Quad summit 2022: PM Modi : ప్రధాని మోడీ జపాన్ పర్యటనపైనే ప్రపంచ దేశాల దృష్టి.. ఎందుకంటే..

క్వాడ్ సదస్సులో ఏం చర్చిస్తారు? భారత్‌పై క్వాడ్ భాగస్వామ్య దేశాలు ఒత్తిడి పెంచే అవకాశం ఉందా..? ప్రధాని మోదీ జపాన్ పర్యటన యుద్ధం విషయంలో భారత్ అభిప్రాయాన్ని ప్రభావితం చేసే అవకాశముందా..? ప్రధాని జపాన్ పర్యటనను ప్రపంచ దేశాలన్నీ ఆసక్తిగా గమనిస్తున్నాయి.

Quad summit 2022: PM Modi Japan tour : క్వాడ్ సదస్సులో ఏం చర్చిస్తారు? భారత్‌పై క్వాడ్ భాగస్వామ్య దేశాలు ఒత్తిడి పెంచే అవకాశం ఉందా..? ప్రధాని మోదీ జపాన్ పర్యటన యుద్ధం విషయంలో భారత్ అభిప్రాయాన్ని ప్రభావితం చేసే అవకాశముందా..? ప్రధాని జపాన్ పర్యటనను ప్రపంచ దేశాలన్నీ ఆసక్తిగా గమనిస్తున్నాయి. యుద్ధం సమయంలో క్వాడ్ దేశాల నేతలు ప్రత్యక్షంగా సమావేశం కానుండడమే దీనికి కారణం. చైనాకు చెక్ పెట్టడం, ఇండో పసిఫిక్ సంబంధాలు బలోపేతం చేయడమే లక్ష్యంగా ఆవిర్భవించిన క్వాడ్‌లో భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా భాగస్వామ్యదేశాలు. ఈ నాలుగు దేశాల్లో భారత్ మినహా మిగిలిన మూడు దేశాలు యుక్రెయిన్ యుద్ధాన్ని ఖండించాయి. రష్యా తీరును తప్పుబట్టాయి. కానీ భారత్ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. తటస్ఠ వైఖరి అవలంబిస్తోంది. ఈ విషయంలో భారత్‌పై ఒత్తిడి పెంచేందుకు ఇప్పటికే అమెరికా, ఆస్ట్రేలియా అనేక సార్లు ప్రయత్నించి విఫలమయ్యాయి. ఈ తరుణంలో క్వాడ్ సదస్సులోనూ యుక్రెయిన్ యుద్ధంపై ప్రధానంగా చర్చ జరగనుంది. అమెరిక అధ్యక్షుడు బైడన్, ఆస్ట్రేలియా కొత్త ప్రధాని అల్బనీస్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిదాతో ప్రధాని మోదీ ఎలా వ్యవహరిస్తారు…యుద్ధం విషయంలో భారత్ వైఖరిని ఎలా సమర్థించుకుంటారు అన్నది ఆసక్తిగా మారింది.

Also read : Monkeypox : మంకిపాక్స్ డేంజర్ బెల్స్..పది రోజుల్లోనే 12 దేశాలకు విస్తరించిన వైరస్

యుద్ధం మొదలుకాగానే ఐరోపా దేశాల సాయంతో మాస్కోను ప్రపంచంలో ఏకాకిగా నిలబెట్టేందుకు అమెరికా అన్ని ప్రయత్నాలూ చేసింది. కానీ భారత్ వైఖరితో అమెరికా ఆశలు ఫలించలేదు. యుద్ధాన్ని వ్యతిరేకించాలని, రష్యాతో ఎలాంటి ఒప్పందాలూ కుదర్చుకోవద్దని, రష్యాను చమురు కొనుగోలు చేయవద్దని అమెరికా కోరింది. కానీ అమెరికా ప్రతిపాదనలను భారత్ తోసిపుచ్చింది. అన్ని విషయాల్లోనూ స్వతంత్రంగా వ్యవహరించింది. యుద్ధం తర్వాత ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు బైడన్‌తో ప్రత్యక్షంగా సమావేశం కానుండడం ఇదే తొలిసారి. యూరప్ పర్యటనలో భారత్ వైఖరిని సమర్థించుకుంటూనే…యుద్ధంలో గెలిచేది ఎవరూ ఉండదంటూ మోదీ చేసిన వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఇప్పుడు జపాన్ పర్యటనలో ప్రధాని ఏం మాట్లాడతారనేది ఆసక్తి కరంగా మారింది. బైడన్‌తో పాటు ఇతర క్వాడ్ దేశాల ఒత్తిడికి తలొగ్గకుండానే ఇండో పసిఫిక్ సంబంధాల బలోపేతంపై ప్రధాని దృష్టిపెట్టనున్నారు. జపాన్‌లో 40 గంటల పాటు ఉండే ప్రధాని మోదీ 23 ఒప్పందాలు కుదుర్చుకుంటారు. వ్యాపార, ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారు.

Also read : Covid cases in india: కరోనాతో చికిత్సపొందుతూ ఒకేరోజు 46 మంది మృతి..

అటు ఇప్పటికే ఆసియా పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు బైడన్ దక్షిణకొరియాలో రెండు రోజుల పర్యటన తర్వాత టోక్యో చేరుకున్నారు. బైడన్ అమెరికా అధ్యక్షుడయిన తర్వాత ఆసియాలో పర్యటించడం ఇదే తొలిసారి. మిత్ర దేశం దక్షిణకొరియాతో ఆయన పర్యటన ప్రారంభమైంది. దక్షిణకొరియా వేదికగా ఉత్తరకొరియాకు శాంతి సందేశం పంపారు బైడన్. క్షిపణి, అణు పరీక్షలు సహా ఉత్తరకొరియా ఎలాంటి చర్యలకు దిగినా.. ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని బైడన్ తెలిపారు. దీనిపై తాము ఆందోళన చెందడం లేదని, ఆ దేశంతో చర్చలకు సిద్ధమని తెలిపారు.అటు చైనా అమెరికా అధ్యక్షుడి ఆసియా పర్యటనను తీవ్రంగా పరిగణిస్తోంది. కరోనా పరిస్థితులతో చైనా ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న సమయంలో ఆసియాపై పట్టు పెంచుకునేందుకు అమెరికా ప్రయత్నిస్తోందన్నది డ్రాగన్ ఆరోపణ.

ట్రెండింగ్ వార్తలు