అధికారులు వెల్లడించారు. పది మంది కంటే తక్కువ ఉద్యోగులున్న కంపెనీలకు ఈ నిబంధన వర్తించబోవమని తెలిపారు. ప్రస్తుతం తీసుకొచ్చిన కొత్త కార్మిక చట్టంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు