UN Chief Antonio Guterres : రష్యా, యుక్రెయిన్ యుద్ధం ఆగేనా? త్వరలో పుతిన్, జెలెన్ స్కీతో UN చీఫ్ కీలక భేటీ

రెండు నెలలుగా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో యుద్ధానికి ముగింపు పలికేందుకు ఐక్యరాజ్యసమితి చీఫ్ ప్రయత్నాలు ప్రారంభించారు.(UN Chief Antonio Guterres)

UN Chief Antonio Guterres : రష్యా, యుక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. సైనిక చర్య పేరుతో యుక్రెయిన్ పై దండెత్తిన రష్యా… దాడులు చేస్తూనే ఉంది. యుక్రెయిన్ పై బాంబులు, క్షిపణుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే యుక్రెయిన్ లోని చాలా ప్రాంతాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. రష్యా బలగాల దాడుల్లో అనేకమంది యుక్రెయిన్ సైనికులు మరణించారు. జనావాసాలపై దాడులు చేయడంతో వేలాది మంది పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు.

Warrior Dog In War : యుక్రెయిన్‌తో రష్యా వార్ లో వారియర్‌గా మారిన కుక్క..వేలమంది ప్రాణాలను కాపాడింది

రెండు నెలలుగా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో యుద్ధానికి ముగింపు పలికేందుకు ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోని గుటెరస్ ప్రయత్నాలు ప్రారంభించారు. త్వరలోనే ఆయన రష్యా అధ్యక్షుడు పుతిన్ తో, యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో భేటీ కానున్నారు. ఏప్రిల్ 26న రష్యాకు వెళి పుతిన్ తో ప్రత్యేక సమావేశం కానున్నారు. ఆ తర్వాత ఏప్రిల్ 28న యుక్రెయిన్ వెళ్లి జెలెన్ స్కీతో భేటీ కానున్నారు. ఆయా దేశాల విదేశాంగ శాఖ మంత్రులతోనూ ఆయన భేటీ కానున్నారు. ఇప్పటికే ఇరు దేశాధినేతలకు లేఖలు రాసిన గుటెరస్.. శాంతి కోసం చర్చలు జరపాలని పిలుపునిచ్చారు.(UN Chief Antonio Guterres)

Russia Ukraine War : రష్యాను టచ్ చేసి చూడు.. క్షిపణి ప్రయోగంతో పుతిన్ వార్నింగ్.. భూమిపై ఎక్కడైనా గురితప్పదు..!

రష్యా-ఉక్రెయిన్‌ వివాదంలో మధ్యవర్తిత్వం వహించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఐక్యరాజ్యసమితి చీఫ్‌ ఆంటోని గుటెరస్‌ ఇదివరకే తెలిపారు. ఉక్రెయిన్‌లో విధ్వంసకర యుద్ధాన్ని ఆపేందుకు రష్యా ఉక్రెయిన్‌ నాయకులతో వారి వారి రాజధానుల్లో చర్చలు నిర్వహించాలని గుటెరస్‌ కోరుకుంటున్నారని యూఎన్ ప్రతినిధి స్టీఫెన్‌ దుజారిక్‌ తెలిపారు. మాస్కో, కీవ్‌లకు తాను విచ్చేసేనప్పుడు తనను రిసీవ్‌ చేసుకోవాలని పుతిన్‌, జెలెన్‌స్కీలను ఆయన కోరినట్లు దుజారిక్‌ తెలిపారు. శాంతి సాధనకు ముసాయిదా ఒప్పందాన్ని ఇప్పటికే ఉక్రెయిన్‌కు పంపింది రష్యా. ఉక్రెయిన్‌లో శాంతిని నెలకొల్పేందుకు తక్షణ చర్యలతో పాటు బహుపాక్షిక సంబంధాల భవిష్యత్తుపై గుటెరస్‌ ఈ ఇద్దరు అధ్యక్షులతో చర్చించాలనుకుంటున్నట్లు దుజారిక్‌ తెలిపారు.

Russia Ukraine War : ‘ఆ ఆలోచన మానండి..లేదంటే ఉక్రెయిన్ కు పట్టిన గతే మీకూ పడుతుంది’..స్వీడన్, ఫిన్లాండ్ లకు రష్యా వార్నింగ్

ముట్టడిలో ఉన్న మరియుపోల్‌లో మానవతా కారిడార్లను తెరిచేందుకు ఉక్రెయిన్‌, రష్యా ఇప్పటికే ఒక ఒప్పందానికి వచ్చాయి. దక్షిణ యుక్రెయిన్‌ నగరమైన మరియుపోల్‌ నుంచి 6వేల మంది పౌరులను (ముఖ్యంగా మహిళలు, పిల్లలు, వృద్ధులను) సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఇరు పక్షాలు అంగీకరించాయి.(UN Chief Antonio Guterres)

కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి 24న యుక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యకు దిగిన విషయం తెలిసిందే. తొలుత యుక్రెయిన్‌ సైనిక స్థావరాలే లక్ష్యంగా చేసుకున్నామని చెప్పిన మాస్కో.. ఆ తర్వాత సాధారణ జనావాసాలపైనా విరుచుకుపడింది. నానాటికీ ఈ యుద్ధం తీవ్రరూపం దాల్చడమే గాక, వేలాది మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. యుక్రెయిన్‌లోని పలు నగరాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి.

రష్యా తీరుపై యావత్ ప్రపంచం మండిపడుతోంది. రష్యా దురాక్రమణను తప్పుపడుతోంది. రష్యాను కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలు కఠిన ఆంక్షలు విధించాయి. అయినా, పుతిన్ మాత్రం తగ్గేదేలే అంటున్నారు. అనుకున్నది సాధించే వరకు యుద్ధాన్ని ఆపేదే లేదని ప్రకటించారు.

ట్రెండింగ్ వార్తలు