Drones Drop Food, Water : కుక్కలకు డ్రోన్ల ద్వారా ఆహారం, నీరు సరఫరా..ఎందుకంటే?

తిండి, నీరు లేక అల్లాడిపోతున్న కుక్కల కోసం కుక్కలకు డ్రోన్ల ద్వారా ఆహారం, నీరు సరఫరా చేశారు. ఎందుకంటే..

Drones Drop Food, Water For Dogs : డ్రోన్లు వాడకం వచ్చాక..రహదారులు లేని ప్రాంతాలకు కూడా మెడిసిన్స్, ఆహారం సరఫరాలు ఎంత తేలిగ్గా జరిగిపోతున్నాయి. ఈక్రమంలో ఓప్రాంతంలో తిండి నీరు లేక అల్లాడిపోతున్న కుక్కల కోసం డ్రోన్ల ద్వారా ఆహారాన్ని, నీటిని సరఫరా చేశాయి రెండు సంస్థలు. కుక్కల కోసం ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే..

స్పెయిన్‌ దేశంలో అగ్నిపర్వతం పేలింది. లావా వెలువలా ఎగిసిపడుతోంది. దీంతో ఆ ప్రాంతంలో చిక్కుకుపోయిన కుక్కలకు డ్రోన్స్ ద్వారా ఆహారం, నీరు అందించారు. స్పానిష్ ద్వీపమైన లా పాల్మాలోని టోడోక్ పర్వత ప్రాంతంలో అగ్నిపర్వతం నుంచి లావా వెలువడుతోంది. అగ్నిపర్వతం నుంచి వెలువడుతున్న లావాతో ఆ ప్రాంతమంతా బూడిదతో నిండిపోయింది. ఈ ప్రాంత యార్డ్‌లో ఉన్న కుక్కల కోసం ఆకాశంలో డ్రోన్ ద్వారా ఆహారం, నీటిని సరఫరా చేస్తున్నారు. టికామ్ సొల్యూసియోన్స్, వోల్కానిక్ లైఫ్‌ అనే రెండు సంస్థలు గత ఐదు రోజులుగా ఇలాగే కుక్కల కోసం తిండీ నీరు అందిస్తున్నాయి. కుక్కలకు డ్రోన్ల ద్వారా ఆహారం అందించినందుకు ఈ రెండు సంస్థలకు లా పాల్మా ద్వీపం కౌన్సిల్ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపింది.

Read more : Medicine From The Sky : దేశంలోనే తొలిసారి తెలంగాణలో డ్రోన్లతో వ్యాక్సిన్ల తరలింపు

లావా నుంచి వెలువడుతున్న వేడి గాలి, అగ్నిపర్వతం నుంచి వెలువడుతున్న బూడిద వల్ల ఈ ప్రాంతంలో హెలికాప్టర్లు ఎగిరే పరిస్థితి కూడా లేదు. హెలికాప్టరు రోటర్లు వేడిగాలి వల్ల దెబ్బతినే అవకాశముంది. దీంతో అగ్నిపర్వత ప్రాంతంలోని కుక్కులకు ఆహారాన్ని డ్రోన్ల ద్వారా అందిస్తున్నారు. లా పాల్మాలో అగ్నిపర్వతం పేలుడు సంభవించాక స్కూల్ ప్లే గ్రౌండ్స్ లో జంతువుల కోసం తాత్కాలికంగా ఆశ్రయం ఏర్పాటు చేశారు.సెప్టెంబరు 19వతేదీన కుంబ్రేవీజా అగ్నిపర్వతం పేలినపుడు వందలాది కుక్కలు, ఇతర జంతువులకు ఆశ్రయం లేకుండా పోయింది.లావా ప్రవాహంతో 1200 భవనాలను ఖాళీ చేయాల్సి వచ్చింది.

Read more : Medicine from the Sky : డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్ల తరలింపు..ఐసీఎంఆర్‌కు అనుమతులు

దాదాపు 600 హెక్టార్లకుపైగా ప్రాంతమంతా బూడిదతో నిండిపోయింది. 1,200 భవనాలు అగ్నిపర్వతం నుంచి వెదజల్లిన రాళ్ల ప్రవాహాలకు దెబ్బతిన్నాయి. ఆ ప్రాంతం నుంచి వేలాది మందిని ఖాళీ చేయవలసి వచ్చింది.

 

ట్రెండింగ్ వార్తలు