Chinese Nuclear Missile Silos: రీసెర్చర్లకు దొరికిన 110 సీక్రెట్ చైనీస్ న్యూక్లియర్ మిస్సైల్ సిలోలు

రీసెంట్ గా విడుదలైన కొత్త శాటిలైట్ ఇమేజెస్ ను బట్టి చూస్తే చైనా రెండో ఫీల్డ్‌ను రెడీ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇమేజెస్‌పై విశ్లేషణ జరిపిన న్యూక్లియర్ ఆర్మ్స్ రీసెర్చర్లు గతంలోని 119 సిలోలతో పాటు వీటిని కూడా చేర్చారని చెబుతున్నారు.

Chinese Nuclear Missile Silos: రీసెంట్ గా విడుదలైన కొత్త శాటిలైట్ ఇమేజెస్ ను బట్టి చూస్తే చైనా రెండో ఫీల్డ్‌ను రెడీ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇమేజెస్‌పై విశ్లేషణ జరిపిన న్యూక్లియర్ ఆర్మ్స్ రీసెర్చర్లు గతంలోని 119 సిలోలతో పాటు వీటిని కూడా చేర్చారని చెబుతున్నారు. అంతకుముందు లేనంతగా చైనా న్యూక్లియర్ ఆయుధాల విస్తరణ చేపడుతుందని ఈ డిస్కవరీలో తేలింది.

ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్ తో కలిసి మట్ కొర్దా, హ్యాన్స్ క్రిస్టిన్సెన్ అనే ఇద్దరు రీసెర్చర్లు రాసిన కథనం సోమవారం పబ్లిష్ అయింది. వెస్టరన్ చైనాలోని జిన్ జియాంగ్ ప్రాంతానికి 60మైళ్ల దూరంలో కొత్త సిలో మైదానాన్ని రెడీ చేస్తున్నారు.

‘మొత్తం గ్రిడ్ కు ఉన్న ఔట్ లైన్ ను బట్టి చూస్తుంటే దాదాపు 110సిలోలు ఉన్నట్లుగా తెలుస్తుంది. 14 సిలో కన్‌స్ట్రక్షన్ సైట్లకు డోమ్ వంటి నిర్మాణం చేపట్టారు. రీసెర్చర్ల విశ్లేషణ ప్రకారం మరో 19సిలోలు కూడా తయారుచేయాలనే ఆలోచనలో ఉన్నారు. చైనీస్ నగరమైన యెమన్ లో 119కొత్త మిస్సైల్ సిలోల నిర్మాణం జరుగుతుందని బయటపడిన.. కొద్ది వారాల్లోనే ఇవి కూడా మొదలయ్యాయట.

అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పెంచుకోవడం కోసం చైనా దాదాపు 250కొత్త సిలోల ఏర్పాటు చేపట్టిందని ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్ వెల్లడించారు. దశాబ్దాల కాలం నుంచి చైనీస్ ప్రభుత్వం ఎటువంటి న్యూక్లియర్ ఆయుధాల రేసులోనూ లేదు. ఇప్పటివరకూ ఏర్పాటైన సిలోలలో ఎన్ని మిస్సైల్స్ పడతాయో అనే దానిపైన కూడా స్పష్టత లేదు. పెద్ద ఎత్తులో సిలోలు ఏర్పాటనేది న్యూక్లియర్ మోడరైజేషన్ ప్రోగ్రాంను వృద్ధి చేయడంలో భాగమే.

ఇప్పుడిక సిలోల నిర్మాణం మిలటరీ ఒత్తిళ్లను మరింత పెంచుతుంది. చైనా ఉద్దేశ్యాలకు ఆజ్యం పోసినట్లవుతుంది’ అంటూ కథనంలో రాశారు.

ట్రెండింగ్ వార్తలు