WHO Chief: కరోనా మూలాలపై చైనాతో చర్చిస్తున్నామన్న డబ్ల్యూహెచ్ఓ చీఫ్

చైనా కోసం ఈనష్టాన్ని పుడ్చేందుకే డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనోమ్..అధ్యయనాల పేరిట మరో కొత్త డ్రామాకు దిగారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

WHO Chief: దాదాపు మూడేళ్ళుగా ప్రపంచాన్ని వొణికిస్తున్న కరోనా వైరస్ అంతానికి ప్రపంచ దేశాలు కలిసికట్టుగా రావాలని, కరోనా వాక్సిన్ అన్ని దేశాలకు సమానంగా చేరాలని డబ్ల్యూహెచ్ఓ చీఫ్.. టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రేయేసస్ అన్నారు. కరోనా మూలాలపై మరింత లోతుగా విశ్లేషించేందుకు చైనా ప్రధాని లీ కేకీయాంగ్ తో చర్చిస్తున్నట్లు టెడ్రోస్ వెల్లడించారు. శనివారం ట్విట్టర్ ద్వారా స్పందించిన టెడ్రోస్.. “చైనా ప్రధానితో సమావేశం అవడం సంతోషం కలిగించిందని, Covid -19 గురించి, వాక్సిన్ అసమానతల గురించి చర్చించామని, త్వరలో 70 శాతం ప్రపంచ జనాభాకు వాక్సిన్ వేసేలా కృషిచేస్తున్నట్లు” పేర్కున్నారు.

Also read: Karnataka Hijab Row: కర్ణాటకలో ముదురుతున్న బురఖా వివాదం

కరోనా వైరస్ చైనా నుంచే పుట్టుకొచ్చిందన్న వాదనలపై డబ్ల్యూహెచ్ఓ స్పందిస్తూ గతేడాది “నవల వ్యాధికారక మూలాలపై శాస్త్రీయ సలహా బృందాన్ని (SAGO)” ఏర్పాటు చేసింది. చైనాలో వైరస్ మూలాలపై నివేదిక ఇవ్వాలంటూ ఆదేశ ప్రభుత్వాన్ని కోరింది ఈ బృందం. అయితే రోగుల భద్రత దృష్ట్యా ఆ వివరాలను తాము వెల్లడించలేమంటూ చైనా కప్పిపుచ్చుకుంది. కరోనా వైరస్ ను ల్యాబ్ లలో సృష్టించలేమని, జంతువుల నుంచే మనుషులకు పాకీ ఉంటుందని చైనా వాదించింది. అయితే చైనా వాదనను తోసిపుచ్చిన అమెరికా.. తాము రహస్యంగా చేపట్టిన నివేదికను బయటపెట్టడంతో చైనా కాస్త వెనకడుగు వేసింది.

Also read: Rajnath Singh: రాహుల్ చైనా గురించి ఏం చదివితే అదే నమ్ముతాడు: రాజ్‌నాథ్ సింగ్ ఫైర్

అనంతరం తమ దేశంలో కరోనా వైరస్ పుట్టుపూర్వోత్తరాలపై సంయుక్తంగా అధ్యయనం చేసేందుకు SAGO బృందానికి చైనా అనుమతిచ్చింది. ఇదిలాఉంటే.. చైనా నుంచే వచ్చిన కరోనా తమ దేశాల్లో తీవ్ర ప్రతాపం చూపిందని భావిస్తున్న పశ్చిమ దేశాలు.. చైనాతో సంబంధాలు వదులుకునే ఆలోచనలో పడ్డాయి. దీంతో చైనా కోసం ఈనష్టాన్ని పుడ్చేందుకే డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనోమ్..అధ్యయనాల పేరిట మరో కొత్త డ్రామాకు దిగారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Also read: Parrot Steals GoPro: “గోప్రో కెమెరా”ను దొంగిలించి ఎగిరిపోయిన చిలుక, అద్భుతమైన వీడియో రికార్డ్

ట్రెండింగ్ వార్తలు