Talibans ‘Mada 9’ Super Car : ‘Mada 9’ సూపర్ కారు తయారు చేసిన తాలిబన్లు .. అప్ఘానిస్థాన్ చరిత్రలో తొలి స్పోర్ట్స్ కారు ..

తాలిబన్లు ఓ సూపర్ కారును తయారు చేశారు. అదే 'Mada 9' సూపర్ కార్. అప్ఘానిస్థాన్ చరిత్రలో ఇదే తొలి స్పోర్ట్స్ కారు ..

Talibans Mada 9 supercar : తాలిబన్లు అంటే రాక్షసత్వం,నిరంకుశత్వం, ప్రజలు ఇలాగే ఉండాలనే ఆంక్షలు ముఖ్యంగా మహిళల విషయంలో అంతలేని ఆంక్షలు,వారి ఆదేశాలను అతిక్రమిస్తే అనాగరికంగా శిక్షించే ఘటనలు ఇవే గుర్తుకొస్తాయి. 2021 ఆగస్టులో అఫ్ఘానిస్థాన్ ను స్వాధీనంచేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత తాలిబన్లు చెప్పిందొకటి చేసేది మరొకటి. తమదైన శైలిలోనే మహిళలపై ఆంక్షలు విధించారు. ఎంతోమంది దేశం వదిలిపోయారు.
ముజాహిదీన్ నాయకులను మించిన రాక్షసత్వంతో హింసాత్మక చర్యలకు పాల్పడే నరరూప రాక్షసులు అనే మాట ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మాట. అటువంటి తాలిబన్లు తుపాకులతో కాల్చేయటమేకాదు వారిలో ప్రతిభ దాగుందని నిరూపించారు.

అప్ఘానిస్థాన్ లో తాలిబన్ల చేతులు తుపాకులు కాల్చటమే కాదు కార్లు తయారు చేస్తారని నిరూపించారు. ఓ సూపర్ కారును తయారు చేశారు తాలిబన్లు. అప్ఘాన్ చరిత్రలోనే తొలి స్పోర్ట్స్ కారు తయారు చేసి మాలోను ప్రతిభాపాటవాలు ఉన్నాయని నిరూపించారు తాలిబన్లు.అప్ఘానిస్థాన్ దేశ చరిత్రలోనే ‘తొలి స్పోర్ట్స్ కారు’ మడా 9 ( Mada 9 supercar)ను తాలిబన్లు ఆవిష్కరించారు. ఈ సూపర్ కారు ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

అప్ఘానిస్థాన్ తాలిబన్లు తొలిసారి దేశీయంగా ఓ సూపర్‌ కారును తయారు చేయడం అంటే అదో ప్రపంచ వింత అనే చెప్పాలి. తాలిబన్లు తయారు చేసిన ఆ సూపర్ కారుకు మడా 9 ( Mada 9 supercar)అనే పేరు పెట్టారు. ఈ కారు లుక్ చూస్తుంటే.. బుగాటీ, లాంబొర్గిని, ఫెరారీ లాంటి సూపర్ కార్లకు ఏమాత్రం తీసిపోదని తెలుస్తోంది. ఈ సూపర్ కార్లకు తాలిబన్ల మడా 9 కారు పోటీ ఇస్తుందనేలా ఉంది. 30మంది తాలిబన్ ఇంజనీర్లు ఈ కారు మడా9ను తయారుచేశారని తెలిపారు.దేశీయంగా తయారు చేసిన ఈ కారును చూసి తాలిబన్ ప్రభుత్వం ప్రశంసలు కురిపించింది.

ఇప్పటికీ ప్రొటోటైప్ దశలోనే ఉన్న సూపర్ కారును డెవలప్ చేయడానికి ఐదేళ్లకుపైనే సమయం పట్టింది. ఎన్‌టాప్, కాబుల్‌లోని అప్ఘానిస్థాన్ టెక్నికల్ వొకేషనల్ ఇన్‌స్టిట్యూట్ (ఏటీవీఐ)కి చెందిన 30 మంది ఇంజినీర్లు ఈ కారును తయారు చేశారు. ఈ మడా 9 సూపర్ కారులో టొయోటా కొరొల్లా ఇంజిన్ వాడారు. ఎన్‌టాప్ ప్రధాన కార్యాయంలో బుధవారం (జనవరి 18,2023)ఈ కారును ఆవిష్కరించారు. సూపర్ లుక్ తో కళ్లు తిప్పుకోనివ్వని అందం రిచ్ గా ఈ కారు కనిపిస్తోంది.

తమ ప్రజలకు మతంతోపాటు ఆధునిక శాస్త్రాలను కూడా అధించడానికి తాలిబన్ల పాలన కట్టుబడి ఉందని నిరూపించడానికి ఈ కారే నిదర్శనమని తాలిబన్ల ఉన్నత విద్య శాఖ మంత్రి అబ్దుల్ బఖీ హఖ్ఖానీ తెలిపారు. ప్రపంచ వేదికగా అప్ఘానిస్థాన్ ఇమేజ్‌ను పెంచడానికి ఈ కారు దోహదం చేస్తుందని కారు ఉత్పత్తి చేసిన సంస్థ ‘ఎన్‌టాప్’ సీఈవో మహ్మద్ రిజా అహ్మదీ తెలిపారు.

ఈ కారును ఎప్పుడు లాంచ్ చేస్తారనే విషయాలను ఇంకా వెల్లడించలేదు. ముందుగా అప్ఘానిస్థాన్‌ మార్కెట్లోకి ఈ కారును రిలీజ్ చేస్తామని.. తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో విడుదల చేస్తామని రిజా తెలిపారు. మడా 9ను ఇప్పటికే పరీక్షించారు. ఈ కారు తయారీ తమ దేశానికి గౌరవమని పేర్కొంటూ.. మడా 9 ఫొటోలను తాలిబన్ల అధికార ప్రతినిధి సోషల్ మీడియాలో పోస్టు చేయటంతో ఇది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఈకారు డిజైన్ గురించి చెప్పాలంటే..కారు ముందు భాగంలో ఫాసియాని కలిగి ఉంది, ఇది ఆస్టన్ మార్టిన్‌ను పోలి ఉంది. LED హెడ్‌ల్యాంప్స్, పెద్ద మల్టీ-స్పోక్ ఆల్-బ్లాక్ అల్లాయ్ వీల్స్‌,LED టెయిల్‌ల్యాంప్స్ ఇలా ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఈ కారును విదేశాలలో కూడా విక్రయించాలని కంపెనీ యోచిస్తోంది. ఈ కారు లాంచ్ ఎప్పుడు? ఎక్కడ అనేది మాత్రం ఇంకా వివరించలేదు.

ట్రెండింగ్ వార్తలు