TGSRTC announces lifetime free bus pass to girl child born in karimnagar bus stand
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. కరీంనగర్ బస్ స్టేషన్‌లో పుట్టిన చిన్నారికి టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో జీవిత కాలం ఉచితంగా ప్రయాణించేలా బస్ పాస్‌ను అందిస్తున్నట్లు ప్రకటించింది. ఆర్టీసీ బస్సులు, బస్ స్టేషన్‌లో జన్మించే చిన్నారులకు జీవిత కాలం ఫ్రీగా బస్ పాస్ ఇవ్వాలని గతంలో యాజమాన్యం తీసుకున్న నిర్ణయం మేరకు కరీంనగర్ బస్ స్టేషన్‌లో పుట్టిన ఆడపిల్లకు లైఫ్ టైం ఫ్రీగా బస్‌పాస్‌ను మంజూరు చేస్తున్నట్లు తెలిపింది.
పురిటినొప్పులతో కరీంనగర్ బస్టాండ్‌లో బాధపడుతున్న గర్భిణికి చీరను అడ్డుకట్టి కాన్పు చేసి మానవత్వం చాటిన తమ సిబ్బందిని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం అభినందించింది. సంస్థ ఉన్నతాధికారులతో కలిసి టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ బుధవారం హైదరాబాద్ బస్ భవన్‌లో వారిని సన్మానించారు.
జూన్ 16న కుమారి అనే గర్భిణీ, తన భర్తతో కలిసి భద్రాచలం బస్సు ఎక్కేందుకు కరీంనగర్ బస్టాండ్‌కు వచ్చారు. బస్టాండ్‌లో ఉన్న సమయంలో ఆమెకు పురిటి నొప్పులు ఎక్కువ అయ్యాయి. దీన్ని గమనించిన ఆర్టీసీ సిబ్బంది 108కి ఫోన్ చేశారు. కుమారికి నొప్పులు ఎక్కువ కావడంతో అక్కడ ఉన్న ఆర్టీసీ మహిళా సిబ్బంది చీరలను అడ్డుపెట్టి నార్మల్ డెలివరీ చేశారు. కుమారికి ఆడపిల్ల పుట్టింది.
అధికారపక్షమా.. ప్రతిపక్షమా.. గ్రేటర్‌లో బీఆర్ఎస్ కార్పొరేటర్ల పరిస్థితి ఏంటి?
అనంతరం వారిని అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు. తల్లీబిడ్డా ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమయస్పూర్తితో వ్యవహారించి సకాలంలో కాన్పు చేసిన ఆర్టీసీ సిబ్బంది సైదమ్మ, లావణ్య, స్రవంతి, భవాని, రేణుక, రజనీ కృష్ణ, అంజయ్య సేవలను టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ మెచ్చుకున్నారు. ఆపద సమయంలో సేవాతర్పరతను ఆర్టీసీ సిబ్బంది చాటుతుండటం గొప్ప విషయం అని అన్నారు. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చడంతో పాటు.. వారి ఆపద సమయంలో తాము ఉన్నామనే భరోసా కల్పిస్తుండటం అభినందనీయం అని ప్రశంసించారు.
▶️కరీంనగర్ బస్ స్టేషన్ లో పుట్టిన చిన్నారికి జీవితకాలం ఉచిత బస్ పాస్
▶️ప్రకటించిన #TGSRTC యాజమాన్యం
▶️డెలివరీ చేసి మానవత్వం చాటిన ఆర్టీసీ సిబ్బందికి ఘన సన్మానం
కరీంనగర్ బస్ స్టేషన్ లో పుట్టిన చిన్నారికి తమ బస్సుల్లో జీవిత కాలం ఉచితంగా ప్రయాణించేలా బస్ పాస్ ను అందిస్తున్నట్లు… pic.twitter.com/vVV8Bdo4ro
— VC Sajjanar – MD TGSRTC (@tgsrtcmdoffice) June 19, 2024