IND vs CAN : టీ20 ప్రపంచ కప్.. భారత్, కెనడా మ్యాచ్‌ రద్దు.. కారణం ఇదే!

IND vs CAN : మ్యాచ్ రద్దు కావడంతో భారత్, కెనడా జట్లకు తలో పాయింట్ కేటాయించారు. ఫలితంగా గ్రూప్‌ దశను భారత్ 7 పాయింట్లు 3 గెలిచి ఒక మ్యాచ్ రద్దుతో ముగించింది.

IND vs CAN : టీ20 ప్రపంచ కప్‌ 2024లో భాగంగా గ్రూప్‌ ‘ఎ’లో కెనడాతో జరగాల్సిన టీమిండియా మ్యాచ్ రద్దు అయింది. కనీసం టాస్‌ కూడా పడలేదు. మ్యాచ్‌ జరిగే సమయానికి బ్రోవార్డ్‌ కౌంటీలో భారీ వర్షం పడింది. దాంతో భారత్, కెనడా మ్యాచ్‌కు ఒక బంతి కూడా పడకుండానే నిలిచిపోయింది.

Read Also : IND vs CAN : కెన‌డాతో మ్యాచ్‌.. టీమ్ఇండియా అభిమానుల‌కు బ్యాడ్‌న్యూస్‌..

కొద్దిసేపటికి వర్షం ఆగిపోయినప్పటికీ కూడా మైదానం తడిగా ఉండటంతో మ్యాచ్ ఆడటం సాధ్య పడదని భావించి చివరికి అంపైర్లు రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించారు. అప్పటికే అంపైర్లు రెండుసార్లు గ్రౌండ్‌ని పరిశీలించారు. మ్యాచ్ రద్దు కావడంతో భారత్, కెనడా జట్లకు తలో పాయింట్ కేటాయించారు. ఫలితంగా గ్రూప్‌ దశను భారత్ 7 పాయింట్లు 3 గెలిచి ఒక మ్యాచ్ రద్దుతో ముగించింది. ఈ టోర్నీలో ఇప్పటికే సూపర్-8కు భారత్ అర్హత సాధించిన సంగతి తెలిసిందే.

ఈ నెల 20న మొదటి మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌తో భారత్ తలపడనుంది. ఈ నెల 22న రెండో మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ గానీ బంగ్లాదేశ్‌‌తో తలపడనుంది. జూన్ 24న చివరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో టీమిండియా ఆడనుంది. సూపర్-8లో 2 గ్రూపుల్లో టాప్‌ 2లో నిలిచిన జట్లు మాత్రమే సెమీస్‌కు చేరుకుంటాయి. ఈ నెల 26న మొదటి సెమీస్‌, 27న రెండో సెమీస్ మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. ఈ నెల 29న బార్బడోస్‌లో ఫైనల్ మ్యాచ్ జరుగనుంది.

Read Also : Shoaib Akhtar : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ నుంచి పాకిస్తాన్ ఔట్‌.. షోయ‌బ్ అక్త‌ర్ సింగిల్ లైన్ పోస్ట్ వైర‌ల్‌..

ట్రెండింగ్ వార్తలు