Chennai : చెన్నై మేయర్‌గా తొలి దళిత మహిళ..28 ఏళ్ల ప్రియ రికార్డు

చెన్నై మేయర్‌గా తొలిసారి ఓ దళిత మహిళ ఎన్నికయ్యారు.నగర మున్సిపల్‌ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన అధికార పార్టీ డీఎంకేకి చెందిన 28 ఏళ్ల ఆర్ ప్రియ మేయర్ గా ప్రమాణస్వీకారం చేశారు

dalith woman set to new Chennai Mayor : చెన్నై నగరపాలక సంస్థ మేయర్‌గా తొలిసారి ఓ దళిత మహిళ ఎన్నికయ్యారు. నగర మున్సిపల్‌ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన అధికార పార్టీ డీఎంకేకి చెందిన 28 ఏళ్ల ఆర్ ప్రియ (R. Priya, 28 year old) మేయర్‌గా శుక్రవారం (మార్చి 4,2022) ఉదయం 9.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె ప్రమాణస్వీకారంతో మేయర్‌ అయిన తొలి దళిత మహిళగా..అతి పిన్నయస్కురాలిగా ఆమె రికార్డుల్లోకెక్కారు.

అలాగే చెన్నై మేయర్‌ అయిన మూడో మహిళగా కూడా నిలిచారు ప్రియ. గతంలో తారా చెరియన్ , కామాక్షి జయరామన్ చైన్నై మేయర్లుగా పనిచేయగా మూడో మహిళగా అందులోను దళిత మహిళగా ప్రియ రికార్డు సృష్టించారు. నగరంలోని దక్షిణ ప్రాంతాలకు చెందిన డీఎంకే కౌన్సిలర్ ఎం.మకేష్ కుమార్ మధ్యాహ్నం 2.30 గంటలకు డిప్యూటీ మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Also read : CM surprise visit to school : పాఠశాలలో సీఎం స్టాలిన్ ఆకస్మిక తనిఖీలు..షాక్ అయిన ఉపాధ్యాయులు, విద్యార్ధులు

2021జనవరిలో జరిగిన చెన్నై కార్పొరేషన్‌ ఎన్నికల్లో కౌన్సిలర్‌గా గెలుపొందిన యువ అభ్యర్థులలో ప్రియ కూడా ఒకరు. వారిలో డీఎంకే మిత్రపక్షమైన సీపీఎంకి చెందిన 21 ఏళ్ల ప్రియదర్శిని అతి చిన్న వయస్సుగల యువతిగా రికార్డు సృష్టించారు. తీనాంపేట 98వ వార్డు నుంచి ప్రియదర్శిని గెలుపొందారు. 74వ వార్డు అయిన తిరు వీ కా నగర్‌ నుంచి గెలుపొందిన ప్రియా.. ఉత్తర చెన్నై నుంచి ఎంపికైన మొదటి మేయర్‌గా కూడా రికార్డ్ సృష్టించారు.

426 చ.కి.మీలో 61 లక్షల కంటే ఎక్కువ మంది ఓటర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న గ్రేటర్ చెన్నై కార్పొరేషన్‌ (జీసీసీ)లో 200 వార్డులు ఉండగా.. డీఎంకే 153 స్థానాల్లో విజయం సాధించింది. అన్నాడీఎంకే 15, కాంగ్రెస్‌ 13, ఇండిపెండెట్లు 5, సీపీఎం 4, వీసీకే 4, బీజేపీ 1 స్థానం చొప్పున గెలుపొందాయి.

Also read : CM Stalins : తన కాన్వాయ్‌ను నిలిపివేసి..అంబులెన్స్‌కు దారిచ్చిన సీఎం స్టాలిన్‌

మేయర్ గా ప్రమాణస్వీకారం చేసిన ప్రియా మీడియాతో మాట్లాడుతూ..‘‘సీఎం ఎంకే స్టాలిన్ తనకు ఆదర్శమని అన్నారు. మా నాయకుడు దళిత మహిళను ఎంపిక చేసి ప్రజలకు సేవ చేసే అవకాశం ఇచ్చారు. రోడ్ల అభివృద్ధికే నా ప్రాధాన్యత. చాలా ప్రాంతాల్లో రోడ్లు అస్సలు బాగాలేదు. ముఖ్యంగా వర్షం వస్తే..వరలుగా మారే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితిని మారుస్తామని ధీమా వ్యక్తంచేశారు.నగర పరిశుభ్రతపై కూడా దృష్టి సారిస్తామని అన్నారు. మహిళలకు ఉపాధి కల్పనకు చర్యలు తీసుకుంటాం అని అన్నారు.

ట్రెండింగ్ వార్తలు