Ind Vs WI T20 : క్లీన్ స్వీప్ పై కన్నేసిన రోహిత్ సేన

లెటెస్ట్ గా విండీస్ జట్టుతో జరుగుతున్న టీ20 సిరీస్ లో కూడా రెండు మ్యాచ్ లు టీమిండియా గెలిచిన సంగతి తెలిసిందే...ఆదివారం కోల్ కతాలో సాయంత్రం 7.00 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

West Indies Tour Of India : టీమిండియా సారథి రోహిత్ శర్మ…మూడో టీ20పై కన్నేశాడు. గత సంవత్సరం టీ20 ప్రపంచ కప్ తర్వాత పరిమిత ఓవర్ల కెప్టెన్సీ ఇతనికి అప్పగించారు. అనంతరం టెస్టు క్రికెట్ పగ్గాలు కూడా అందుకున్నాడు. దీంతో ఫుల్ జోష్ లో ఉన్న రోహిత్…విజయాలు అందిస్తున్నాడు. న్యూజిలాండ్ తో 3-0తో టీ 20 సిరీస్, విండీస్ 3-0 వన్డే సిరీస్ లో రోహిత్ సేన విజయం సాధించింది.

Read More : Rohit Sharma: కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. వైస్ కెప్టెన్ ఎవరంటే? టెస్ట్ జట్టు ఇదే!

ఇక లెటెస్ట్ గా విండీస్ జట్టుతో జరుగుతున్న టీ20 సిరీస్ లో కూడా రెండు మ్యాచ్ లు టీమిండియా గెలిచిన సంగతి తెలిసిందే. 2022, ఫిబ్రవరి 20వ తేదీ ఆదివారం కోల్ కతాలో సాయంత్రం 7.00 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. కానీ.. కీలక మ్యాచ్ లో టీమిండియా తరపున ఎవరు ఆడుతారు ? ఎవరిని సెలెక్ట్ చేస్తారనేది ఉత్కంఠగా మారింది. విరాట్ కోహ్లీతో పాటు రిషబ్ పంత్ కు బీసీసీఐ విశ్రాంతి కల్పించింది.

రిజర్వ్ బెంచ్ లో ఉన్న క్రీడాకారులకు ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్ లను తీసుకుంటారని తెలుస్తోంది.

Read More : విజయం ఆత్మ విశ్వాసం నింపింది : రోహిత్ శర్మ

కేఎల్ రాహుల్ గాయపడడంతో ఇషాన్ కిషన్ ను తీసుకున్నారు. కానీ ఇతను పేలవమైన ఆటతీరు కనబర్చడంతో ఈసారి రుతురాజ్ ను తుది జట్టులోకి తీసుకొనే అవకాశం ఉంది. బౌలర్ల జాబితాలో సీనియర్లు బుమ్రా, షమి ఈ సిరిస్ లో అందుబాటులో ఉండడం లేదు. మహ్మద్ సిరాజ్, అవేశ్ ఖాన్, దీపక్ హుడాలకు అవకాశం దక్కుతుందని తెలుస్తోంది. భువనేశ్వర్, హర్షల్ పటేల్ లు కూడా మ్యాచ్ ల్లో రాణిస్తున్నారు. వీరిలో ఎవరిని తీసుకుంటారో చూడాలి. విండీస్ కూడా విజయం సాధించాలని పట్టుదలతో ఉంది. దీంతో ఈ కీలకమైన ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారనేది ఉత్కంఠగా మారింది.

ట్రెండింగ్ వార్తలు