మియాపూర్ బాలిక అనుమానాస్పద మృతి కేసులో సంచలన ట్విస్ట్.. కన్న తండ్రే..

పొదల్లోకి బాలికను తీసుకెళ్లి జుట్టు పట్టుకుని నేలకేసి కొట్టి హత్య చేశాడు.

Miyapur Girl Death Case (Photo Credit : Google)

Miyapur Girl Death Case : హైదరాబాద్ మియాపూర్ లో బాలిక అనుమానాస్పద మృతి కేసులో ఊహించని ట్విస్ట్ వెలుగుచూసింది. తండ్రే హంతకుడని పోలీసుల విచారణలో తేలింది. బాలిక వసంతని తండ్రి హత్య చేసినట్లుగా పోలీసులు తెలిపారు. బాలికను నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి తన కోరికను తీర్చాలని తండ్రి బలవంత పెట్టాడని, తండ్రి కోరిక విని బాలిక భయంతో గట్టిగా అరిచిందన్నారు. తండ్రి వ్యవహారాన్ని తల్లికి చెప్తానని బాలిక బెదిరించిందన్నారు.

బాలిక తండ్రి బానోతు నరేశ్.. ఆ వీడియోలు చూస్తూ చెడు అలవాట్లకు బానిసయ్యాడని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో తన కోరిక తీర్చాలంటూ బాలికపై ఒత్తిడి తెచ్చాడన్నారు. అమ్మకు చెప్తానని బాలిక గట్టిగా అరవడంతో కోపంతో ఊగిపోయిన తండ్రి.. కన్న కూతురిని హతమార్చాడని వెల్లడించారు.

”నడిగడ్డ తండా సమీపంలోని పొదల్లోకి బాలికను తీసుకెళ్లి జుట్టు పట్టుకుని నేలకేసి కొట్టి హత్య చేశాడు. బాలికను హతమార్చి నిర్మానుష్య ప్రాంతం నుండి బయటకు వచ్చాడు. వారం రోజుల తర్వాత బాలిక మిస్సింగ్ కేసు నమోదైంది. కేసు దర్యాఫ్తు చేస్తుండగా.. ఇంటి సమీపంలోనే బాలిక మృతదేహం కనిపించింది. తండ్రిపై అనుమానంతో మా స్టైల్ లో విచారించాం. కన్న కూతురిని హత్య చేసింది తండ్రే అని తేలింది” అని పోలీసులు చెప్పారు.

Also Read : క్రైమ్ థిల్లర్‌ను తలపించేలా.. కట్టుకున్న భర్తను చంపించిన భార్య.. ట్విస్టులు మామూలుగా లేవు!

ట్రెండింగ్ వార్తలు