రఘునందన్‌తో హరీష్ రావు చెట్టా పట్టాల్.. త్వరలోనే బీజేపీలోకి: ప్రభుత్వ విప్‌లు

పోర్లు దండాలు పెట్టిన హరీష్ రావుకు బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు ఇవ్వరు. మీడియా ముందు మాట్లాడకపోతే మామకి అనుమానం వస్తుందని హరీష్ భయపడుతున్నాడు.

Adluri Laxman, Kumar Beerla Ilaiah: బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు త్వరలోనే బీజేపీలోకి వెళ్తారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్‌లు బీర్ల ఐలయ్య, అడ్లూరి లక్ష్మణ్ జోస్యం చెప్పారు. హైదరాబాద్‌లో అసెంబ్లీ మీడియా హాలులో మంగళవారం వీరు మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయడం ఖాయమని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలపడుతుందన్న భయంతోనే బీఆర్ఎస్, బీజేపీ చేతులు కలిపాయని ఆరోపించారు.

కేసీఆర్, కేటీఆర్ గాయబ్
”పోర్లు దండాలు పెట్టిన హరీష్ రావుకు బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు ఇవ్వరు. బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తారు. హరీష్ రావు తన స్థాయికి తగ్గట్టు మాట్లాడాలి. చిల్లర మాటలు మానకపోతే ప్రజలు ఉరికించి కొడతారు. బీఆర్ఎస్ చేసిన పాపాలను కడుక్కోవాలి. మీడియా ముందు మాట్లాడకపోతే మామకి అనుమానం వస్తుందని హరీష్ భయపడుతున్నాడు. పార్లమెంట్ ఎన్నికల అయిపోయినప్పటి నుంచి కేసీఆర్, కేటీఆర్ గాయబ్ అయ్యారు. ప్రజలు పరువు తీసినా బీఆర్ఎస్ నేతలకు సిగ్గు రావడం లేదు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కోసం బీఆర్ఎస్ అవయవదానం చేసింది. గత ప్రభుత్వ పాలన కంటే మా పాలన బాగుందని ప్రజలు చెబుతున్నారు. జూలై 17 నుంచి రుణమాఫీ చేస్తామ”ని బీర్ల ఐలయ్య అన్నారు.

బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు
”సిద్దిపేట, సిరిసిల్ల మా అడ్డా అంటారు. మీ అడ్డాలో మీ పార్టీ పరిస్థితి ఏమయింది? రఘునందన్, హరీష్ రావు మధ్య లోపాయికార ఒప్పందం ఉంది. హరీష్, రఘునందన్ చెట్టా పట్టాల్ వేసుకొని తిరుగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో రెండవ స్థానంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ, పార్లమెంట్ ఎన్నికల్లో మూడవ స్థానానికి ఎందుకు దిగజారింది?అబద్ధాన్ని నిజమని నమ్మించడంలో హరీష్ రావు నేర్పరి. రేవంత్ నాయకత్వం బలపడుతుందన్న భయంతోనే బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటైయ్యాయి. బీజేపీకి ఓటేయాలని బీఆర్ఎస్ నేతలు తమ క్యాడర్ కి చెప్పార”ని అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు.

Also Read: నీట్ పరీక్ష అక్రమాలపై చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ ఎందుకు నోరు విప్పడం లేదు?

ట్రెండింగ్ వార్తలు