Girl inspiring Video : ఆడపిల్లలకు చదువెందుకు? అన్న తండ్రికి కూతురి ధీటైన సమాధానం చూడండి

ఆడపిల్లలకు చదువెందుకు అన్న తండ్రికి ఓ చిన్నారి చెప్పిన సమాధానం వింటే ఆశ్చర్యపోతారు. తమ దేశాన్ని మళ్లీ నిర్మించుకోవాలని చెప్పే ఆ బాలిక ధైర్య సాహసాలను మెచ్చుకుని తీరతారు. ఎవరా బాలిక.. చదవండి.

Girl inspiring Video

Girl inspiring Video : ఆడపిల్లకి స్కూలు వద్దు అన్న తండ్రిపై ఓ చిన్నారికి కోపం వచ్చింది. అబ్బాయిలు మాత్రమే చదువుకోవాలి అన్న అతని మాటకు ఆ కూతురు చెప్పిన సమాధానం వింటే ఆశ్చర్యపోతారు. అంతేకాదు దేశం గురించి ఆమె మాట్లాడిన మాటలు వింతే  చాలా స్ఫూర్తిని పొందుతారు.

Viral Video : ఆడపిల్లల బాత్రూమ్‌లో సీసీ కెమెరాలు..! స్కూల్ ప్రిన్సిపాల్‌‌ను పిచ్చకొట్టుడు కొట్టారు, వీడియో వైరల్

ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ అధికారం చేజిక్కించుకున్నప్పటి నుంచి అక్కడ ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా బాలికలను పాఠశాలకు వెళ్లకుండా నిషేధించారు. స్కూలుకి వెళ్లాలని కలలు కంటున్న ఓ చిన్నారికి ..అబ్బాయిలకు మాత్రమే స్కూలు అని చెబుతున్న తండ్రికి మధ్య జరిగిన ఓ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

theafghan అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేసిన వీడియోలో తండ్రి, కూతురు కాన్వర్సేషన్ వైరల్ అవుతోంది. ముద్దులొలుకుతున్న ఓ చిన్నారికి తండ్రి మీద కోపం వచ్చింది. ఎందుకని అడిగిన తండ్రికి స్కూలుకి వెళ్లనివ్వనందుకు అని సమాధానం చెప్పింది. ‘అబ్బాయిలు మాత్రమే చదువుకోవాలి .. నీ బ్రదర్ ని మాత్రమే స్కూలుకి పంపుతాను’ అని ఆ తండ్రి సమాధానం చెప్పాడు. ‘స్కూల్‌కి వెళితే ఏం సాధిస్తారని? తండ్రికి అడిగిన ప్రశ్నకు ‘తాను డాక్టర్, లేదా టీచర్ అవుతాను’ అని చెప్పింది..చదువుకి లింగ బేధం లేదని విద్య అందరిదీ అని నొక్కి చెప్పింది. ‘మనుష్యులు నాశనం చేసే వస్తువులు ఏవి?’ అని తండ్రి అడిగినపుడు ‘కాబూల్ నుంచి కాందహార్ వరకూ ఎన్ని ప్రదేశాలు నాశనం చేశారో మీరే వెళ్లి చూడండి ‘అంటూ తండ్రికి సమాధానం చెప్పింది. అంతేకాదు ‘మనం మన దేశాన్ని పునర్నిర్మించుకోవాలి’ అని ఎంతో తెలివిగా చెప్పింది. ఇప్పటికే ఆఫ్ఘన్ బాలికలకు పాఠశాలల్లో, యూనివర్సిటీల్లో ప్రవేశం నిషేధించి ఏడాది గడిచిపోయింది. ఈ సందర్భంలో ఈ చిన్నారి మాటలు వైరల్ అవుతున్నాయి.

baby girl : 138 సంవత్సరాల తర్వాత ఆ ఫ్యామిలీలో ఆడపిల్ల .. ఆసక్తి కలిగిస్తున్న స్టోరి

ఈ వీడియో చూస్తుంటే ఆ చిన్నారి తెలివి తేటలు, ఆత్మ విశ్వాసం కనిపిస్తున్నాయి. నెటిజన్లు ఈ బాలికను చూసి స్ఫూర్తి పొందుతున్నారు. ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. దేశాన్ని మళ్లీ నిర్మించుకోవాలని అని చెప్పడం నెటిజన్లను తీవ్ర భావోద్వేగాలకు గురి చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

ట్రెండింగ్ వార్తలు