22K Gold Vadapav : 22 క్యారెట్ల బంగారంతో చేసిన వడాపావ్..ధర ఎంతంటే..?

దుబాయ్ మరో కాస్ట్లీ డిష్ తో ప్రపంచాన్ని ఆకట్టుకుంటోంది.ముంబై ఫేమస్ డిష్ వడాపావ్ ని అచ్చమైన 22 క్యారెట్ల బంగారంతో చేసి మరోసారి దటీజ్ దుబాయ్ అనిపించుకుంటోంది.

World’s first 22K gold vada pav now in Dubai : వడాపావ్ అంటే మనకు ఠక్కున గుర్తుకొచ్చే నగరం ముంబై. భారత వాణిజ్య రాజధాని ముంబైలో ఎంతోమంది వడాపావ్ వ్యాపారులున్నారు. వడాపావ్ తిని కపుడు నింపుకునే ఎంతోమంది పేదులూ ఉన్నారు. ముంబై లో వడాపావ్ ఎంత ఫేమస్సో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. ప్లేట్ వడాపావ్ ఎంతుంటుంది? రూ.50 లేదా మహా అయితే రూ.100 ఉంటుంది.

ముంబైలో వడాపావ్ టేస్టే కానీ కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది. కానీ దుబాయ్ లో చేసిన ఓ వడాపావ్ మాత్రం వెరీ వెరీ స్పెషల్. ఎందుకంటే అది అచ్చమైన బంగారంతో చేసినది. మరి ధర ఎంతుంటుందనుకుంటున్నారు. దుబాయ్ కరెన్సీలో బంగారంతో చేసిన వడాపావ్ ధర 99 dirham. అదే మన భారత్ కరెన్సీలో దాదాపు రూ.2000. ఏంటీ షాక్ అయ్యారా? అదేమరి దుబాయ్ స్పెషల్. భూతల స్వర్గంలాంటి దుబాయ్ లో డబ్బులుండాలే కానీ సాక్షాత్తు స్వర్గమే కనిపిస్తుంది.

దుబాయ్ అంటే కాస్ట్లీ. దుబాయ్ అంటే డబ్బుంటే చాలు స్వర్గ సుఖాలు అనుభవించే భూతల స్వర్గం. అటువంటి దుబాయ్ ల్డ్ బిర్యానీ,గోల్డెన్ బర్గర్లు అందించిన తరువాత..ఇప్పుడు ప్రపంచంలోనే మొట్టమొదటి 22 క్యారెట్ల బంగారు వడాపావ్‌ని పరిచయం చేసింది.కరమాలో ఉన్న భారతీయ స్లయిడర్‌లకు సేవలు అందించడంలో ప్రసిద్ధి చెందిన ఓ పావో ‘కాస్ట్లీ’ పావ్‌ని ప్రవేశపెట్టింది. దీని ధర 99 దిర్హామ్ మన కరెన్సీలో సుమారు రూ. 2,000. ట్విట్టర్ లో మసరత్ దౌడ్ ఈ వడాపావ్ ని షేర్ చేయడం జరిగింది. నిజంగా ఈ వడాపావ్ చూస్తుంటే మనస్సు పులకరించిపోతోంది. నెటిజన్లును ఈ గోల్డెన్ వడాపావ్ తెగ ఆకట్టుకుంటోంది.

ఈ వీడియోని 20 వేల మందికి పైగా చూశారు. మరి ఇంత కాస్ట్లీ వెరైటీ వడాపావ్ ను సాధారణంగా ప్లేట్ లో పెట్టేసి ఇచ్చేస్తే వాల్యూ ఏంటుంది? అందుకే ప్రజంటేషన్ లో ఏమాత్రం తీసిపోకుండా 22 క్యారెట్ల బంగారం వడాపావ్ రేంజ్ లోనే ప్రజంటేషన్ కూడా ఉంది. పొగలుకక్కుతున్న ఈ గోల్డెన్ వడాపావ్ ని చిన్న చెక్క డబ్బాలో పెట్టి ఇస్తారు. ఈ వడాపావ్ తో పాటు స్వీట్ పొటాటో ఫ్రైస్ మరియు పుదీనా లేమనేడ్ ని ఇస్తారు.

ఈ వడాపావ్ మొత్తం ఛీజ్ తో ఫిల్ చేస్తారు అలాగే హోం మేడ్ మింట్ మాయనీజ్ డిప్ చేస్తారు. మంచి క్వాలిటీ తో దీనిని వ్రాప్ చేయడం జరుగుతుంది. అలానే ఫ్రెంచ్ నుండి ఇంపోర్ట్ చేసిన 22 క్యారెట్ గోల్డ్ లీవ్స్ తో ఎంతో అద్భుతంగా దీనిని తయారు చేస్తారు. గతంలో దుబాయ్ రూ.19000 ఖదీదైన రాయల్ గోల్డ్ బిర్యానీని ఎంతగా ఫేమస్ అయ్యిందో తెలిసిందే. ఈక్రమంలో దుబాయ్ ఇప్పుడు ఈ గోల్డెన్ వడాపావ్ ని తీసుకొచ్చి అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. దటీజ్ దుబాయ్.

ట్రెండింగ్ వార్తలు