Ukrain : యుక్రెయిన్ సంక్షోభం.. భేటీ కానున్న పుతిన్-బైడెన్

ఈస్టర్న్ యుక్రెయిన్ లో కాల్పుల విరమణ కోసం కలిసి పనిచేయాలని రష్యా, ఫ్రాన్స్ నిర్ణయించాయి..

Ukrain : యుక్రెయిన్ సంక్షోభం ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందోనన్న ఆందోళన రోజురోజుకూ పెరుగుతోంది. ఓవైపు తూర్పు యుక్రెయిన్ లో కాల్పుల మోత మోగుతుండగానే.. మరోవైపు శాంతి చర్చలకు అడుగులు పడుతున్నాయి.

Read This : Ukraine : యుక్రెయిన్ వీడి ఇండియా రండి.. ఎంబసీ కీలక ప్రకటన

రష్యా.. యుక్రెయిన్ ను దెబ్బ తీసి కానీ ఊరుకోదని అగ్రరాజ్యాధినేత బైడెన్ ప్రకటించిన కొద్దిగంటలకే మరో అప్ డేట్ వచ్చింది. యుక్రెయిన్ సంక్షోభం నివారించేందుకు, ఉద్రిక్తతలు తగ్గించేందుకు రష్యా అధినేత పుతిన్ తో అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ భేటీ కానున్నాడని అమెరికా వైట్ హౌజ్ వర్గాలు తెలిపాయి.

పొరుగు దేశంపై రష్యా దండయాత్రను ఆపేందుకు.. జో బైడెన్ నేరుగా రంగంలోకి దిగబోతున్నాడని అమెరికాకు చెందిన టాప్ డిప్లొమాట్ ఒకరు అఫీషియల్ గా ప్రకటించారు. రష్యా- యుక్రెయిన్ మధ్య యుద్ధ పరిస్థితి పరిణామాలను ‘డెడ్ సీరియస్’ గా అమెరికా పరిగణిస్తోందని స్టేట్ సెక్రటరీ ఆంటోనీ బ్లింకెన్ CNNతో ఓ టాక్ షోలో చెప్పారు. దండయాత్రను ఆపేందుకు అమెరికా చేయాల్సిందల్లా చేయబోతోందని అన్నారు.

Read This : Ukraine Tension : యుక్రెయిన్‌లో టెన్షన్ టెన్షన్ .. తొలి మరణం నమోదు!

తూర్పు యుక్రెయిన్ సరిహద్దులో ఫైరింగ్, యుద్ధ ట్యాంకుల మోహరింపు, యుద్ధ విమానాల గస్తీ ఉన్న ఈ పరిస్థితుల్లో ప్రతి పరిణామాన్ని గమనిస్తున్నామని బ్లింకెన్ అన్నారు. పుతిన్ తన యాక్షన్ ప్లాన్ ను మరింత ముందుకు తీసుకెళ్లకుండా దౌత్య మార్గాన్ని అనుసరించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఏ సమయంలోనైనా ‘పుతిన్ తో జో బైడెన్ భేటీ’ జరిగే చాన్సుందన్నారు. ఈ భేటీ నేరుగా గానీ.. వర్చువల్ గా గానీ.. ఏ ఫార్మాట్ లోనైనా జరగొచ్చన్నారు. అంతిమంగా.. యుద్ధం ఆపడమే అమెరికా ముందున్న కర్తవ్యమని చెప్పారు బ్లింకెన్.

రష్యా-ఫ్రాన్స్ మధ్య సీజ్ ఫైర్ అగ్రిమెంట్

మరోవైపు.. ఈస్టర్న్ యుక్రెయిన్ లో కాల్పుల విరమణ కోసం కలిసి పనిచేయాలని రష్యా, ఫ్రాన్స్ నిర్ణయించాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ దాదాపు 105 నిమిషాల పాటు ఈ విషయంలో ఫోన్ సంభాషణ జరిపినట్టు ఫ్రాన్స్ అధ్యక్ష భవనం ఎలిసీ ప్యాలెస్ ఓ ప్రకటనలో తెలిపింది. రెండు దేశాల విదేశాంగ మంత్రులు కూడా రానున్న రోజుల్లో భేటీ కానున్నట్టు సమాచారం ఇచ్చింది.

ట్రెండింగ్ వార్తలు