Rayalaseema Kings Official Team Anthem ThipparaaMeesam
స్థానిక క్రికెటర్లను ప్రోత్సహించే లక్ష్యంతో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) నిర్వహిస్తున్న ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) మూడో సీజన్ కు రంగం సిద్ధమైంది. జూన్ 30 నుంచి జూలై 13 వరకు ఈ టోర్నీ జరగనుంది. ఈ నేపథ్యంలో టీమ్, అభిమానుల్లో స్పూర్తి నింపేందుకు బి.దశరథ్ రాం రెడ్డి యాజమాన్యంలోని డిఫెండింగ్ ఛాంపియన్ రాయలసీమ కింగ్స్ ఓ పాటను విడుదల చేసింది. తిప్పర మీసం అంటూ పాట సాగుతోంది.
వివివి అప్పారావు కోచ్ కోచింగ్‌లో ఆల్‌రౌండర్ గిరినాథ్ రెడ్డి నాయకత్వంతో రాయలసీమ కింగ్స్ బరిలోకి దిగనుంది. తెలుగు రాష్ట్రాల నుండి క్రీడా నైపుణ్యమున్న అండర్ 23 స్టార్లతో జట్టులో సగానికి పైగా యువ క్రికెటర్ల ప్రతిభతో నిండి ఉంది. గతేడాది ఫైనల్‌లో కోస్టల్ రైడర్స్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించి ఛాంపియన్‌గా నిలిచింది.
David Johnson : టీమ్ఇండియా మాజీ క్రికెటర్ ఆత్మహత్య.. అపార్టుమెంట్ పై నుంచి కిందకు దూకి..!
మూడో సీజన్‌ను స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు, స్టార్ స్పోర్ట్స్ ఫస్ట్, ఫ్యాన్‌కోడ్‌లో ప్రసారం కానుంది. వైజాగ్‌లోని వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో మూడో సీజన్ జరగనుంది. ఈ క్రమంలో జట్టులో స్పూర్తి నింపేందుకు అభిమానుల్లో ఉత్సాహం తీసుకువచ్చేందుకు తిప్పర మీసం అంటూ సాగే పాటను విడుదల చేశారు. పవన్ కుమార్ స్వరపరిచగా, సురేష్ బనిసెట్టి ఈ పాటను రాశారు. యువ ప్రతిభను ప్రోత్సహించే రాయలసీమ రాజుల ఆనవాయితి, దృక్పథాన్ని ఈ గీతం ప్రతిబింబిస్తుంది.
ఆంధ్రా ప్రీమియర్ లీగ్ 3వ సీజన్‌లో రాయలసీమ కింగ్స్ తన తొలి మ్యాచ్‌ను జూన్ 30న కోస్టల్ రైడర్స్‌తో ఆడనుంది. జూలై 2న వైజాగ్ వారియర్స్‌తో, జూలై 3న మార్లిన్ గోదావరి టైటాన్స్‌తో, జూలై 7న ఉత్తరాంధ్ర లయన్స్‌తో, జూలై 8న బెజవాడ టైగర్స్‌తో పోటీ పడనుంది. ఈ మ్యాచులు అన్ని విశాఖ వేదికగా జరుగుతాయి.
Pakistan : 17 మంది ఆటగాళ్లు.. 60 గదులు.. ఏం తమాషాగా ఉందా..?