Russia Ukraine war : రాజీ ఫార్ములా కొస్తున్నరష్యా ?

యుక్రెయిన్‌ను పిచ్చుక అనుకున్నాడు.. తన సైనిక బలంతో ఆక్రమించుకుకోవడం చాలా తేలిక అనుకున్నాడు రష్యా అధ్యక్షుడు పుతిన్. కానీ, జరిగింది వేరు.

Russia Ukraine war :  యుక్రెయిన్‌ను పిచ్చుక అనుకున్నాడు.. తన సైనిక బలంతో ఆక్రమించుకుకోవడం చాలా తేలిక అనుకున్నాడు రష్యా అధ్యక్షుడు పుతిన్. కానీ, జరిగింది వేరు. ప్రాణం మీదకొచ్చిన బెబ్బులిలా యుక్రెయిన్‌ తిరగబడడంతో.. పుతిన్‌కు ఏం చేయాలో అర్థం కావడం లేదు. వేలాది మంది సైన్యం ప్రాణాలు కోల్పోయారు.. ఆయుధాలు అయిపోతున్నాయి. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. అనుకున్న టార్గెట్‌ పూర్తి కాకపోవడంతో.. ఇప్పుడు పరువు కాపాడుకునేందుకు సరికొత్త ఫార్ములాతో ముందుకొస్తున్నాడు పుతిన్.

రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా..? అంటే.. రాజు దెబ్బలు కొట్టండని చెప్పటమే  ఆలస్యం, పని పూర్తి కానిచ్చేస్తారు సిబ్బంది. కానీ, దెబ్బలు తినే వారు వాటికి అలవాటు పడితే కొట్టేవాడికే నొప్పెక్కువ. ఇప్పుడిదే పరిస్థితి తలెత్తింది రష్యా అధ్యక్షుడు పుతిన్‌కి.  తన సైన్యం ముందు చాలా చిన్నదనుకున్న యుక్రెయిన్‌ నుంచి భారీ ప్రతిఘటన ఎదురవుతోంది.

యుద్ధం మొదలు పెట్టి దాదాపు నాలుగు వారాలు కావొస్తున్నా.. ఇంత వరకు టార్గెట్ రీచ్ కాలేదు కదా.. వేలాది మంది సైన్యాన్ని.. వేలాది ఆయుధాలను పోగొట్టుకొని.. దాడి చేసే కెపాసిటీని కోల్పోతూ వచ్చింది. ఇప్పటికిప్పుడు యుద్ధం ఆపేస్తే.. రష్యా పరువు పోతుంది. అందుకే పుతిన్ కొత్త ఫార్ములా లేవనెత్తాడు.

పుతిన్‌కు కావలసింది.. ఇప్పుడు తాము గెలిచినట్లు ప్రకటించుకోగలగటం. ఈ అనవసర దండయాత్రలో రష్యా ముఖం పగిలేలా ఎదురు దెబ్బతింది. పుతిన్ తనే స్వయంగా రచించుకున్న తన భ్రమల కోసం ఉన్నదంతా ఊడ్చి జూదంలో పణంగా పెట్టి, ఓడిపోయారని రష్యన్లకు అర్థమైపోయింది.

ఒకప్పుడు రష్యా సామ్రాజ్యంలో భాగమైన ఫిన్లండ్‌ మీద 1939లో జోసెఫ్ స్టాలిన్ దండెత్తారు. 2022లో పుతిన్ యుక్రెయిన్ విషయంలో నమ్మినట్లుగానే.. నాడు స్టాలిన్ కూడా తన సైన్యం ఫిన్లండ్‌లో స్వల్ప కాలంలోనే పైచేయి సాధిస్తుందని బలంగా నమ్మాడు. స్టాలిన్ సేనానులు ప్రాణ భీతితో.. ఆయన అంచనాలు సరైనవేనని భరోసా ఇచ్చారు. కానీ స్టాలిన్ అంచనాలు తప్పాయి. నాటి యుద్ధం 1940 వరకూ కొనసాగి.. చివరకు సోవియట్ సైన్యం అవమానపడింది.

రష్యా దాడులను ఎన్నిటినో తిప్పికొట్టి, పుతిన్ బలగాలు బలహీనంగా, అసమర్థంగా ఉన్నట్లు కనిపించేలా చేసిన యుక్రెయిన్‌.. నాటి ఫిన్లండ్‌లా చేయగలిగింది. పుతిన్ సైన్యాలు కీవ్ నగరాన్ని, యుక్రెయిన్‌లోని మరిన్ని భూభాగాలను హస్తగతం చేసుకునే ఛాన్స్ ఇవ్వకుండా భీకర పోరాటం చేసి.. రష్యా సేనలకి ఎదురు నిలుస్తున్నాయి.
Also Read : Covid Returns : ఆగ్నేయాసియాలో కరోనా ఉప్పెన.. నిర్లక్ష్యం వద్దు.. నాల్గో వేవ్ ముప్పుపై రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్..!
యుక్రెయిన్‌ను రష్యా ప్రావిన్స్‌గా మార్చాలని పుతిన్‌ కోరుకుంటే.. కానీ అది సాధ్యమయ్యేలా లేదు. యుక్రెయిన్ యుద్ధాన్ని కొనసాగించడానికి రష్యా మందుగుండు సామగ్రి దాదాపుగా అయిపోయిందని అంతర్జాతీయ నివేదికలు చెప్తున్నాయి. దీంతో పుతిన్ కొత్త ఫార్ములాతో ముందుకు రానున్నారు. అయితే అణుబాంబు.. లేదా శాంతి చర్చలు. ఏం జరిగినా.. తానే గెలిచానని చెప్పుకోవాలనేది పుతిన్ ప్లాన్.

ఎంత ఘోర యుద్ధమైనా ఎప్పుడో ఒకప్పుడు ముగియాల్సిందే. కొన్నిసార్లు.. చావో రేవో తేల్చుకునే వరకూ పోరాటం జరుగుతుంది.. కొన్నిసార్లు అయితే ఎక్కువగా ఏదో ఒక రాజీ ఒప్పందంతో యుద్ధాలు ముగుస్తాయి. ఆ ఒప్పందాలు ఎవరినీ పూర్తిగా సంతృప్తి పరచవు కానీ, కనీసం రక్తపాతం ఆగిపోతుంది.
Also Read : Ukraine Russia War : యుధ్ధం కారణంగా మండుతున్న వంట నూనెల ధరలు
భీకరంగా యుద్ధం చేసుకున్న బద్ధ శత్రువులైనా సరే.. పోరాటం ముగిశాక మెల్లమెల్లగా పాత సంబంధాలను పునరుద్ధరించుకుంటాయి. శత్రుత్వాలు కాస్తంతైనా తగ్గుతాయి. ఇప్పుడు రష్యా, యుక్రెయిన్‌ల మధ్య ఈ రాజీ ఫార్ములా వర్కౌట్ అయితే.. ప్రపంచం మొత్తం ఊపిరి పీల్చుకుంటుంది.

ట్రెండింగ్ వార్తలు