10th Paper Leak : టెన్త్ పేపర్ లీక్.. తెలిసిన విద్యార్థుల కోసమే

10th Paper Leak : క్వశ్చన్ పేపర్ ను బందెప్ప పొరపాటున వేరే వాట్సాప్ గ్రూప్ కి పంపి వెంటనే డిలీట్ చేశారు. ఆలోగానే గ్రూప్ సభ్యులు..

10th Paper Leak : టెన్త్ పేపర్ లీకేజీ నిందితుల రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. తెలిసిన విద్యార్థుల కోసమే బందెప్ప, సమ్మప్ప పేపర్ లీక్ చేశారని నిర్ధారించారు. ఆన్సర్లు చీటీల రూపంలో పంపేందుకు బందెప్ప సెల్ ఫోన్ లో ఫొటోలు తీసి సమ్మప్పకు పంపించారు.

క్వశ్చన్ పేపర్ ను బందెప్ప పొరపాటున వేరే వాట్సాప్ గ్రూప్ కి పంపి వెంటనే డిలీట్ చేశారు. ఆలోగానే గ్రూప్ సభ్యులు దాన్ని స్క్రీన్ షాట్ తీసి వైరల్ చేసేశారు. అటు జిరాక్స్ షాప్ లో శివతో మైక్రో జిరాక్స్ చేయించారు బందెప్ప. ఇక బందెప్ప అరెస్ట్ విషయం తెలుసుకున్న శివ పరార్ అయ్యాడు. ఉద్దేశపూర్వకంగానే బందెప్ప క్వశ్చన్ పేపర్ లీక్ చేసినట్లుగా పోలీసులు ధృవీకరించారు.

Also Read..TS 10th Exams: టెన్త్ హిందీ పరీక్ష ప్రశ్నపత్రం వాట్సాప్ గ్రూపుల్లో వచ్చింది నిజమే..: అధికారుల నిర్ధారణ

వికారాబాద్ లో టెన్త్ క్లాస్ తెలుగు క్వశ్చన్ పేపర్ లీకేజీకి సంబంధించి వికారాబాద్ పోలీసులు రిమాండ్ రిపోర్టులో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఉద్దేశపూర్వకంగానే మాల్ ప్రాక్టీస్ కోసం పేపర్ లీక్ చేసినట్లుగా గుర్తించారు. చిట్టీల రూపంలో ఆన్సర్లు అందించాలని తెలిసిన వారికి బందెప్ప, సమ్మప్ప ఇద్దరూ కలిసి క్వశ్చన్ పేపర్ లీక్ చేసినట్లు పోలీసులు తేల్చారు.

తెలంగాణలో సోమవారం నుంచి టెన్త్ క్లాస్ పబ్లిక్ పరీక్షలు స్టార్ట్ అయ్యాయి. తొలి రోజే తెలుగు పరీక్షకు సంబంధించిన క్వశ్చన్ పేపర్ లీక్ అయిందన్న వార్తలు కలకలం రేపాయి. దీనిపై అధికారులు విచారణ జరుపుతుండగానే మళ్లీ దుమారం రేగింది. రెండో రోజు మంగళవారం జరిగిన హిందీ పరీక్షపైనా సందేహాలు నెలకొన్నాయి.

హిందీ పేపర్ కూడా లీక్ అయిందని ప్రచారం జరుగుతోంది. ఉదయం 9:30 గంటలకు పరీక్ష ప్రారంభం కాగా.. అంతకుముందే ప్రశ్నపత్రం లీక్ అయిందని ఆరోపణలు వచ్చాయి. ఉదయం నుంచే హిందీ పేపర్ వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతోంది. తెలుగు పేపర్ తాండూర్ లో, హిందీ పేపర్ వరంగల్ జిల్లాకు చెందిన వాట్సాప్ గ్రూపుల్లో ప్రత్యక్షమయ్యాయి.

Also Read..Telangana : పరీక్షలు రద్దు చేయటం కాదు .. కేసీఆర్ ప్రభుత్వాన్నే రద్దు చేయాలి : రేవంత్ రెడ్డి

పేపర్ లీక్ వార్తల నేపథ్యంలో పదో తరగతి విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతున్నారు. అయితే, పేపర్ నిజంగానే లీక్ అయిందా.. లేక ఆకతాయిలు చేసిన పనా అనేది తేల్చేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పేపర్ లీక్ వార్తలపై విద్యాశాఖ అధికారులు స్పందించారు. అందులో నిజం లేదన్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు