Shoaib Akhtar : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ నుంచి పాకిస్తాన్ ఔట్‌.. షోయ‌బ్ అక్త‌ర్ సింగిల్ లైన్ పోస్ట్ వైర‌ల్‌..

అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024 నుంచి పాకిస్తాన్ నిష్ర్క‌మించింది.

Shoaib Akhtar : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ నుంచి పాకిస్తాన్ ఔట్‌.. షోయ‌బ్ అక్త‌ర్ సింగిల్ లైన్ పోస్ట్ వైర‌ల్‌..

Shoaib Akhtar One Line Post Goes Viral After Pakistan Exit From T20 World Cup 2024

Shoaib Akhtar-Pakistan : అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024 నుంచి పాకిస్తాన్ నిష్ర్క‌మించింది. శుక్ర‌వారం ఫ్లోరిడా వేదిక‌గా అమెరికా, ఐర్లాండ్ జ‌ట్ల మ‌ధ్య జ‌ర‌గాల్సిన మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దు కావడంతో పాక్ గ్రూపు ద‌శ నుంచే ఇంటి బాట ప‌ట్ట‌క త‌ప్ప‌డం లేదు. పాకిస్తాన్ ప్ర‌పంచ‌క‌ప్ నుంచి నిష్ర్క‌మించ‌డంతో ఆ దేశం పై విమ‌ర్శల జ‌డివాన మొద‌లైంది. క్రీడాపంతుల నుంచి నెటిజ‌న్లు వ‌ర‌కు పాక్ ఆట‌గాళ్ల‌ను దుమ్మెత్తి పోస్తున్నారు.

ఈ క్ర‌మంలో పాకిస్తాన్ ప్ర‌పంచ‌క‌ప్ నిష్ర్క‌మ‌ణ‌పై ఆ జ‌ట్టు మాజీ ఆట‌గాడు షోయ‌బ్ అక్త‌ర్ స్పందించాడు. సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న అసంతృప్తిని వ్య‌క్తం చేశాడు. ‘ప్ర‌పంచ‌క‌ప్‌లో పాకిస్తాన్ జ‌ర్నీ ముగిసింది.’ అంటూ ఒకే ఒక లైన్‌లో పోస్ట్ చేశాడు. ప్ర‌స్తుతం షోయ‌బ్ చేసిన పోస్ట్ వైర‌ల్‌గా మారింది.

Afghanistan : సూప‌ర్ 8కి ముందు అఫ్గాన్‌కు బిగ్ షాక్‌.. కోలుకోవ‌డం క‌ష్ట‌మేనా..!

పాకిస్తాన్ త‌న మొద‌టి మ్యాచ్‌లో అమెరికా, రెండో మ్యాచ్‌లో భార‌త్ చేతిలో ఓడిపోయింది. దీంతో ఆ జ‌ట్టు సూప‌ర్ 8 అవ‌కాశాలు సంక్లిష్టం అయ్యాయి. కెన‌డా పై ఘ‌న విజ‌యం సాధించి మిణుకుమిణుకుమంటున్న ఆశ‌ల‌ను స‌జీవంగా ఉంచుకుంది. అయితే.. ఐర్లాండ్‌, అమెరికా జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ వ‌ర్షం కారణంగా ర‌ద్దైంది. అమెరికాకు, ఐర్లాండ్‌కు ఒక్కొ పాయింట్‌ను కేటాయించారు.

దీంతో అమెరికా ఖాతాలో ఐదు పాయింట్లు వ‌చ్చి చేరాయి. పాక్ ఖాతాలో రెండు పాయింట్లు మాత్ర‌మే ఉన్నాయి. ఆదివారం త‌న ఆఖ‌రి లీగు మ్యాచ్‌లో ఐర్లాండ్ పై విజ‌యం సాధించినా గానీ పాక్ గ‌రిష్టంగా నాలుగు పాయింట్ల‌కే చేరుకుంటుంది. ఎక్కువ పాయింట్ల ఉండ‌డంతో అమెరికా అధికారికంగా సూప‌ర్ 8కి చేరుకుంది. గ్రూపు ఏ నుంచి ఇప్ప‌టికే భార‌త్ సూప‌ర్ 8కి చేరుకున్న సంగ‌తి తెలిసిందే.

Bye Bye Pakistan : ఆజం ఖాన్ పాక్‌కు వెళ్ల‌డు.. బై బై పాకిస్తాన్ ట్రెండింగ్‌.. మీమ్స్ వైర‌ల్‌