Pfizer Vaccine-Delta : డెల్టా వేరియంట్‌‌ను అడ్డుకోవడంలో ఫైజర్ వ్యాక్సిన్ సమర్థత తక్కువ!

దేశంలో డెల్టా వేరియంట్ సోకకుండా ఫైజర్స్ కోవిడ్ -19 వ్యాక్సిన్ (Pfizer’s Covid-19 Vaccine) నిరోధించడంలో తక్కువ ప్రభావవంతంగా ఉందని ఇజ్రాయెల్ ప్రభుత్వం వెల్లడించింది.

Pfizer Covid-19 Vaccine : దేశంలో డెల్టా వేరియంట్ సోకకుండా ఫైజర్స్ కోవిడ్ -19 వ్యాక్సిన్ (Pfizer’s Covid-19 Vaccine) నిరోధించడంలో తక్కువ ప్రభావవంతంగా పనిచేస్తుందని ఇజ్రాయెల్ ప్రభుత్వం వెల్లడించింది. Bloomberg Data ప్రకారం.. జూన్ 6, జూలై ఆరంభంలో ఫైజర్ కొవిడ్-19 వ్యాక్సిన్ దేశంలోని 64 శాతం మందిని కరోనా నుంచి రక్షించగా.. గతంలో 94 శాతం మంది బయటపడ్డారు. దేశంలో డెల్టా వేరియంట్ కేసుల పెరిగిపోతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ సమర్థత విషయం బయటపడింది.

ఇజ్రాయెల్‌లో జూన్ ప్రారంభంలో ఆంక్షలను ఎత్తివేసిన సమయంలోనే డెల్టా వేరియంట్ (delta variant) ప్రభావం అధికంగా ఉందని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. ఏదేమైనా, ఫైజర్ వ్యాక్సిన్ టీకా తీవ్రమైన అనారోగ్యం, ఆస్పత్రిలో చేరకుండా రక్షిస్తుందని ప్రభుత్వ డేటా చూపిస్తోంది. ఈ ఫైజర్ టీకాతో బాధితులు ఆస్పత్రిలో చేరకుండా 93 శాతం ప్రభావాన్ని చూపించింది. అంతకుముందు ప్రభుత్వ అధ్యయనంలో 97 శాతం నుంచి స్వల్పంగా పడిపోయినట్టు డేటా వెల్లడించింది.

ఫైజర్ ఇంక్ ప్రతినిధి డెర్విలా కీనే (Dervila Keane) ఇజ్రాయెల్ ప్రభుత్వ గణాంకాలపై స్పందించేందుకు నిరాకరించారు. కరోనావైరస్ మ్యుటేషన్ల నుంచి వ్యాక్సిన్ నిరంతరాయంగా రక్షణ కల్పిస్తుందని చెప్పారు. అయితే ఇప్పుడు కొద్దిగా తగ్గినట్టు గుర్తించారు. ఫైజర్ కోవిడ్ -19 వ్యాక్సిన్ ఈ వేరియంట్ల నుంచి రక్షించగలదని ఆధారాలు ఉన్నాయని నివేదిక తెలిపింది. ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన వ్యాక్సినేషన్ అందిస్తున్న దేశాల్లో ఇజ్రాయెల్ ఒకటి.. దేశ జనాభాలో 57 శాతం మందికి టీకాలు అందించింది. అయినప్పటికీ కొత్త కరోనావైరస్ కేసులు ఇంకా నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.

55 శాతం మంది టీకా తీసుకున్న వారే :
గతవారంలో కొత్త డెల్టా కేసుల్లో 55 శాతం మంది కోవిడ్ -19 వ్యాక్సిన్ వేయించుకున్నవారే ఉన్నారు. జూలై 4 నాటికి, దేశంలో జూన్ 19న జూన్ 25 మధ్య 35 వరకు తీవ్రమైన వైరస్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్ -19 టీకా తీసుకున్న వ్యక్తులపై అధ్యయనం చేయడానికి ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్టు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. పౌరులకు మూడవ వ్యాక్సిన్ మోతాదును సిఫారసు చేయడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ బ్లూమ్‌బెర్గ్‌కు తెలిపింది. పూర్తిగా టీకాలు వేసిన 12 నెలల్లోపు మూడో వ్యాక్సిన్ మోతాదు ఇవ్వాలస్సి ఉంటుందని నివేదించింది.

డెల్టా వేరియంట్ మొదట భారతదేశంలో గుర్తించగా.. ఇప్పుడు కనీసం 98 దేశాలకు వ్యాపించింది. డెల్టా ప్లస్ వేరియంట్ (delta plus variant) కూడా విజృంభిస్తోంది. ఇప్పటికే దేశంలో 50కి పైగా శాంపిల్స్ లో ఈ కొత్త రకం వేరియంట్ కనిపించిందని నివేదికలు వెల్లడించాయి. ఇటీవలే.. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO ) కూడా డెల్టా వేరియంట్ చాలా దేశాలలో ఆధిపత్య జాతిగా వేగంగా అభివృద్ధి చెందుతోందని ఆందోళన వ్యక్తం చేసింది.

ట్రెండింగ్ వార్తలు