WHO Covid Tests : కోవిడ్ టెస్టులు తగ్గడంపై WHO ఆందోళన.. అలసత్వం వద్దు..!

ప్రపంచవ్యాప్తంగా విజృంభించిన కరోనావైరస్ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గతకొన్ని రోజులుగా కరోనా కేసులు తక్కువ స్థాయిలో నమోదవుతున్నాయి.

WHO Covid Tests :  ప్రపంచవ్యాప్తంగా విజృంభించిన కరోనావైరస్ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గతకొన్ని రోజులుగా కరోనా కేసులు తక్కువ స్థాయిలో నమోదవుతున్నాయి. ఇప్పటివరకూ అమల్లో ఉన్న అన్ని కరోనా ఆంక్షలను రాష్ట్రప్రభుత్వాలు ఒక్కొక్కటిగా సడలిస్తున్నాయి. మూసివేసిన స్కూళ్లు సహా పలు కార్యకలాపాలు మళ్లీ ఎప్పటిలానే కొనసాగనున్నాయి. కరోనా థర్డ్‌వేవ్‌ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా పెరిగిపోయిన కేసులు ప్రస్తుతం తగ్గుముఖం పడుతున్నాయి. కరోనా కేసుల సంఖ్య తగ్గడంతో కోవిడ్ టెస్టులను చేయడంలో కూడా అలసత్వం కనిపిస్తోంది. .

కరోనా పూర్తిగా తగ్గిపోయిందిలేనని కోవిడ్ టెస్టులను తగ్గించడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇలా వ్యవహరించడం ఏమాత్రం శ్రేయస్కరం కాదని WHO హెచ్చరించింది. వైరస్‌ను కట్టడి చేయాలన్నా.. పుట్టుకొచ్చే కొత్త వేరియంట్లను గుర్తించాలన్నా కరోనా టెస్టులే ఎంతో కీలకమని అభిప్రాయపడింది. కరోనా టెస్టులను కొనసాగించాలని WHO పేర్కొంది. వైరస్‌ ఎక్కడ, ఎలా ఉంది? ఎలా రూపాంతరం చెందుతోందనే విషయాలను ఎప్పటికప్పుడూ తెలుసుకోవాలని అవసరం ఎంతైనా ఉందని WHO సాంకేతిక విభాగాధిపతి మరియా వాన్‌ కెర్ఖోవ్‌ సూచించారు. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ పరీక్షలు ఒక్కసారిగా పడిపోయినట్లు గుర్తించామని చెప్పారు. ఒక వ్యక్తికి వైరస్ సోకిందని తెలిసేందుకు, వైద్యం అందించేందుకు ముందుగా అతడికి కరోనా పరీక్షలు చేయాల్సిందేనని కెర్ఖోవ్ పునరుద్ఘాటించారు.

అందుకే కరోనా టెస్టుల్లో అలసత్వం వహించకూడదని కోరారు. వైరస్‌ను గుర్తించేందుకు నాణ్యమైన టెస్ట్‌ కిట్‌లు అవసరమని మరియా సూచించారు. వినియోగానికి వీలుగా ఉండటంతో పాటు వేగంగా టెస్టు ఫలితాలను వెల్లడించే నాణ్యమైన కిట్‌లనే వినియోగించాలన్నారు. ఒమిక్రాన్‌ చివరిది కాదని, మరింత ప్రమాదకర వేరియంట్లు పుట్టుకొచ్చే ప్రమాదం ఉందని మరియా ఇటీవలే హెచ్చరించిన సంగతి తెలిసిందే. కరోనా కొత్త వేరియంట్లను ‘వైల్డ్‌కార్ట్‌ ఎంట్రీ’గా ఆమె అభివర్ణించారు. ఒమిక్రాన్‌ సబ్ వేరియంట్ BA-1 కన్నా.. కొత్తగా బయటపడిన సబ్ వేరియంట్ BA-2 మరింత వేగంగా వ్యాప్తి చెందుతోందని మరియ ఆందోళన వ్యక్తం చేశారు.

Read Also : WHO Warn Covid : కరోనా ఇంకా పోలేదు.. మరిన్ని వేరియంట్లు ఏ క్షణమైనా విజృంభించొచ్చు… WHO సైంటిస్ట్ హెచ్చరిక..!

ట్రెండింగ్ వార్తలు