Naked Art: క్యాన్సర్‭పై అవగాహన కార్యక్రమం.. 2,500 మంది బట్టలు విప్పేసి ఫొటోలకు ఫోజు ఇచ్చారు

ఆస్ట్రేలియాలో నాల్గవ అతిపెద్ద కాన్సర్ కారకంగా చర్మ క్యాన్సర్ ఉంది. దేశ వ్యాప్తంగా మొత్తం 17,756 మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. కాగా, ప్రతి ఏడాది 1,281 మంది ఆస్ట్రేలియన్లు ఈ వ్యాధితో చనిపోతున్నారు. దీనిపై ప్రజల్లో అవగాహన పెంచే ప్రయత్నంలో భాగంగా నగ్న కార్యక్రమాన్ని ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో నిర్వహించారు

Naked Art: చర్మ క్యాన్సర్‭పై అవగాహన కల్పించడం కోసం నిర్వహించిన ఓ కార్యక్రమం కోసం 2,500 మంది బట్టలు విప్పేసి నగ్నంగా ఫొటోషూట్‭లో పాల్గొన్నారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఉన్న బోంది బీచ్‭లో శనివారం కనిపించిందీ దృశ్యం. అమెరికన్ ఫొటోగ్రాఫర్ స్పెన్సర్ టునిక్ ఈ ఫొటోలు తీశారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన సామూహిక నగ్న ఫొటోలు తీయడంలో టునిక్ ప్రసిద్ధి చెందిన ఫొటోగ్రాఫర్. బీచ్ వద్ద అనేక మంది నగ్నంగా హాజరైన ఈ కార్యక్రమంలోని అనేక భిన్న ఫొటోలను టునిక్ తీశారు.

Bharat Jodo Yatra: మధ్యప్రదేశ్‌లో కొనసాగుతున్న రాహుల్ భారత్ జోడో యాత్ర.. పాల్గొన్న ప్రియాంక వాద్రా (ఫొటోలు)

ఆస్ట్రేలియాలో నాల్గవ అతిపెద్ద కాన్సర్ కారకంగా చర్మ క్యాన్సర్ ఉంది. దేశ వ్యాప్తంగా మొత్తం 17,756 మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. కాగా, ప్రతి ఏడాది 1,281 మంది ఆస్ట్రేలియన్లు ఈ వ్యాధితో చనిపోతున్నారు. దీనిపై ప్రజల్లో అవగాహన పెంచే ప్రయత్నంలో భాగంగా నగ్న కార్యక్రమాన్ని ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో నిర్వహించారు. ఈ విషయమై టునిక్ స్పందిస్తూ “స్కిన్ చెక్‌ల గురించి అవగాహన పెంచుకోవడానికి మనకు అవకాశం ఉంది. ఇక్కడికి వచ్చి, ఇలాంటి కార్యక్రమంలో భాగమవ్వడం, ఇందులో నా కళను చూపించుకోవడం ఆనందంగా ఉంది” అని అన్నారు.

WhatsApp Share Voice Notes : వాట్సాప్‌లో త్వరలో వాయిస్ నోట్స్ కొత్త ఫీచర్ వస్తోంది.. మీ వాయిస్ నోట్‌ను స్టేటస్ అప్‌డేట్స్‌గా షేర్ చేసుకోవచ్చు!

ఇందులో పాల్గొన్న రాబిన్ లిండ్నర్ అనే కార్యకర్త స్పందిస్తూ “నేను ముందు భయపడ్డాను. అయితే దీని గురించి ముందు రాత్రి అంతా బాగా ఆలోచించి ఇందులో పాల్గొనాలని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరు చాలా గొప్పవారు. అందరూ గౌరవంగా ఉన్నారు. చాలా సరదాగా అనిపించింది. పైగా ఇలా అవగాహన కల్పించడం గౌరవంగా భావిస్తున్నాను’’ అని అన్నారు. 2010లో సిడ్నీలో 5,200 మంది ఆస్ట్రేలియన్లు సిడ్నీ ఒపెరా హౌస్‌లో నగ్నంగా పోజులిచ్చినప్పుడు టునిక్ చివరిసారిగా ఫొటో నిర్వహణ చేశారు.

ట్రెండింగ్ వార్తలు