Work from home: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. ఎక్కడినుంచైనా పనిచేసుకోవచ్చు..

కొవిడ్ మహమ్మారి తరువాత పలు రంగాల్లోని కంపెనీలు ఉద్యోగులకు అనుకూలంగా మార్పులు తెస్తున్నాయి. రెండేళ్లుగా ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనాతో ఏడాది పాటు కార్యాలయాలు...

Work from home: కొవిడ్ మహమ్మారి తరువాత పలు రంగాల్లోని కంపెనీలు ఉద్యోగులకు అనుకూలంగా మార్పులు తెస్తున్నాయి. రెండేళ్లుగా ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనాతో ఏడాది పాటు కార్యాలయాలు మూతపడ్డాయి. ఇప్పుడిప్పుడే కొవిడ్ తీవ్రత తగ్గుముఖం పట్టడంతో కంపెనీల కార్యాలయాలు తెరుచుకుంటున్నాయి. ఉద్యోగులు కార్యాలయాల బాట పడుతున్నారు. ఇప్పటికీ అధిక శాతం ఐటీ, ఇతర రంగాల్లోని కంపెనీలు తమ ఉద్యోగులు ఇంటి వద్ద నుంచే వర్క్ చేసుకొనే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. కొన్ని కంపెనీలు ఇప్పటికే పూర్తిస్థాయి వర్క్ ఫ్రం హోం అవకాశాన్ని ఉద్యోగులకు కల్పించాయి. ఈ తరహాలో మరో కంపెనీ వచ్చిచేరింది. వెకేషన్ రెంటల్ కంపెనీ ఎయిర్‌బీఎన్‌బీ కూడా తన ఉద్యోగులను బంపర్ ఆఫర్ ఇచ్చింది.

ఎయిర్‌బీఎన్‌బీ సంస్థలో పనిచేసేవారు ప్రపంచంలో ఏ మూలన ఉండైనా పనిచేసుకోవచ్చని స్పష్టంచేసింది. మీ శాలరీలపై ఈ విధానం ఎలాంటి ఎఫెక్ట్ చూపబోదని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ఎయిర్‌బీఎన్‌బీ సహ వ్యవస్థాపకుడు, సీఈవో బ్రియాన్ చెస్కి తన ఉద్యోగులకు ఈ మెయిల్ ద్వారా సమాచారాన్ని అందించారు. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిక్సో వేదికగా ఎయిర్‌బీఎన్‌బీ అనే సంస్థ పర్యాటకుల కోసం పనిచేస్తుంది. వారికి హోటల్, బస, పర్యాటక ప్రాంతాలకు సంబంధించి బుకింగ్, ఇతర సేవలను అందిస్తుంది. ఈ సంస్థ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది.

Work from Home: ఉద్యోగులను ఆఫీసులకు రప్పించేందుకు బంపర్ ఆఫర్లు

ఆఫీస్, ఇళ్లు, దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా, లేదా 170 దేశాల్లోని ఏ మాల నుంచైనా తమ ఉద్యోగులు పనిచేసుకోవచ్చని, మరికొద్ది నెలల్లోనే ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు సంస్థ సీఈవో బ్రియాన్ చెస్కీ తమ ఉద్యోగులందరికీ రెండు రోజుల క్రితం ఈ మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చారు. అయితే ఆఫీస్ కార్యకలాపాలు చూసుకునేందుకు కొద్దిమంది మాత్రం కార్యాలయానికి రావాల్సి ఉంటుందని సీఈవో తెలిపాడు. అ క్రమంలో సంస్థ సీఈవో నాలుగు అంశాలను ఉద్యోగులకు ఈ మెయిల్ ద్వారా పంపించిన సందేశంలో వివరించారు. సెప్టెంబర్ నుంచి సంస్థ ఉద్యోగులు 170 దేశాల్లోని ఏ ప్రాంతం నుంచైనా పనిచేసుకోవచ్చని తెలిపారు. ట్యాక్స్ లు కారణంగా 90 రోజులు ఒకే ప్రాంతంలో ఉండాల్సి ఉంటుందని, ఉద్యోగులు తమ వర్క్ పర్మిట్లను పొందాల్సి ఉంటుందని, ఉద్యోగుల సౌలభ్యం కోసం స్థానిక ప్రభుత్వాలతో సంస్థ సంప్రదింపులు జరుపుతోందని సంస్థ సీఈవో అన్నారు.

ట్రెండింగ్ వార్తలు