G20 summit..Rishi Sunak : ‘రష్యా చేసేది అనాగరిక యుద్ధం..ఈ సదస్సుకు పుతిన్ వచ్చి ఉంటేనా..’ అంటూ రష్యా మంత్రి ఎదుటే రిషి సునక్ ఘాటు వ్యాఖ్యలు

ఇండోనేషియాలోనే బాలిలో జరిగే జీ20 సదస్సులో రష్యాపై బ్రిటన్ ప్రధాని రిషి సునక్ తీవ్రంగా మండిపడ్డారు. యుక్రెయిన్ పై రష్యా చేసే యుద్ధం అనాగరికమైనదంటూ దుయ్యబట్టారు. వెంటనే యుద్ధాన్ని ఆపాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన సునక్ఈ సదస్సు కు పుతిన్ వచ్చి ఉంటే..’ అంటూ రష్యా మంత్రి ఎదుటే రిషి సునక్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

G20 summit..Rishi Sunak : జి-20 సదస్సులో భాగంగా బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ రష్యాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యుయిన్‌పై రష్యా చేసే యుద్ధాన్ని అనాగరిక యుద్ధంగా అభివర్ణించారు. అంతేకాదు ఈ అనాగరకి యుద్ధాన్ని ఇప్పటికైనా నిలిపివేయాలని యుక్రెయిన్ నుంచి రష్యా వెంటనే బయటకు రావాలి అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు ఈ జి-20 సదస్సుకు పుతిన్ వచ్చి ఉంటే ఈ సమస్యకు పరిష్కారాన్ని కనుగొనేవాళ్లం అంటూ రిషి సునక్ వ్యాఖ్యానించారు.

కాగా యుక్రెయిన్ పై రష్యా దాదాపు 10 నెలలు కావస్తోంది. 2022 ఫిబ్రవరి 24న, రష్యా ఉక్రెయిన్‌పై పెద్ద ఎత్తున యుద్ధం ప్రారంభించింది. అప్పటినుంచి యుక్రెయిన్‌పై రష్యా దాడిని కొనసాగిస్తోంది. దీంతో యుక్రెయిన్ శ్మశానంలా మారిపోయింది. యుక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధాన్ని అమెరికా, దాని మిత్రదేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే రష్యాలో కూడా ఈ యుద్ధంపై వ్యతిరేకత వ్యక్తమైంది. అయినా పుతిన్ మాత్రం యద్ధాన్ని కొనసాగిస్తునే ఉన్నారు. ఈ క్రమంలో ఇండోనేషియాలోని బాలిలో జరుగుతోన్న జి-20 సదస్సులో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌.. రష్యాపై విమర్శలు చేశారు. ఏ దేశమైనా తమ పొరుగు దేశంపై దాడి చేయకూడదని..ఇప్పటికైనా యుక్రెయిన్‌ నుంచి మాస్కో బయటకు రావాలని..ఈ అనాగరిక యుద్ధాన్ని ముగించాలి’ అని అన్నారు. ఇటువంటి యుద్ధ చర్యలతో రష్యా వైఖరి సరైంది కాదన్నారు.

Modi and Sunak Meeting: మోదీ, సునక్ భేటీ జరిగిన కొన్నిగంటలకే యూకే కీలక నిర్ణయం.. భారత పౌరులకు గుడ్ న్యూస్

అంతేకాదు ఈ సదస్సుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ గైర్హాజరుకావడాన్ని ఎద్దేవా చేశారు సునక్. ఈ సదస్సుకు పుతిన్ వచ్చి ఉంటే.. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు ప్రయత్నించేవాళ్లం’ అని అన్నారు. సునాక్ మాట్లాడుతున్న సమయంలో అదే ప్లీనరీ హాల్‌లో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ కూడా ఉండటం గమనించాల్సిన విషయం. ఆయన ఎదురుగానే బ్రిటన్ ప్రధాని తన దేశ వైఖరిని నిర్మొహమాటంగా సూటిగా స్పష్టంగా చెప్పారు.

యుద్ధం మొదలైనప్పనుంచి బ్రిటన్‌ ప్రధాని.. రష్యా ఉన్నతస్థాయి నేతతో ఎదురుపడి మాట్లాడడం ఇదే మొదటిసారి. సునక్ చేసిన ఈ వ్యాఖ్యలకు రష్యా విదేశాంగ మంత్రిసెర్గీ లావ్రోవ్ మాట్లాడుతూ..యుక్రెయిన్‌ చర్చలకు సముఖంగా లేకపోవడంతో..యుద్ధం విషయంలో ఒక ఒప్పందానికి రావడం క్లిష్టంగా మారింది అంటూచెప్పుకొచ్చారు.

G20 summit : జీ20 సదస్సులో మోడీతో రిషి సునక్ ముచ్చట్లు

 

ట్రెండింగ్ వార్తలు