Alpha hotel
సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్‌పై కేసు నమోదైంది. ఆ హోటల్లో పుడ్ టాస్క్ ఫోర్స్ తనిఖీలు చేసింది. పాడైపోయిన మటన్‌తో బిర్యానీ తయారు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఫుడ్ తయారుచేసి ఫ్రిజ్లో పెడుతున్నారు హోటల్ నిర్వాహకులు. అనంతరం కస్టమర్లు వచ్చిన వేళ దాన్ని వేడి చేసి ఇస్తున్నారు.
ఆల్ఫా హోటల్‌లో నాసిరకం వస్తువులతో పాటు దుర్గంధంగా కిచెన్ ఉండడాన్ని ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. ఆల్ఫా హోటల్‌లో తయారు చేసే బ్రెడ్ తో పాటు ఐస్ క్రీమ్ డేట్ బ్యాచ్ లేకుండా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆల్ఫా హోటల్‌కు నోటీసులు జారీ చేసి లక్ష రూపాయల ఫైన్ విధించారు.
ఆల్ఫా హోటల్‌తో పాటు సందర్శిని హోటల్లో కూడా అధికారులు తనిఖీలు చేశారు. మరో బార్‌లో కిచెన్‌ని తనిఖీ చేశారు. హోటళ్లు, రెస్టారెంట్లలో అధికారులు చేస్తున్న తనిఖీల్లో వరుసగా నాసిరకం ఆహార పదార్థాలు, శుభ్రత పాటించని కిచెన్ కనపడుతున్నాయి. ప్రజల ఆరోగ్యంతో హోటళ్ల నిర్వాహకులు చెలగాటం ఆడుతున్నారు.
Also Read: తమిళనాడు కల్తీసారా ఘటనలో 25కి చేరిన మృతుల సంఖ్య