Conjuring House: రూ.12 కోట్ల‌కు అమ్ముడు పోయిన దెయ్యాల ఇల్లు.. ఆ సినిమా చూస్తే అస‌లు విష‌యం తెలుస్తుంది

అదిఒక దెయ్యాల ఇల్లు.. అక్క‌డ దెయ్యాలు సంచ‌రిస్తాయ‌ని అంటుంటారు.. అటువైపు వెళ్లేందుకు కూడా ఎవ‌రూ సాహ‌సించ‌రు. 1736లో ఈ ఇంటిని నిర్మించారు. 1971 నుంచి 1980 సంవ‌త్స‌రం వ‌ర‌కు ఆ ఇంట్లో పెరాన్ కుటుంబం నివ‌సించేది.

Conjuring House: అదిఒక దెయ్యాల ఇల్లు.. అక్క‌డ దెయ్యాలు సంచ‌రిస్తాయ‌ని అంటుంటారు.. అటువైపు వెళ్లేందుకు కూడా ఎవ‌రూ సాహ‌సించ‌రు. 1736లో ఈ ఇంటిని నిర్మించారు. 1971 నుంచి 1980 సంవ‌త్స‌రం వ‌ర‌కు ఆ ఇంట్లో పెరాన్ కుటుంబం నివ‌సించేది. అప్ప‌ట్లో ఆ ఇంటిలో వారు దెయ్యాలతో అనేక ఇబ్బందులు ప‌డ్డార‌ని క‌థ‌లు క‌థ‌లుగా చెప్పుకొనేవారు. అయితే పెద్ద‌గా ఎవ‌రూ న‌మ్మ‌క‌పోయినా 2013 త‌రువాత ఆ ఇంటివైపు చూడ‌టానికి కూడా చాలా మంది సాహ‌సించ‌లేదు. 2013లో కంజ్యూరింగ్ అనే సినిమా తెర‌కెక్కింది. ఆ ఇంటిలో దెయ్యాల గురించే ఈ సినిమా. అప్ప‌ట్లో ఆ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డుల మోత‌మోగింది. అదే స‌మ‌యంలో అక్క‌డ దెయ్యాలుంటాయ‌ని ప్ర‌పంచానికి తెలిసింది. దీంతో దానిని ఘోస్ట్ హౌస్ అని కూడా పిలుస్తారు.

ఈ సినిమా త‌రువాత ఆ ఇంటిని అనేక మంది ప‌రిశోధ‌న‌లు చేశారు. అయితే 2019లో జెన్‌, కోరి హైన్‌జ‌న్ అనే ఇద్ద‌రు వ్య‌క్తులు ఆ ఇంటిని 4,39,00 డాల‌ర్ల‌కు కొనుగోలు చేశారు. వీరిద్ద‌రు ఆ ఇంటిలో నిజంగా ఆత్మ‌లు ఉన్నాయా అనే విష‌యాన్ని తెలుసుకొనేందుకు ప‌రిశోధ‌న‌లు చేశారు. కొన్నాళ్లు ప‌రిశోధ‌న‌లు చేసిన త‌రువాత ఏమైందో ఏమోకానీ ఆ ఇంటిని 1.2 మిలియ‌న్ డాల‌ర్ల‌కు 2021 సెప్టెంబ‌రులో విక్ర‌యానికి పెట్టారు. అస‌లే దెయ్యాల ఇల్లు.. అందులోనూ ద కంజ్యూరింగ్ హౌస్ సినిమాలో ఆ ఇంట్లో దెయ్యాలు ఉన్న‌ట్లు క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూపించారు. ఆ ఇంటిని ఎవ‌రు కొంటారులే అని అంద‌రూ అనుకున్నారు.

Viral video: నా స్టైలే వేరు.. వెరైటీగా పెళ్లి మండపానికి పెళ్లి కూతురు.. వరుడు బంధువులు ఏం చేశారంటే..

కానీ.. ప్ర‌పంచ వ్యాప్తంగా దెయ్యాల ఇల్లుగా పేరుపొందిన ఆ ఇల్లు ఏకంగా రూ.12కోట్లు (1.52 మిలియ‌న్ డాల‌ర్లు)కు అమ్ముడుపోయింది. ఫ్రీ గా ఇచ్చినా ఆ ఇంటిని ఎవ‌రూ తీసుకోర‌ని భావించిన స‌మ‌యంలో ఓ వ్య‌క్తి అంతపెద్ద మొత్తంలో ఆ ఇంటిని ఎందుకు కొనుగోలు చేశార‌న్న ప్ర‌శ్న స్థానికంగా ఉత్ప‌న్న‌మ‌వుతోంది. అయితే ఆ ఇంటిని ఎవ‌రు కొనుగోలు చేశార‌నేది తెలియాల్సి ఉంది. అయితే ఆ ఇంటిని ప‌రిశోధ‌న‌ల‌కు వాడుతారా..? లేక ఆ ఇంటిలో నివాసం ఉంటారా అనేది వేచి చూడాల్సిందే.

ట్రెండింగ్ వార్తలు