Potatoes in Flights: 3 విమానాల్లో అమెరికా నుంచి జపాన్‌ కు బంగాళాదుంపల లోడు

ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే ఇష్టపడని వారుండరు. కరకరలాడే వేడివేడి ఫ్రైస్ ను అందరు ఇష్టంగా తింటారు. అయితే జపాన్ లో మాత్రం ఇప్పుడు ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ కి తీవ్ర కొరత వచ్చిపడింది

Potatoes in Flights: ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే ఇష్టపడని వారుండరు. కరకరలాడే వేడివేడి ఫ్రైస్ ను అందరు ఇష్టంగా తింటారు. అయితే జపాన్ లో మాత్రం ఇప్పుడు ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ కి తీవ్ర కొరత వచ్చిపడింది. వివరాల్లోకి వెళితే..ప్రముఖ ఫాస్ట్ ఫుడ్ సంస్థ “మెక్ డొనాల్డ్స్”కు ప్రపంచ వ్యాప్తంగా రెస్టారెంట్లు ఉన్నాయి. “మెక్ డొనాల్డ్స్” తయారు చేసే బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్ కు మంచి డిమాండ్ ఉంది. జపాన్ లోనూ “మెక్ డొనాల్డ్స్” తయారు చేసే ఫుడ్ కి బాగా డిమాండ్ ఉంది. ముఖ్యంగా ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే అక్కడి ప్రజలు మరింత ఇష్టంగా తింటారు. తమ ఫ్రెంచ్ ఫ్రైస్ లో రకరకాల ఐటమ్స్ అందిస్తుంటుంది “మెక్ డొనాల్డ్స్”. అయితే ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ తయారు చేసేందుకు సాధారణ బంగాళ దుంపలు పనికిరావు. ప్రత్యేకంగా పండించిన బంగాళ దుంపలనే ఫ్రైస్ తయారీలో వాడతారు. ఆ దుంపలను అమెరికా నుంచి కెనడా మీదుగా జపాన్ లోకి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది.

Also Read: Ayodhya Ram Mandir: రామ మందిర నిర్మాణాన్ని ఇక ఎవరూ అడ్డుకోలేరు: హోంమంత్రి అమిత్ షా

ఇటీవల జపాన్ వ్యాప్తంగా ఉన్న”మెక్ డొనాల్డ్స్” రెస్టారెంట్లలో ఫ్రెంచ్ ఫ్రైస్ కొరత వచ్చిపడింది. సమయానికి రావాల్సిన బంగాళ దుంపల షిప్పింగ్ కంటైనర్లు కెనడా సముద్ర తీరంలో ఆగిపోయాయి. దీంతో జపాన్ వ్యాప్తంగా “మెక్ డొనాల్డ్స్” రెస్టారెంట్లలో తీవ్ర ఫ్రెంచ్ ఫ్రైస్ కొరత వచ్చిపడింది. ఉన్న కొద్దీ పాటి నిల్వలను లిమిటెడ్ సర్వీస్ పేరుతో ముందుగా క్యూ లైన్లో నిలుచున్నవారికే అందిస్తున్నారు. అసలే ఫ్రైస్ అంటే పడిచచ్చే జపాన్ దేశస్థులు..అవి దొరక్క పోవడంతో “మెక్ డొనాల్డ్స్”కు రావడం తగ్గించారట. షిప్పింగ్ కంటైనర్ వచ్చేసరికి.. ఆలస్యమౌతుండడంతో.. త్వరగా వచ్చేలా అమెరికా నుంచి ఏకంగా మూడు భారీ విమానాల్లో అత్యవసరంగా బంగాళ దుంపలను దిగుమతి చేసుకుంది జపాన్ లోని “మెక్ డొనాల్డ్స్” సంస్థ. డిసెంబర్ 31 నాటికీ ఈ మూడు విమానాలు జపాన్ చేరుకోగా..యుద్ధ ప్రాతిపదికన దేశ వ్యాప్తంగా వీటిని తరలించేందుకు సన్నాహాలు చేసింది అక్కడి “మెక్ డొనాల్డ్స్” సంస్థ. ఈవార్త అంతర్జాతీయ మీడియా దృష్టిని సైతం ఆకర్షించింది.

Also read: New Florona Variant ఇజ్రాయెల్ లో బయటపడ్డ మరో కొత్తరకం కరోనా వేరియంట్ “ఫ్లోరోనా”

ట్రెండింగ్ వార్తలు