గన్‌తో బెదిరించి మహిళా కానిస్టేబుల్‌పై లైంగిక దాడి.. కాళేశ్వరం ఎస్ఐని డిస్మిస్ చేసిన ప్రభుత్వం

ఎస్ఐ భవానీ సేన్ కొంత కాలంగా తనను వేధిస్తున్నట్లు బాధితురాలైన మహిళా కానిస్టేబుల్ పోలీసు ఉన్నతాధికారులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది.

Kaleshwaram SI Bhavani Sen Dismissed (Photo Credit : Google)

Kaleshwaram SI Dismissed : సాధారణ మహిళలు, బాలికలకే కాదు.. రక్షణ కల్పించే మహిళా పోలీసులకే భద్రత కరువైంది. రక్షణ కల్పించాల్సిన పోలీసే భక్షకుడిగా మారాడు. కామంతో కళ్లు మూసుకుపోయి దారుణానికి ఒడిగట్టాడు. గన్ తో బెదిరించి మహిళా కానిస్టేబుల్ పై లైంగిక దాడి చేశాడు. ఈ ఘటనను సీరియస్ తీసున్న ప్రభుత్వం కీచక పోలీస్ పై చర్యలు తీసుకుంది. కాళేశ్వరం ఎస్ఐ భవానీ సేన్ గౌడ్ ను డిస్మిస్ చేసింది ప్రభుత్వం. ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 311 ఆర్టికల్ ప్రకారం సర్వీస్ నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఎస్ఐ భవానీ సేన్ గన్ తో బెదిరించి మహిళా కానిస్టేబుల్ పై లైంగిక దాడి చేయడం సంచలనం రేపింది.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ఎస్ఐ భవానీ సేన్‌ తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితురాలైన మహిళా హెడ్ కానిస్టేబుల్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన డీఎస్పీ.. కాళేశ్వరం పోలీస్ స్టేషన్ లో దీనిపై విచారణ చేపట్టారు. విచారణ తర్వాత ఎస్‌ఐని అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఐ భవానీ సేన్ పై లైంగిక దాడి, ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు.

ఎస్ఐ భవానీ సేన్ కొంత కాలంగా తనను వేధిస్తున్నట్లు బాధితురాలైన మహిళా కానిస్టేబుల్ పోలీసు ఉన్నతాధికారులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది. విధుల్లో ఉన్న తనపై పలుమార్లు లైంగిక దాడి చేసినట్లు ఆరోపించింది. అంతేకాదు ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని ఎస్ఐ భవానీ సేన్ గన్‌తో బెదిరించినట్లు ఆమె వాపోయింది. వేధింపులు ఎక్కువ కావడంతో తట్టుకోలేకపోయిన బాధితురాలు ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసింది. ఎస్పీ ఆదేశాలతో వెంటనే రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు ఎస్పీ భవానీ సేన్ ను అదుపులోకి తీసుకుని విచారించారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. రక్షణ కల్పించాల్సిన పోలీసే ఇలా కామంతో కళ్లు మూసుకుపోయి తోటి ఉద్యోగిపై లైంగిక దాడికి పాల్పడటం పోలీసు వర్గాల్లో సంచలనం రేపింది. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం కీచక ఎస్ఐను సర్వీస్ నుంచి తొలగించింది.

Also Read : క్రైమ్ థిల్లర్‌ను తలపించేలా.. కట్టుకున్న భర్తను చంపించిన భార్య.. ట్విస్టులు మామూలుగా లేవు!

ట్రెండింగ్ వార్తలు