Adhanom Ghebreyesus : బూస్ట‌ర్ డోస్ పంపిణీ బూట‌కం.. పేద‌దేశాలకు సింగిల్ డోసు దక్కేనా!

పేద దేశాల్లో కంటే ధనిక దేశాల్లోనే కొవిడ్ బూస్టర్ పంపిణీ ఎక్కువగా జరుగుతోంది. అసమాన స్థాయిలో వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నారని ఆందోళన వ్యక్తమవుతోంది.

Booster Distribution Scandal : పేద దేశాల్లో కంటే ధనిక దేశాల్లోనే కొవిడ్ బూస్టర్ పంపిణీ ఎక్కువగా జరుగుతోంది. అసమాన స్థాయిలో వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నారంటూ ఆందోళన వ్యక్తమవుతోంది. పేద దేశాలు మొదటి షాట్ కోసం ఆశగా ఎదురుచూస్తుంటే.. ఆరోగ్యంగా ఉండి వ్యాక్సినేషన్ పూర్తి అయిన వారికి బూస్టర్ డోసులు ఇవ్వడం అవివేకమని అన్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డైరెక్టర్ జనరల్ అధనామ్ ఘెబ్రేయేసస్. రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్నవారికి మాత్రమే బూస్టర్ డోసులు అవసరమని ఆయన చెప్పారు.

మీడియా సమావేశంలో పాల్గొన్న ఘెబ్రేయేసస్ మాట్లాడుతూ.. అధిక టీకా రేట్లు కలిగిన దేశాలు బూస్టర్ మోతాదులను స్టోర్ చేయడం కొనసాగిస్తున్నాయని, ఆ బూస్టర్ డోసుల కోసం పేద దేశాలు వేచి ఉన్నాయని అన్నారు. తక్కువ-ఆదాయ దేశాలలో ప్రాథమిక మోతాదుల కంటే ప్రపంచవ్యాప్తంగా 6 రెట్లు ఎక్కువ బూస్టర్‌లు పంపిణీ అవుతున్నాయని ఘెబ్రేయేసస్ చెప్పారు. ఈ బూస్టర్ స్కాండల్ వెంటనే నిలిపివేయాలన్నారు. ఆరోగ్యకరమైన పెద్దలకు బూస్టర్‌ల పంపిణీ చేయడాన్ని WHO చీఫ్ విమర్శించారు ఆరోగ్య కార్యకర్తలు, వృద్ధులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర అధిక-ప్రమాద గ్రూపులవారికి ఇప్పటికీ బూస్టర్ సింగిల్ డోసు కూడా అందలేదన్నారు.

రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న దేశాల్లో అసమాన వ్యాక్సిన్ పంపిణీ ద్వారా ఆఫ్రికాను తీవ్రంగా దెబ్బతీసిందన్నారు. ఆఫ్రికాలో ఖండంలోని జనాభాలో కేవలం 6 శాతం మాత్రమే కరోనా పూర్తిగా టీకాలు అందాయని WHO ప్రాంతీయ కార్యాలయం అక్టోబర్ 28న నివేదించింది. కరోనా వ్యాక్సిన్‌లు మాత్రమే మహమ్మారిని అంతం చేయవన్నారు. ప్రపంచ వ్యాక్సిన్ సంక్షోభాన్ని తక్షణమే పరిష్కరించకపోతే మహమ్మారిని అంతం చేయలేమని ఘెబ్రేయేసస్ చెప్పారు. గతంలో ఏడాది చివరి నాటికి ప్రతి దేశంలోని జనాభాలో 40 శాతం మందికి టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం 100 కంటే ఎక్కువ దేశాలు ఈ లక్ష్యాన్ని చేరుకోలేకపోయాయని WHO చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ తెలిపారు. దేశ జనాభాలో కనీసం 20 శాతం మందికి కోవిడ్ షాట్‌లను అందించాలని WHO సూచించింది.

టీకాల పంపిణీకి సుమారు 500 మిలియన్ల ఎక్కువ మోతాదులు కావాలని, WHO ఆ లక్ష్యాన్ని కోల్పోయే అవకాశం ఉందని స్వామినాథన్ తెలిపారు. ఆఫ్రికాలోని కేవలం ఐదు దేశాలు మొరాకో, ట్యునీషియా మారిషస్‌లతో సహా తమ జనాభాలో 35 శాతానికి పైగా వ్యాక్సిన్‌లు అందుకున్నాయి. అయితే మెజారిటీ ఆఫ్రికన్ దేశాలు తమ జనాభాలో 10 శాతం కంటే తక్కువగా టీకాలు వేసినట్లు కూడా నివేదికలు సూచిస్తున్నాయి. పేద దేశాలు క‌రోనా వ్యాక్సిన్ తొలిడోసు కోసం నిరీక్షిస్తున్న దశ‌లో బూస్ట‌ర్ డోస్‌ను ముందుకు తేవ‌డాన్ని కుంభ‌కోణంగా WHO చీఫ్ టెడ్రోస్ అధ‌నం గెబ్రియ‌స‌స్ అభివ‌ర్ణించారు. బూస్టర్ డోసుల పంపిణీలో ఇదే అసమానత కొనసాగితే భవిష్యత్తులో పేదదేశాలకు సింగిల్ వ్యాక్సిన్ డోసు దక్కడం కష్టమేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎంత‌మందికి వ్యాక్సినేష‌న్ ఇచ్చామనేది ముఖ్యం కాద‌ని, ఎవ‌రికి వ్యాక్సినేష‌న్ పూర్త‌యింద‌నేదే కీలకమన్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ 144 దేశాల్లో కొవాక్స్ వ్యాక్సిన్ పంపిణీ ద్వారా 50 కోట్ల వ్యాక్సిన్ డోసుల‌ను స‌ర‌ఫ‌రా చేశామ‌ని అధనామ్ ఘెబ్రేయేసస్ తెలిపారు.
Read Also : Kangana Ranaut : నా ప్రశ్నలకు సమాధానమిస్తే.. ‘పద్మ శ్రీ’ తిరిగి ఇచ్చేస్తా: కంగనా రనౌత్

ట్రెండింగ్ వార్తలు