Afghanistan : సూప‌ర్ 8కి ముందు అఫ్గాన్‌కు బిగ్ షాక్‌.. కోలుకోవ‌డం క‌ష్ట‌మేనా..!

కీల‌క సూప‌ర్ 8కి ముందు అఫ్గాన్‌కు గ‌ట్టి షాక్ త‌గిలింది.

Afghanistan : సూప‌ర్ 8కి ముందు అఫ్గాన్‌కు బిగ్ షాక్‌.. కోలుకోవ‌డం క‌ష్ట‌మేనా..!

Mujeeb ur Rahman

Afghanistan – Mujeeb ur Rahman : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024లో అఫ్గానిస్తాన్ జ‌ట్టు అద‌ర‌గొడుతోంది. హ్యాట్రిక్ విజ‌యాల‌ను సాధించి సూప‌ర్ 8కి అర్హ‌త సాధించింది. దీంతో ఆ జ‌ట్టు ఆట‌గాళ్ల‌తో పాటు అభిమానులు ఎంతో సంతోషంగా ఉన్నారు. కీల‌క సూప‌ర్ 8కి ముందు అఫ్గాన్‌కు గ‌ట్టి షాక్ త‌గిలింది. ఆ జ‌ట్టు స్టార్ స్పిన్న‌ర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్ గాయ‌ప‌డ్డాడు. దీంతో అత‌డు ఈ టోర్నీలోని మిగిలిన మ్యాచ్‌ల నుంచి త‌ప్పుకున్నాడు. అత‌డి స్థానంలో ఓపెన‌ర్ హజ్రతుల్లా జజాయ్ ను అఫ్గానిస్తాన్ జ‌ట్టులోకి తీసుకుంది. ఇందుకు అంత‌ర్జాతీయ క్రికెట‌ర్ కౌన్సిల్ అంగీక‌రించింది.

ముజీబ్ ఈ ప్ర‌పంచ‌క‌ప్‌లో ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు. ఉగాండాతో జ‌రిగిన మ్యాచ్‌లో ముజీబ్ చేతికి గాయ‌మైంది. ఈ మ్యాచ్‌లో అత‌డు మూడు ఓవ‌ర్లు వేసి 16 ప‌రుగులు ఇచ్చాడు. ఓ వికెట్ ప‌డ‌ట్టాడు. ఈ మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ 125 ప‌రుగుల భారీ తేడాతో విజ‌యాన్ని అందుకుంది.

IND vs CAN : కెన‌డాతో మ్యాచ్‌.. టీమ్ఇండియా అభిమానుల‌కు బ్యాడ్‌న్యూస్‌..

23 ఏళ్ల ఈ స్పిన్న‌ర్ అఫ్గాన్ త‌రుపున 46 టీ20మ్యాచులు ఆడాడు. 59 వికెట్లు ప‌డ‌గొట్టాడు. అఫ్గాన్ జ‌ట్టులో కీల‌క ప్లేయ‌ర్ల‌లో ఒక‌డైన ముజీబ్ కీల‌క‌మైన సూప‌ర్ 8కి ముందు దూరం కావ‌డం నిజంగా ఆ జ‌ట్టుకు పెద్ద ఎదురుదెబ్బ‌గా చెప్ప‌వ‌చ్చు.

లీగు ద‌శ‌లో అఫ్గాన్‌ త‌న చివ‌రి మ్యాచ్‌ను మంగ‌ళ‌వారం (జూన్ 18న) వెస్టిండీస్‌తో ఆడ‌నుంది. ఇక సూప‌ర్ 8లో ఆ జ‌ట్టు జూన్ 20న భార‌త్‌, జూన్ 22న ఆస్ట్రేలియాతో, జూన్ 24న బంగ్లాదేశ్‌/నెద‌ర్లాండ్స్‌తో త‌ల‌ప‌డ‌నుంది.

Bye Bye Pakistan : ఆజం ఖాన్ పాక్‌కు వెళ్ల‌డు.. బై బై పాకిస్తాన్ ట్రెండింగ్‌.. మీమ్స్ వైర‌ల్‌