Singapore Government : భారతీయులకు సింగపూర్ ప్రభుత్వం గుడ్ న్యూస్..టీకా రెండు డోసులు తీసుకుంటే దేశంలోకి అనుమతి

భారతీయులకు సింగపూర్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. టీకా రెండు డోసులు తీసుకున్న భారతీయులకు ఎలాంటి క్వారంటైన్ నిబంధన లేకుండా దేశంలోకి అనుమతించనున్నట్టు చెప్పింది.

Singapore government Good news Indians : భారతీయులకు సింగపూర్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. టీకా రెండు డోసులు తీసుకున్న భారతీయులకు ఎలాంటి క్వారంటైన్ నిబంధన లేకుండా దేశంలోకి అనుమతించనున్నట్టు చెప్పింది. ఈ నెల 29 నుంచి ఇది అమల్లోకి వస్తుందని తెలిపింది.

అలాగే, వ్యాక్సినేషన్ పూర్తయిన ఇండోనేషియా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతర్ దేశ పౌరులకు కూడా క్వారంటైన్ నిబంధన ఎత్తివేస్తున్నట్టు తెలిపింది. అయితే, ఇండోనేషియన్లకు ఈ నెల 29 నుంచి ఇది వర్తిస్తుందని, సౌదీ అరేబియా, యూఏఈ, ఖతర్ దేశాలకు మాత్రం డిసెంబరు 6 నుంచి వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Wanted To Commit Suicide : ’ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’.. కోహ్లీ కుమార్తెపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తి వెల్లడి

ఇటు భారత్‌కు వచ్చే విదేశీయులు క్వారంటైన్‌లో ఉండాలనే నిబంధనను భారత ప్రభుత్వం సడలించింది. 99 దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు క్వారంటైన్ నిబంధనలు తొలగిస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ దేశాల నుంచి వచ్చే ప్రజలు పూర్తిగా వ్యాక్సినేషన్ చేయించుకొని ఉంటే చాలని తెలిపింది. వీరు క్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదని ప్రకటించింది.

ఈ జాబితాలో యూకే, యూఎస్, ఫ్రాన్స్, జర్మనీ, ఇజ్రాయెల్‌, స్పెయిన్‌, ఆస్ట్రేలియా, బెల్జియం, బంగ్లాదేశ్‌, ఫిన్‌లాండ్‌, క్రొయేషియా, హంగేరి, రష్యా, ఖతర్, సింగపూర్, శ్రీలంక, నేపాల్‌ తదితర దేశాలున్నాయి. అయితే ఈ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు వ్యక్తిగతంగా ఎవరికీ వారే తమపై 14 రోజుల పాటు పర్యవేక్షణ ఉంచుకోవాలని ప్రభుత్వం సూచించింది.

ట్రెండింగ్ వార్తలు