Rupee Fall : చరిత్రలో తొలిసారి డాలర్‌కు 80 రూపాయలు..పతనానికి కారణమేంటీ..?

ఇండియన్ రూపాయి విలువ క్షీణిస్తోంది. అమెరికన్ డాలర్‌తో పోల్చినప్పుడు భారతదేశ రూపాయి విలువ అంతకంతకూ వేగంగా తగ్గుతోంది. చరిత్రలో తొలిసారి డాలర్‌కు 80 రూపాయలు చేరుకుంది. అసలు రూపాయి పతనానికి కారణం ఏంటి.. ఏ అంశాలు ప్రభావితం చేస్తున్నాయ్. ఈ డౌన్‌ఫాల్ ఇంకా కొనసాగే అవకాశాలు ఉన్నాయా ?

Reason Behind Rupee Fall : ఇండియన్ రూపాయి విలువ క్షీణిస్తోంది. అమెరికన్ డాలర్‌తో పోల్చినప్పుడు భారతదేశ రూపాయి విలువ అంతకంతకూ వేగంగా తగ్గుతోంది. చరిత్రలో తొలిసారి డాలర్‌కు 80 రూపాయలు చేరుకుంది. అసలు రూపాయి పతనానికి కారణం ఏంటి.. ఏ అంశాలు ప్రభావితం చేస్తున్నాయ్. ఈ డౌన్‌ఫాల్ ఇంకా కొనసాగే అవకాశాలు ఉన్నాయా ?

రూపాయి రూపాయి నీకేం తెలుసు అంటే.. పడడమే తెలుసు అందట! సోషల్‌ మీడియాలో ఇప్పుడు విపరీతంగా వినిపిస్తున్న మాట ఇది ! పడి లేవడం చూసుంటాం.. పడి మళ్లీ పడి పోవడం రూపాయి విషయంలోనే జరుగుతుందని.. నెట్టింట్లో డిస్కషన్. కొంతకాలంగా క్షీణిస్తోన్న రూపాయి విలువ.. ఆల్‌టైమ్‌ కనిష్ఠానికి పడిపోయింది. రూపాయి పతనానికి అంతూ పొంతూ లేకుండా పోతోంది. వరుస డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఏకంగా 80రూపాయలకు చేరుకుంది. ఇది ఇక్కడితో ఆగుతుందా అంటే.. రూపాయి మారకం విలువ 82కి చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని మార్కెట్ వర్గాలు అంటున్నాయ్.

డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 80 రూపాయలు దాటింది. అంటే.. మనం ఒక డాలర్ కొనాలంటే అందుకు బదులుగా 80 రూపాయలు చెల్లించాలన్నమాట ! స్వాతంత్ర్యం వచ్చినప్పుడు డాలరుతో రూపాయి మారకం విలువ 4 రూపాయల 16 పైసలు ఉండేది. ఐతే ఆ తర్వాత రూపాయి బలహీనపడుతూ… డాలర్ బలపడుతూ వచ్చింది. ఇప్పుడు చరిత్రలో తొలిసారి డాలరుతో పోలిస్తే 80 రూపాయలు దాటింది. ఈ పతనం మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉందన్న ఆర్థిక నిపుణుల హెచ్చరికలు ఇప్పుడు మార్కెట్ వర్గాల్లో కొత్త భయాలు రేపుతున్నాయ్.

గత ఆరు నెలల్లో రూపాయి విలువ 27సార్లు పతనం అయింది. ముందు నుంచీ ఈ విలువ 80కి పడిపోవచ్చన్న అంచనాలు ఉన్నాయ్. ఈ అంచనాలను నిజం చేస్తూ.. మొన్నటివరకూ 74 రూపాయలకు కాస్త అటు ఇటుగా ఉన్న డాలర్‌ మారక విలువ.. ప్రస్తుతం 80 రూపాయలను దాటేసింది. అంటే సుమారు 9శాతం పడిపోయింది. విదేశీ మార్కెట్లలో US డాలర్ స్థిరంగా ఉండటం, క్యాపిటల్ ఔట్‌ఫ్లోస్ పెరగడం లాంటి కారణాలతో రూపాయి క్షీణించి కనిష్ఠస్థాయికి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లలో క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టడం… రూపాయి నష్టాలను పరిమితం చేశాయని ఫారెక్స్ డీలర్లు చెప్తున్నారు.

Also read : Rupee Fall affect : రూపాయి క్షీణిస్తే జరగబోయే నష్టాలేంటి ?సామాన్యుడిపై ఎటువంటి ఈ ప్రభావం పడుతుంది..?

మిగతా ఆసియా దేశాలతో పోలిస్తే రూపాయి విలువ బలంగానే ఉంది. వర్ధమాన దేశాల కరెన్సీతో పోలిస్తే మెరుగైన ప్రదర్శనే చేస్తున్నా.. డాలర్‌తో మాత్రం పోటీపడలేకపోతోంది. అందుకే త్వరలోనే 81కి చేరుకోవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. రష్యా, యుక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక… ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను అమెరికాలాంటి సురక్షితమైన గమ్యస్థానాలకు షిఫ్ట్ చేస్తున్నారు. డాలర్‌దే ఆధిపత్యం కాబట్టి… తమ కరెన్సీ విలువను రక్షించుకోవాల్సి అవసరం యూఎస్‌కు లేదు. స్థిరంగా ఉన్న మార్కెట్ కావడంతో యుద్ధం తర్వాత ఇన్వెస్టర్లు పెట్టుబడులను అక్కడికి తరలిస్తున్నారు. రూపాయి పతనానికి ఇదీ ఓ కారణమే అంటున్నాయ్ మార్కెట్ వర్గాలు.

ఇక విదేశీ కరెన్సీ ప్రవాహం కోసం రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఇప్పటికే చర్యలు తీసుకుంది. కొన్నేళ్లుగా వచ్చిన నష్టాలు భర్తీ అవ్వాలంటే సమయం పడుతుంది. భారత్‌లో పెట్టుబడులతో పోలిస్తే అమెరికా బాండ్‌ యీల్డ్‌ ఎక్కువగా ఉంది. అందుకే ఇన్వెస్టర్లు అటువైపు పరుగెడుతున్నారు. అమెరికాలో 2 నుంచి 5 ఏళ్ల డిపాజిట్లపై 3శాతం కన్నా ఎక్కువ వడ్డీ వస్తోంది. ఇక అటు ద్రవ్యోల్బణం కంట్రోల్‌ చేసేందుకు యూఎస్‌ ఫెడ్‌ దూకుడుగా వడ్డీరేట్లను పెంచుతోంది. వచ్చే సమావేశంలో 75బేసిస్‌ పాయింట్ల వరకు పెంచేందుకు సిద్ధం అయింది. వడ్డీరేట్ల పెరుగుదలతో డాలర్‌ బలం పెంచుతోంది. క్రూడ్‌ ఆయిల్‌ కొనుగోలు కోసం భారత కంపెనీలు డాలర్లనే ఉపయోగిస్తుండటంతో వాటికి డిమాండ్‌ పెరిగింది. ఇది మన కరెన్సీ విలువను దెబ్బతీస్తోంది.

అంతర్జాతీయంగా మాంద్యం వచ్చే అవకాశాలు ఉండటంతో డాలర్‌ బలపడుతోంది. ఇది రూపాయిపై ఒత్తిడి పెంచుతోంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం కూడా ఎకానమీని ఇబ్బంది పెడుతోంది. రష్యా, యుక్రెయిన్‌ ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం పెరిగింది. చాలా దేశాల కరెన్సీలను దెబ్బకొట్టింది. అందుకే ఎన్ని దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నా రూపాయి పతనం ఆగడం లేదన్నది మరికొందరు ఆర్థికవేత్తల అభిప్రాయం.

 

ట్రెండింగ్ వార్తలు