Ukraine Tension : యుక్రెయిన్‌లో 18వేల మంది భారతీయులను తీసుకొచ్చేందుకు చర్యలు : విదేశాంగ శాఖ

యుక్రెయిన్‌లోని భారతీయుల్లో విద్యార్థులు సహా దాదాపు 18 వేల మంది భారతీయులను తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్ వెల్లడించారు.

Ukraine Tension : యుక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలైంది. యుక్రెయిన్‌పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తోంది. యుక్రెయిన్‌లోని అన్ని నగరాలపై రష్యా దాడులు చేస్తోంది. రష్యా దాడిలో 40 మంది యుక్రెయిన్ సైనికులు మృతిచెందారు. పదిమందికి పైగా సామన్య పౌరులు మృతిచెందినట్టు ప్రకటించారు. రెండు ఎయిర్ ఫోర్టులను రష్యా సైన్యం ధ్వంసం చేసింది. రష్యా దాడులను యుక్రెయిన్ సైనిక దళం కూడా తిప్పికొడుతోంది. రష్యా దాడుల నేపథ్యంలో యుక్రెయిన్‌లో భారతీయులు బిక్కుమంటూ గడుపుతున్నారు. యుక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు భారత్ అన్ని చర్యలు తీసుకుంటోంది.

యుక్రెయిన్‌లోని భారతీయుల్లో విద్యార్థులు సహా దాదాపు 18 వేల మంది భారతీయులను తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్ వెల్లడించారు. యుక్రెయిన్‌లో గగనతలం మూసివేసిన క్రమంలో స్వదేశానికి తిరిగి వచ్చేందుకు భారతీయుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఉక్రెయిన్‌లోని భారతీయులందరి భద్రతకు కేంద్ర ప్రభుత్వం భరోసా ఇస్తుందని ఆయన అన్నారు. యుక్రెయిన్‌లోని పలువురు విద్యార్థులతో ఫోన్‌లో మాట్లాడినట్టు ఆయన తెలిపారు. అలాగే, యుక్రెయిన్‌లోని దక్షిణ ప్రాంతాల్లోని భారతీయ విద్యార్థులకు ఆహారం, నీళ్లు, విద్యుత్ అందిస్తున్నట్టు తెలిపారు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న విద్యార్థులకు సంబంధించి వారి తల్లిదండ్రులు ఆందోళన చెందొద్దని మంత్రి వి.మురళీధరన్ అన్నారు.

Ukraine Tension Mea Taking Steps To Bring Back About 18,000 Indians From Ukraine Mos Muraleedharan

యుక్రెయిన్‌లోని డాన్‌బాస్ ప్రాంతంలో రష్యా సైనిక కార్యకలాపాల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంటున్నట్టు నివేదిక తెలిపింది. యుక్రెయిన్ గగనతలం మూసివేయడంతో ప్రత్యేక విమానాల షెడ్యూల్‌ను రద్దు చేసినట్లు రాయబార కార్యాలయం తెలిపింది. యుద్ధం ముప్పు ఉన్న సమయంలో, మరిన్ని విమానాలను సర్వీసులను నడిపి అందులో భారతీయులను తిరిగి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు కానీ, యుక్రెయిన్‌లోని గగనతలం మూసివేయడంతో భారతీయులను తిరిగి తీసుకొచ్చే చర్యలను నిలిపివేయాల్సి వచ్చిందన్నారు. ఈ క్రమంలోనే విమానాల్లో భారతీయులను తిరిగి తీసుకురావడానికి బదులుగా ప్రత్యామ్నాయ చర్యలను ప్లాన్ చేస్తున్నట్టు వెల్లడించారు. భారత రాయబార కార్యాలయ చర్యల్లో సాయపడేందుకు ఈ ప్రాంతానికి మరింత మంది దౌత్యవేత్తలను పంపాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్ణయించిందని ఆయన చెప్పారు. భారతీయుల భద్రతకు కేంద్ర ప్రభుత్వం భరోసా ఇస్తుందని విద్యార్థులు, తల్లిదండ్రులు భయపడవద్దని ఆయన కోరారు.

ఇదిలా ఉండగా.. యుక్రెయిన్‌లో మార్షల్ లా అమల్లో కొనసాగుతోంది. దీంతో భారతీయుల ప్రయాణాలు మరింత కష్టంగా మారాయి. కీవ్‌లో తలదాచుకునేందుకు చోటులేని భారతీయుల కోసం నిక యంత్రాంగంతో సంప్రదింపులు జరుపుతున్నామని కీవ్ (యుక్రెయిన్)లోని భారత రాయబార కార్యాలయం మూడో ప్రకటనలో వెల్లడించింది. బాంబు వార్నింగ్‌లు, ఎయిర్ సైరన్ల మోత కీవ్‌లో చాలా చోట్ల వినిపిస్తున్నాయని అంటున్నారు. భారతీయులు ఎవరైనా మీరున్న చోట ఇలాంటి సైరన్లు
వినిపిస్తే.. గూగుల్ మ్యాప్ ద్వారా సమీపంలోని బాంబ్ షెల్టర్లను చేరుకోండని భారత ఎంబసీ సూచిస్తోంది. కీవ్‌లో చాలా మంది అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్లలో తలదాచుకుంటున్నారని తెలిపింది. మీ పాస్‌పోర్టులు, పత్రాలను పట్టుకుని వీలైనంత వరకు ఇళ్లల్లోనే ఉండాలని కీవ్ భారత రాయబారి కార్యాలయం సూచిస్తోంది.

Read Also : Russia Ukraine War : రష్యా దాడిలో 40 మంది ఉక్రెయిన్ సైనికులు, 10 మందికిపైగా సామాన్య పౌరులు మృతి

ట్రెండింగ్ వార్తలు