US : కాబూల్‌లో డ్రోన్ దాడి, తప్పు చేసి లెంపలేసుకున్న అమెరికా

తప్పులు చేయడం...తర్వాత లెంపలేసుకోవడం అమెరికాకు అలవాటే....! బలగాల ఉపసంహరణ పేరుతో... అప్ఘాన్‌ను అనాదలా వదిలేసిన అమెరికా.. చివరి రోజుల్లో విధ్వంసం సృష్టించింది.

Kabul Drone Strike : తప్పులు చేయడం…తర్వాత లెంపలేసుకోవడం అమెరికాకు అలవాటే….! బలగాల ఉపసంహరణ పేరుతో… అప్ఘాన్‌ను అనాదలా వదిలేసిన అమెరికా.. చివరి రోజుల్లో విధ్వంసం సృష్టించింది. బలగాలు ఉపసంహరణ జరుగుతున్న సమయంలోనే… కాబూల్‌పై డ్రోన్ దాడులకు పాల్పడింది. ఐసిస్ ఆపరేషన్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ డ్రోన్‌ దాడులు నిర్వహించినట్లు అప్పట్లో అమెరికా సెంట్రల్‌ కమాండర్‌ ప్రకటించారు. కానీ నాటి దాడుల్లో చిన్నారులు సహా 10 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.

Read More : India : ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం

తాము ఐసిస్‌ స్థావరాలపైనే డ్రోన్లతో బాంబులు వేశామని.. సాధారణ పౌరులు ఎవరూ చనిపోలేదని…ఆ రోజు బుకాయించిన అమెరికా పెద్దలు ఇప్పుడు లెంపలేసుకున్నారు… తమ దాడిలో అమాయక ప్రజలు చనిపోయిన మాట వాస్తవమేనని… అసలు ఆ దాడి చేసి ఉండాల్సింది కాదని అమెరికా ప్రకటించింది. ఆగస్టు 29న కాబూల్‌పై అమెరికా చేసిన డ్రోన్‌ దాడుల్లో  10 మంది మృతి చెందగా.. అందులో చిన్నారులు కూడా ఉన్నారు.

Read More : Tank Bund : గణేష్ నిమజ్జనం, ట్యాంక్ బండ్‌‌పై 40 క్రేన్లు..ప్రత్యేక నిఘా

అమెరికా అమాయకులను పొట్టన పెట్టుకుందని ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం కావడంతో ఈ ఘటనపై విచారణ జరిగింది. చివరకు అది తమ పొరపాటేనని అంగీకరించింది. యూఎస్ డిఫెన్స్‌ సెక్రటరీ ఈ ఘటనపై క్షమాపణలు చెప్పారు.  ఇలాంటి ఘటనల నుంచి గుణపాఠం నేర్చుకుంటామని.. భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూసుకుంటామని ప్రకటించారు…పది మంది అమాయక ప్రాణాలు అమెరికా బాంబులకు బలైన తర్వాత… అగ్రరాజ్యం ఇప్పుడు క్షమాపణలు చెప్పినా… పశ్చాతాప్తం వ్యక్తం చేసినా.. పోయిన ప్రాణాలు తిరిగి రావు.

ట్రెండింగ్ వార్తలు